
టమాటా.. చిలుక
ఫై ఫొటో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులా కన్పిస్తుంది కదూ. ఇది సహజ సిద్ధంగా కాసిన టమాట. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం కోమటికుంటకు చెందిన గిరిజన మహిళ తన తోటలో కాసిన టమాటాలను తెచ్చి మంగళవారం సూర్యాపేట కొత్తబస్టాండ్ సమీపంలో విక్రయించింది. వసుకుల శ్రీనివాస్ కొనుగోలు చేసిన టమాటాల్లో ఒకటి ఇలా చిలుక ఆకారంలో కనిపించింది. - సూర్యాపేట