మంత్రి రామన్నతో గిరిజన మహిళ
దేవరకొండ: వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో రెండొందల పెన్షనొచ్చినా.. మంచిగా ఉండె.. వంద రూపాయలిస్తే సంచి నిండా సరుకులొచ్చేరుు. ఇప్పుడు ధరలన్నీ పెరిగి నయ్.. సరుకులు రావడం లేదు.. కూలీ రేట్లు పెరగలేదు. ఎట్ల బతకాలె? అని చం దంపేట మండలం పోలేపల్లి వన నర్సరీని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి జోగు రామన్నను అక్కడ కూలీ రమావత్ నాన్కి నిలదీశారు. మంత్రి కూలీల యోగక్షే మాలను తెలుసుకుంటుండగా అప్పుడు పెన్షన్ రెండొందలొచ్చినా సరిపోయేవి.. ఇప్పుడు వెయ్యొచ్చినా సరిపోవట్లే అని పేర్కొంది. దీంతో అక్కడ ఉన్నవారు ఆ మహిళను వారించబోయారు. మంత్రి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వైఎస్ హయాంలోనే మంచిగా ఉండె
Published Tue, Dec 6 2016 1:53 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement