శవంతో 5 రోజులు ఒంటరిగా గడిపింది! | Bengal woman found living with father's corpse | Sakshi
Sakshi News home page

శవంతో 5 రోజులు ఒంటరిగా గడిపింది!

Published Mon, Jul 4 2016 7:26 PM | Last Updated on Thu, Aug 16 2018 4:22 PM

శవంతో 5 రోజులు ఒంటరిగా గడిపింది! - Sakshi

శవంతో 5 రోజులు ఒంటరిగా గడిపింది!

కోల్కతా: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని గిరిజన మహిళ ఐదు రోజులు ఇంట్లో ఒంటరిగా గడిపిన ఘటన పశ్చిమ బెంగాల్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. బరద్వాన్ జిల్లాలోని ముక్తర్ఫార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో, ఏదో జరిగిందన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహంతో మహిళ ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకోవడం ఇక్కడి గిరిజనుల ఆచారమని చెబుతున్నారు. మృతి చెందిన వ్యక్తిని పాంచు సొరేన్గా గుర్తించామని, నాలుగైదు రోజుల క్రితమే అతడు చనిపోయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి తన సోదరి అస్తిపంజరం రెండు నెలలు గడిపిన ఘటన గతేడాది జూన్ లో వెలుగు చూసిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement