
తుదిశ్వాస వరకు జగనన్న వెంటే..వంతల రాజేశ్వరి
మారుమూల ప్రాంతానికి చెందిన నిరుపేద గిరిజన మహిళ నైన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభకు వెళ్లేందుకు అవకాశం కల్పించిన జగనన్న వెంటే నా తుది శ్వాస వరకూ ఉంటానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు.
రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
రంపచోడవరం, న్యూస్‌లైన్ : మారుమూల ప్రాంతానికి చెందిన నిరుపేద గిరిజన మహిళ నైన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభకు వెళ్లేందుకు అవకాశం కల్పించిన జగనన్న వెంటే నా తుది శ్వాస వరకూ ఉంటానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. గిరిజనులపై తరగని ప్రేమాభిమానాలను జగనన్న చూపించారన్నారు.
మండలంలోని వాడపల్లి సర్పంచ్ కోసు వెంకటరమణ వివాహానికి ఎమ్మెల్యే రాజేశ్వరి, రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) సోమవారం హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వారి స్వార్థం కోసం ఇద్దరు ఎంపీలు పార్టీని విడిచి వెళ్లినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదన్నారు.
అనంతరం గ్రామంలో గిరిజనులను కలసి ఎన్నికల్లో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కొంత మంది గిరిజనులు చెప్పిన సమస్యలను విన్నారు. త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, ఎంపీటీసీ సభ్యురాలు కారుకోడి పూజ, కాంతం, నాయకులు కాపారపు రూతూ, రామాంజనేయులు, సీహెచ్ రాజు, నాగు తదితరులు పాల్గొన్నారు.