గిరిజన యువతిపై గ్యాంగ్ రేప్ | West Bengal: Another 'gangrape', 20-yr old tribal woman very critical | Sakshi
Sakshi News home page

గిరిజన యువతిపై గ్యాంగ్ రేప్

Published Thu, Jan 23 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM

West Bengal: Another 'gangrape', 20-yr old tribal woman very critical

సూరి(పశ్చిమబెంగాల్): వేరే వర్గానికి చెందిన వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో 20 ఏళ్ల గిరిజన యువతిపై 13 మంది సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బిర్భుమ్ జిల్లాలోని లభ్‌పూర్‌లో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. 13 మంది నిందితులను, ఆ యువతితో సన్నిహితంగా ఉండే యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి ప్రస్తుతం సూరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. తమ కూతురికి వేరే వర్గానికి చెందినవాడితో సంబంధం ఉందని తమ వర్గానికి చెందినవారే పంచాయితీ పెట్టి ఈ శిక్ష విధించారని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement