![Peedika Rajanna Dora Fire On Chandrababu Naidu](/styles/webp/s3/filefield_paths/545455.jpg.webp?itok=JR7izCj8)
2014లో బాబు ఫేక్ హామీలను నమ్మి ప్రజలు ఓటేస్తే నట్టేట ముంచారు
అబద్ధాలు, గిమ్మిక్కులతో మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారు
దిగ్విజయంగా అమలవుతున్న వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోతోనే అభివృద్ధి
ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం కోసం అర్రులు చాస్తూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు సహా టీడీపీ గ్యాంగ్ జన్మహక్కులా ఉందని, వారిని మళ్లీ నమ్మితే రాష్ట్రం గతి అధోగతి పాలవుతుందని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో విశాఖ సదస్సు ద్వారా 13.11 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 3.47 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. అంతకుముందు చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఎంత సంపద సృష్టించారో చెప్పమనండి. ఆయన పరిపాలనలోనే రాష్ట్రం కరువులో ఉంద’ని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల్లో భాగంగా శాశ్వత భూమి హక్కు కలి్పంచేందుకు సర్వే చేయాలని సూచించిందని, కానీ దాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని ప్రస్తావించారు. రైతులే తమ భూసమస్యల శాశ్వత పరిష్కారానికి, పటిష్టమైన భూరికార్డుల కోసం భూసర్వే జరగాలని కోరుకుంటున్నారన్నారు. వ్యవసాయ రంగానికి చంద్రబాబు రూ.34,185 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.55,215 కోట్లు కేటాయించిన విషయాన్ని మరచిపోకూడదన్నారు.
గ్రామీణాభివృద్ధికి చంద్రబాబు కేవలం రూ.46,895 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.92,655 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇలా ఏ రంగం చూసినా చంద్రబాబు కన్నా జగన్‌మోహన్‌రెడ్డే నంబరు ఒన్‌గా ఉన్నారన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో చెప్పిన ఫేక్ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేటముంచారని విమర్శించారు. అందుకే 2019 ఎన్నికల్లో చారిత్రాత్మకమైన తీర్పుతో చంద్రబాబును హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు పరిమితం చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో ఓట్ల కోసం ఫేక్ పథకాలను సూపర్ సిక్స్ అంటూ అబద్దాలు, గిమ్మిక్కులతో చంద్రబాబు గ్యాంగ్ వస్తున్నారని ఎద్దేవా చేశారు.
వాటి అమలుకే సుమారు రూ.75వేల కోట్లు ఖర్చు ఉంటుందని, ఆచరణయోగ్యం కాకున్నా అధికార యావతో అన్నీ అమలుచేసేస్తామని చెబుతున్నారని విమర్శించారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేసిందనీ, ఇకపై కూడా ఆయా పథకాల ద్వారా కలిగే ప్రయోజనాన్ని మరింత పెంచుతూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 2024 మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు. దిగి్వజయంగా అమలవుతున్న ఈ మేనిఫెస్టోతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకు కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి పనులే నిదర్శనమని రాజన్నదొర చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment