Peedika Rajanna Dora
-
పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై పీడిక రాజన్న అదిరిపోయే కౌంటర్
-
చంద్రబాబు గ్యాంగ్‌ను నమ్మితే రాష్ట్రం అధోగతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం కోసం అర్రులు చాస్తూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు సహా టీడీపీ గ్యాంగ్ జన్మహక్కులా ఉందని, వారిని మళ్లీ నమ్మితే రాష్ట్రం గతి అధోగతి పాలవుతుందని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో విశాఖ సదస్సు ద్వారా 13.11 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 3.47 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. అంతకుముందు చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఎంత సంపద సృష్టించారో చెప్పమనండి. ఆయన పరిపాలనలోనే రాష్ట్రం కరువులో ఉంద’ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల్లో భాగంగా శాశ్వత భూమి హక్కు కలి్పంచేందుకు సర్వే చేయాలని సూచించిందని, కానీ దాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని ప్రస్తావించారు. రైతులే తమ భూసమస్యల శాశ్వత పరిష్కారానికి, పటిష్టమైన భూరికార్డుల కోసం భూసర్వే జరగాలని కోరుకుంటున్నారన్నారు. వ్యవసాయ రంగానికి చంద్రబాబు రూ.34,185 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.55,215 కోట్లు కేటాయించిన విషయాన్ని మరచిపోకూడదన్నారు. గ్రామీణాభివృద్ధికి చంద్రబాబు కేవలం రూ.46,895 కోట్లు మాత్రమే కేటాయిస్తే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.92,655 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇలా ఏ రంగం చూసినా చంద్రబాబు కన్నా జగన్మోహన్రెడ్డే నంబరు ఒన్‌గా ఉన్నారన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో చెప్పిన ఫేక్ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేటముంచారని విమర్శించారు. అందుకే 2019 ఎన్నికల్లో చారిత్రాత్మకమైన తీర్పుతో చంద్రబాబును హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు పరిమితం చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో ఓట్ల కోసం ఫేక్ పథకాలను సూపర్ సిక్స్ అంటూ అబద్దాలు, గిమ్మిక్కులతో చంద్రబాబు గ్యాంగ్ వస్తున్నారని ఎద్దేవా చేశారు. వాటి అమలుకే సుమారు రూ.75వేల కోట్లు ఖర్చు ఉంటుందని, ఆచరణయోగ్యం కాకున్నా అధికార యావతో అన్నీ అమలుచేసేస్తామని చెబుతున్నారని విమర్శించారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేసిందనీ, ఇకపై కూడా ఆయా పథకాల ద్వారా కలిగే ప్రయోజనాన్ని మరింత పెంచుతూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2024 మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు. దిగి్వజయంగా అమలవుతున్న ఈ మేనిఫెస్టోతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకు కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి పనులే నిదర్శనమని రాజన్నదొర చెప్పారు. -
చంద్రబాబుకు సవాల్
-
గిరిజనులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే
-
అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గిరిజన ముద్దుబిడ్డ పీడిక రాజన్నదొర కష్టం, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకో టగా మారింది. నాలుగు దఫాలుగా తిరుగులేని విజయాలతో రాజన్నదొర సాలూరును తన అడ్డాగా మార్చుకున్నారు. మళ్లీ అక్కడ ఎలాగైనా టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏకంగా రాజన్నదొరపై పసలేని ఆరోపణలను ఇటీవల అరకు సభలో సంధించినా గిరిజనం నుంచి పెద్దగా స్పందన లేదు. గాలిలో దీపం మాదిరిగా పరిస్థితి తారుమారు అయినా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మాత్రం తారస్థాయిలోనే జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పొత్తులో భాగంగా జతకట్టిన జనసేన నాయకులు ఇప్పుడు ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. శంబర జాతర సందర్భంగా సాలూరు, మక్కువ మండలాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆ కుమ్ములాటకు అద్దంపట్టాయి. ‘వీళ్లు మారరురా’ అంటూ టీడీపీ కార్యకర్తలే నొచ్చుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్పీ భంజ్‌దేవ్, గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య అంతర్గత కుమ్ములాటల పంచాయితీ సాక్షా త్తూ చంద్రబాబు సమక్షంలోనే జరిగినా క్షేత్రస్థాయిలో ఏమీ మార్పు కనిపించట్లేదు. తమను టార్గెట్ చేసుకొని సంధ్యారాణి అనుచరులు పనిచేస్తున్నారని, పార్టీలో కలుపుకెళ్లే ప్రయత్నాలేవీ చేయట్లేదని భంజ్‌దేవ్ వర్గీయులు గళమెత్తుతున్నారు. వెనుకే ఉంటూ మోసం చేసే నాయకులను ముందుగానే దూరంపెట్టే పని సంధ్యారాణి చేస్తున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు, లేఖలతో మొదలైన యుద్ధం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదుల వరకూ వెళ్లింది. ఇది ఇప్పుడు ఫ్లెక్సీల యుద్ధంతో తారస్థాయికి చేరింది. సంధ్యారాణి తీరుతో విసిగిపోయామని, ఆమెకు టికెట్ ఇస్తే ఏమాత్రం సహకరించబోమని భంజ్‌దేవ్ వర్గీయులు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. తెరపైకి తేజోవతి... సాలూరు టీడీపీ టికెట్ తనదేనని గుమ్మడి సంధ్యారాణి ధీమాగా చెబుతున్నప్పటికీ చంద్రబాబు ఇంకా స్పష్టంగా చెప్పకపోవడంతో ఆమె వర్గీయుల్లో సందేహం నెలకుంది. దీనికితోడు తేజోవతి రంగప్రవేశంతో ఇది మరింత పెరిగింది. ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో ఆమె భంజ్‌దేవ్ ఇంటి వద్ద ప్రత్యక్షమవ్వడం సంధ్యారాణి వర్గీయులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ పరిస్థితితో భంజ్‌దేవ్ వర్గీయులు నిరాశ వదిలేసి కొత్త ఉత్సాహంతో పార్టీలో క్రియాశీలకమయ్యారు. తేజోవతి సాలూరు గడ్డపై కాలుపెట్టడం వెనుక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడి ప్రోత్సాహం ఉందని, ఆమెకు బొబ్బిలి నాయకుడు బేబీనాయన ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల బొబ్బిలిలో జరిగిన సభలోనే ఆమెకు టీడీపీ కండువా వేసి చంద్రబాబు పార్టీలోకి చేర్చుకోవడం వారి వాదనలకు బలం చేకూరుస్తోంది. అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన తేజోవతికి మద్దతుగా ఉన్న భంజ్‌దేవ్ వర్గీయులను టార్గెట్ చేస్తూ ఇన్నాళ్లూ సంధ్యారాణి వర్గీయులు చేసినదాన్ని కన్నా అంతకుమించి జనసేన నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో సంధ్యారాణి, భంజ్‌దేవ్ వర్గాల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తనను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టుచేసిన జనసేన కార్యకర్త త్రిపురనేని విజయ్ చౌదరిపై సాలూరు టౌన్ పోలీసుస్టేషన్లో భంజ్‌దేవ్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులకు తాను భయపడనని సదరు జనసేన కార్యకర్త మరో వీడియో పోస్టు చేయడం గమనార్హం. ఫ్లెక్సీలతో యుద్ధం శంబర జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సాలూరు, మామిడిపల్లి, శంబర ప్రాంతాల్లో తేజోవతి వర్గీయులు ఫ్లెక్సీలను పెట్టించారు. ఆ ఫ్లెక్సీల్లో తేజోవతి ముఖాన్ని ఎవరో చింపేశారు. కొన్నిచోట్ల ముఖం కనపడకుండా ఆమె ఫొటోపై సంధ్యారాణి ఫొటోలను అతికించారు. మరోవైపు శంబరలో పెట్టిన ఫ్లెక్సీలో సంధ్యారాణి ముఖం కనిపించకుండా పసుపు రాసేశారు. గెలిచే అవకాశం లేనిచోట నాయకుల కొట్లాటను చూసి జనం నవ్వుకుంటున్నారు. -
చంద్రబాబుకు తెలిసింది వెన్నుపోటు రాజకీయం మాత్రమే
-
జగన్ పాలనలోనే గిరిజనులకు మేలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే గిరిజనులకు మేలు జరిగిందని, వారి జీవితాలు బాగుపడ్డాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సామాజిక సాధికారయాత్రలో భాగంగా బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ వచ్చిన తర్వాతే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, గిరిజన కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయని తెలిపారు. కేబినెట్, ఇతర పదవుల్లో 70 శాతం బడుగు, బలహీనవర్గాలకే అందించిన ఘనత దేశంలో ఒక్క జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎం జగన్ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, అలా తొలుత పుష్పశ్రీవాణి, తర్వాత తనకు ఆ గౌరవం దక్కిందన్నారు. అడగకుండానే ఎస్టీ కమిషన్ వేశారని, గిరిజన సలహామండలిని నియమించారని, జీసీసీ, ట్రైకార్ సంస్థలకు చైర్మన్ పదవులను భర్తీచేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో గిరిజనులనే కాదు ఎస్సీలు, బీసీలనూ చిన్నచూపు చూశారని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు ఓ అనామకుడిని తీసుకొచ్చి ఈయనే గిరిజనశాఖ మంత్రి అన్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమల్లోనూ చంద్రబాబుకు, జగన్‌కు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. పింఛన్లు, ఇళ్లు, చేయూత, వైఎస్సార్ రైతుభరోసా.. వంటి ఎన్నో పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ సామాజిక న్యాయం, సుపరిపాలన కొనసాగాలంటే మళ్లీ జగన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సాలూరులో జరిగిన బహిరంగసభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం అర్హులందరికీ సంక్షేమం: మంత్రి ధర్మాన జీవితాలను బాగు చేసుకోవడానికి పాలనలో భాగస్వామ్యం, రాజ్యాధికారం కోసం తరాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎవరూ ఉద్యమాలు చేయకుండానే పాలనలో పెద్దపీట వేశారని వివరించారు. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు అంటూ వివక్ష, ఆశ్రిత పక్షపాతం, లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఒక్క జగనే అని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుచేసి, సామాజిక న్యాయాన్ని సుసాధ్యం చేసి చూపిన నవతరం నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. మూడుసార్లు అవకాశం ఇచ్చినా బీదల సంక్షేమం గురించి ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. హామీలన్నీ తూచా తప్పకుండా అమలుచేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను కాదని, చంద్రబాబు మాయలో పడి ఓటేస్తే మన పీక మనమే కోసుకున్నట్లేనని ధర్మాన హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అల్పాదాయ వర్గాలకు ఎంతో అవసరమని చెప్పారు. చిన్నచూపున్న బాబుకు ఓటెందుకు వేయాలి? నాయీ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తానని, మత్స్యకారులను చితక్కొట్టిస్తానని, బీసీలు ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిలుగా పనికిరారంటూ చిన్నచూపు చూసిన చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్, గాంధీజీ, జ్యోతిరావు పూలే ఆశయాలను సాకారం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, అలజంగి జోగారావు, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్తురాజు, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి తదితరులు పాల్గొన్నారు. -
మనకు మేలు ఎవరు చేస్తున్నారనేది బలహీనవర్గాలు ఆలోచించాలి: రాజన్నదొర
-
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం: రాజన్న దొర
-
రాష్ట్ర పండుగగా పోలమాంబ జాతర
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించినట్టు రాజమహేంద్రవరం ఆర్జేసీ ఎం.వి.సురేష్‌బాబు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా శంబర గ్రామంలోని పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ఏయే పనులు అవసరమో, ఎంత నిధులు అవసరమో ప్రణాళికలు తయారు చేసి అందించాలని ఈవో వి.రాధాకృష్ణను ఆదేశించారు. ఫలించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర కృషి శంబరపోలమాంబ అమ్మవారు (గిరిజనుల దేవత) జాతర రాష్ట్రంలో అతిపెద్ద జాతరని, అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని గిరిజన సంక్షేమ శాఖమంత్రి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని సమ్మక్క, సారక్క జాతరకు ఉన్నంత విశిష్టత ఆంధ్ర రాష్ట్రంలో శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు ఉందని వివరిస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శంబర పోలమాంబ అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగగా గుర్తింపునివ్వడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
స్కూటీపై చిన్నారి మృతదేహం తరలింపు!
మహారాణిపేట/ముంచంగిపుట్టు/సాలూరు/సాక్షి, అమరావతి : అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన 15 రోజుల శిశువును స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్స్ సిద్ధం చేస్తుండగానే తల్లిదండ్రులు స్కూటీపై తీసుకెళ్లడం కలకలం రేపింది. అధికారులు మార్గమధ్యంలో గుర్తించి, మృతదేహాన్ని అంబులెన్స్‌లో వారి సొంతూరుకు తీసుకెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కుముడు గ్రామానికి చెందిన చిన్న మత్స్యరాజు, మహేశ్వరి దంపతులకు ఈ నెల 2వ తేదీన పాడేరు ఆస్పత్రిలో మగ శిశువు జన్మించాడు. బరువు తక్కువగా ఉండటంతో పాటు శ్వాస సంబంధిత సమస్యతో జన్మించడం వల్ల పాడేరు ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్ పిల్లల వార్డుకు రిఫర్ చేశారు. అదే రోజున శిశువును కేజీహెచ్ పిల్లల వార్డులో చేర్పించారు. అప్పటి నుంచి ఎన్ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు కేజీహెచ్‌లోని గిరిజన సెల్ ఇన్చార్జి రామకృష్ణకు తెలిపారు. శిశువు మృతదేహం తరలింపునకు వాహనం సిద్ధం చేస్తూండగానే.. తండ్రి ద్విచక్ర వాహనంపై తీసుకొని వెళ్లినట్టు ఆయన పాడేరు డీఎంహెచ్‌వో, ఐటీడీఏ పీవోకు సమాచారమిచ్చారు. ఈ విషయం కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన తక్షణం స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో సిబ్బంది మృత శిశువును తీసుకెళ్తున్న స్కూటీని పాడేరు వద్ద గుర్తించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో కుముడు గ్రామానికి తరలించారు. కేజీహెచ్ సిబ్బంది సరిగా స్పందించనందుకే తామిలా తీసుకొచ్చామని తల్లిదండ్రులు తెలిపారు. విచారణకు ఆదేశం ఈ ఘటనపై విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లను సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. సాలూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీడీఏ అంబులెన్స్‌కు ఆయిల్ పట్టించుకుని వస్తామని సిబ్బంది తెలిపినప్పటికీ వినకుండా సదరు వ్యక్తులు ఎవరి ప్రోద్బలంతోనో వెళ్లిపోయారన్నారు. అయినప్పటికీ మార్గం మధ్యలో వారిని గుర్తించి, అంబులెన్స్‌లో శిశువు మృతదేహాన్ని తరలించారని తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా సీఎంకు మానవత్వం లేదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనులకు మంచి వైద్యం కోసం సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ విచారణ చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. -
ఐటీ కేంద్రంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో విశాఖ ఐటీ డెస్టినీగా అవతరించనుందని, మరిన్ని టెక్ కంపెనీలు ఏర్పాటయ్యేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో ఇప్పటికే ఐటీ పార్కులు ఏర్పాటు కాగా భోగాపురంలో త్వరలోనే కొత్త ఐటీ పార్క్ రానుందని వివరించారు. కరోనా తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనుసరించగా రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ అనే నూతన విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. గురువారం విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం, పల్సస్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ – 2023ని ప్రారంభించిన అనంతరం మంత్రి విడదల రజిని, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధునిక ఆవిష్కరణలతో పాటు ఐటీ, ఫార్మా, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులకు సంబంధించి ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. జీ–20 దేశాలతో పాటు వివిధ దేశాలకు చెందిన 300 కంపెనీలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ), నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఆర్డీసీ) మధ్య సైన్స్, టెక్నాలజీపై ఎంవోయూ కుదిరింది. సదస్సులో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బ్రిటిష్ హై కమిషన్ ఇన్ ఇండియా ప్రగ్యా చతుర్వేది, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏడీసీ అభిజిత్ ఘోష్, ఎన్ఆర్డీసీ సీఎండీ కమడోర్ అమిత్ రస్తోగి, జీ 20 నేషనల్ కోఆర్డినేటర్ డా.నవ సుబ్రహ్మణ్యన్‌తో పాటు సియోల్, టోక్యో, రోమ్, పారిస్, న్యూయార్క్, మెల్బోర్న్, బీజింగ్, లండన్ తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచం చూపు.. విశాఖ వైపు భవిష్యత్తు టెక్నాలజీని రూపొందించేందుకు గ్లోబల్ టెక్ సమ్మిట్ గేట్ వే లాంటిది. ప్రపంచం చూపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్ర భాగాన ఉన్న విశాఖ వైపే ఉంది. డిజిటల్ భారత్ లక్ష్యమైన సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతతో నడిచే కొత్త భారత్‌ను సృష్టించాలి. డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణ, కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం వంటివి అమలు చేసే దిశగా వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్లోబల్ టెక్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. – గేదెల శ్రీనుబాబు, పల్సస్ గ్రూప్ సీఈవో డిజిటల్ హెల్త్‌లో రికార్డు డిజిటల్ హెల్త్‌కేర్‌లో విప్లవాత్మక మార్పులకు ఆంధ్రప్రదేశ్ నాంది పలికింది. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం రోజూ 66 వేల మందికి టెలి కన్సల్టెన్సీ సేవలందిస్తున్నాం. రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆసుపత్రులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. డిజిటల్ హెల్త్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందచేస్తున్నారు. – విడదల రజిని, వైద్యారోగ్య శాఖ మంత్రి జనం మెచ్చిన గిరిజన ఉత్పత్తులు టెక్నాలజీ ద్వారా అటవీ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెరుగుతుంది. గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ప్రవేశపెట్టిన ఈ కామర్స్, ఈ ప్రొక్యూర్మెంట్ విధానం ఇందుకు నిదర్శనం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ, తేనె, పసుపు, చింతపండు వంటి ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల ద్వారా ప్రపంచానికి చేరువయ్యాయి. తద్వారా గిరిజనులకు ఆర్థిక పరిపుష్టి కల్పించినట్లైంది. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి -
జనసేన కాదు.. టీడీపీకి తందానా
వీరఘట్టం: ఉచిత హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన టీడీపీ నేత చంద్రబాబునాయుడుతో పవన్ కళ్యాణ్ జతకట్టడంతో జనసేన పార్టీ.. కాస్త టీడీపీ తందానసేనగా మారిపోయిందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం వండవ గ్రామంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవకాశంగా ఉన్న విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు కాకుండా అడ్డుకుంటే మరో సింహగర్జన తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు పెద్ద దొంగ అంటూ 2018లో పవన్‌కళ్యాణ్ అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో లక్ష ఎకరాలు దోచుకున్నది చంద్రబాబేనని, విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని, అమరావతిలో రాజధాని దండగ అంటూ ఆ నాడు పేర్కొన్న పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చి దొంగనాయకుడితో చేతులు కలపడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబునాయుడు కాళ్ల దగ్గర కూర్చునేవాడిని నాయకుడిగా ఎలా భావిస్తారని, జనసేన కార్యకర్తలు, నాయకులు ఓసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని, దానిని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు. ప్యాకేజీ స్టార్‌ను, చంద్రబాబునాయుడుని రాష్ట్రం నుంచి ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. పాలకొండ, పార్వతీపురం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
చెంచులకు ‘ఉపాధి హామీ’ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల బతుకు దెరువు కోసం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మారిన నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది చెంచులకు ఈ పథకాన్ని నిలిపివేసింది. దీంతో అత్యల్ప సంఖ్యాకులైన చెంచులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉపాధి హామీ కోసం కేంద్రానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులకు ప్రత్యేక పథకంగా ఉపాధి హామీని 2009 నుంచి వర్తింపజేసి 180 రోజుల పనిదినాలు కల్పించారు. దీనికి తోడు ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అనే నిబంధన కాకుండా సడలించి.. ముగ్గురికి జాబ్‌కార్డ్ ఇచ్చారు. ఆ ముగ్గురికి మొత్తంగా 540 పనిదినాలు ఇచ్చేవారు. పోషకాహారలోపంతో బలహీనంగా ఉండే చెంచులకు ప్రత్యేక మినహాయింపు కూడా ఇచ్చారు. 70 % పని చేస్తే వంద శాతం పనిచేసినట్టు చూపి చెల్లింపులు జరిపేవారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 125 గ్రామాల్లోని చెంచు కుటుంబాల బతుక్కి భరోసా దక్కేది. వారికి కేటాయించే పని దినాలను లెక్కగట్టి ఉపాధి కూలి మొత్తంలో పని చేయకముందే సగం డబ్బులను అడ్వాన్సుగా ఇచ్చేవారు. మిగిలిన సగం పని పూర్తి చేసిన తర్వాత ఇచ్చేవారు. మొత్తం పనిదినాల్లో మొత్తం కూలిని సగం నగదుగాను, మిగిలిన సగాన్ని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా కందిపప్పు, బియ్యం, చింతపండు, బెల్లం, చక్కెర వంటి 20 రకాల సరుకులు ఇచ్చేవారు. దీన్నే ఫుడ్ బాస్కెట్ అని పిలిచేవారు. కాగా, ఫుడ్ బాస్కెట్ పద్ధతి 2012తో ఆగిపోవడంతో మొత్తం నగదును ఇవ్వడం ప్రారంభించారు. వారికి నిర్ణయించిన రోజువారీ వేతనం డబ్బులను ఎప్పటికప్పుడు చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ చెంచు మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో ముగ్గురు లీడర్లకు ఉపాధి హామీ పనుల నగదు చెల్లింపులు బాధ్యతలు అప్పగించేవారు. ఇలా అన్ని రకాలుగా ఊతమిచ్చిన ఉపాధి హామీ కేంద్రం నిబంధనలతో గతేడాదిలో ఆగిపోవడంతో చెంచులు ఆవేదన చెందుతున్నారు. చెంచులకు ఉపాధి కోసం కేంద్రాన్ని కోరాం దేశంలో అత్యంత అల్ప సంఖ్యాకులుగా ఉన్న చెంచుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అనేక చర్యలు చేపట్టాం. వారికి ఎంతో మేలు చేసే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిలిపివేయడం ఇబ్బందికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లోని 171 చెంచు గూడెంలలో ప్రజలకు ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు. పరిస్థితిని సానుకూలంగా ఆలోచించి చెంచులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని ఉపాధి హామీ కల్పించాలని కేంద్రాన్ని కోరాం. ఇటీవల దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన శాఖలతో నిర్వహించిన సమావేశంలోను కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి అర్జున్‌ముండాకు చెంచుల పరిస్థితిని వివరిస్తూ ఉపాధి కొనసాగింపు కోసం నివేదిక ఇచ్చాం. – పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి -
పాదయాత్ర కాదు.. ఉత్తరాంధ్రపై చంద్రబాబు దాడి
సాలూరు: అమరావతి పరిరక్షణ పేరుతో చేపట్టిన యాత్ర పాదయాత్ర కాదని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు చేస్తున్న దాడి.. అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు టీడీపీయే కారణమని, ఇప్పుడు విశాఖను పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అన్ని వసతులు ఉండి, ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంను పరిపాలన రాజ ధానిగా చేయడాన్ని టీడీపీ వ్యతిరేకించడం దారుణమన్నారు. చంద్రబాబు వేసిన కమిటీ తప్ప మిగతా ఏ కమిటీలూ అమరావతిని రాజధానిగా చేయాలని సూచించలేదని చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబేనన్నారు. బాబు ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతారని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ టీడీపీ అని చంద్రబాబునాయుడు అనడం ఆయనకు వయసు పైబడిందని చెప్పటానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలు, అక్కడ స్థిర, చరాస్తులు దోచుకున్న వారి పరిరక్షణే బాబు ధ్యేయమన్నారు. అక్కడి ఆస్తులు అధిక ధర పలకాలని, మిగిలిన ప్రాంతాలు ఆర్థికంగా, రాజకీయంగా, ప్రాంతీయంగా అన్యాయమైనా పర్వాలేదనే దుష్టబుద్ధితో చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న కుటిల రాజకీయ యత్నాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఏమైనా ఘటనలు జరిగినా.. దానికి ఈ డ్రామాను ఆడిస్తున్న చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధా నులు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలి పారు. మూడు రాజధానుల తోనే సమన్యాయం, సమధర్మం, అభివృద్ధి సాధ్యమవుతుందని పునరు ద్ఘాటించారు. టీడీపీ కుటిల రాజకీయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు, మేధావులు, యువత అర్థం చేసుకోవాలని కోరారు. -
గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గిరిజనులకు పూర్తిస్థాయి సబ్సిడీతో ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 31 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాలు ఇచ్చిన పేదలు దశలవారీగా ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా పక్కా ఇల్లు లేని 92 వేల గిరిజన కుటుంబాలు ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిలో 15 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు సాంకేతిక సమస్య ఎదురైంది. వారికి గతంలో రేకుల షెడ్డు, పెంకుటిల్లు నిర్మాణానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకంలో నిధులు ఇచ్చింది. అప్పట్లో గృహనిర్మాణ పథకంలో డబ్బులు ఇచ్చినందున ఆ రేకుల షెడ్డు, పెంకుటింటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించుకోవాలంటే మళ్లీ ప్రభుత్వం సాయం అందించేందుకు నిబంధనల ప్రకారం కుదరదు. ఈ నిబంధనలను సవరించి వారికి కూడా పక్కా భవనం నిర్మించుకునేలా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి పీఎంఏవై మంజూరు చేయించేలా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. పేదలందరితోపాటు గిరిజనులకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి కూడా పక్కా ఇల్లు నిర్మించేలా పీఎంఏవై కోసం ప్రతిపాదించింది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిని కోరాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవాప్తంగా గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేశాం. గతంలో 15 వేలమంది గిరిజనులకు రేకుల షెడ్డు, పెంకుటింటి కోసం ప్రభుత్వం సాయం అందించడంతో ఇప్పుడు పక్కా భవనం కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారు అనర్హులు అని వస్తోంది. సాంకేతికంగా వచ్చిన ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి కూడా పూర్తిస్థాయి సబ్సిడీతో పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్‌ముండాను కోరాం. ఆర్థికంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబడిన 92 వేల గిరిజన కుటుంబాలకు దశలవారీగానైనా పీఎంఏవై ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
మైదాన ప్రాంతంలోనూ ‘సమీకృత గిరిజనాభివృద్ధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు మరిన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేయడంతో మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలకు ఐటీడీఏల ఏర్పాటు అత్యవసరమైంది. ఆయా జిల్లాల్లోని గిరిజనులకు సేవలు అందించేలా ఒకటి, రెండు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇటీవల కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 27.39 లక్షలు. వీరిలో 15.88 లక్షలమంది (58 శాతం) మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని ఐటీడీఏల అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది ఐటీడీఏలున్నాయి. వీటిలో విజయవాడ కేంద్రంగా ఉన్న మైదాన ప్రాంత ఐటీడీఏ మాత్రమే ఎస్టీలు తగినంత సంఖ్యలో ఉన్న ఏడుజిల్లాలకు సేవలందిస్తోంది. జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం.. రెండు పూర్తిస్థాయి గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మైదానప్రాంత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గిరిజనులు గణనీయంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాల్లో కనిష్టంగా 75,886 మంది, గరిష్టంగా 2,88,997 మంది గిరిజనులున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తగినన్ని ఐటీడీఏలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి మరింత సమర్థంగా అందించే వీలుకలుగుతుందని పేర్కొంది. మైదాన ప్రాంత ఎస్టీల కోసం ఐటీడీఏ అత్యవసరం మైదాన ప్రాంతాల్లో ఎస్టీల సంక్షేమానికి, అభివృద్ధికి మరిన్ని ఐటీడీఏలు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖకు ప్రతిపాదనలు అందించాం. ఏపీలోని గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మైదాన ప్రాంతంలోని ఎస్టీల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఏజెన్సీలో మాదిరిగానే మైదాన ప్రాంతంలోని ఎస్టీలకు ప్రాథమిక విద్య, వైద్యం, రహదారుల కల్పన, విద్యుత్, ఆర్థికాభివృద్ధిపై అవకాశాలు వంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. – పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి -
గిరిజన అభివృద్ధిలో కొత్త శకం
సాక్షి, పాడేరు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో గిరిజనాభివృద్ధిలో నవ శకం మొదలైందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనుల పక్షపాతిగా వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పాడేరులోని తలారిసింగి ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్ గిరిజన సంప్రదాయ తుడుమును మోగించి, విల్లంబులు ఎక్కుపెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలించక ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ రాలేకపోయారని, కొద్దిరోజుల్లో ఈ ప్రాంతంలో సీఎం పర్యటిస్తారన్నారు. రాష్ట్రంలో గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద రాష్ట్రంలో రూ.14 వేల కోట్లను ఖర్చు పెట్టిందన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రహదారులు నిర్మిస్తున్నామన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 1.5 లక్షల కుటుంబాలకు 2 లక్షల 50 వేల ఎకరాల అటవీ భూములను పంపిణీ చేసి, సీఎం జగన్ సర్వ హక్కులు కల్పించారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత వరకు రూ.8 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ప్రభుత్వం గిరిజనులకు అందించిందన్నారు. బాక్సైట్ జీవోలన్నింటిని రద్దు చేయడం చరిత్రాత్మకమన్నారు. అంతకు ముందు పలు అభివృద్ధి పనుల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంబా రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో ఉత్సవాలు పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో వేర్వేరుగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధ్యక్షతన సీతంపేటలో నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్, సీతంపేట ఐటీడీఏ పీవో నవ్య, ఆర్డీవో హేమలత తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో ఐటీడీఏ పీవో ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ.. సంక్షేమాభివృద్ధి సీఎం జగన్ సాక్షి, అమరావతి: కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న గిరి పుత్రులకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేశామని ఆయన ట్వీట్ చేశారు. -
గిరిజనుల్లో 'నవరత్న' కాంతులు.. ప్రగతిబాటలో ఏజెన్సీ గ్రామాలు
ఇతని పేరు మడివి సిరమయ్య. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన గుంజవరం. మూడేళ్లలో ‘నవరత్నాల’ ద్వారా ఏకంగా రూ.2.86 లక్షల మేర లబ్ధి పొందాడు. గత ప్రభుత్వ హయాంలో సాయం అంటే ఏమిటో తెలీకుండా ఉండేదని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వలంటీర్ స్వయంగా తన ఇంటికొచ్చి పథకాలూ అందేలా చూస్తున్నారని అంటున్నాడు. అడవుల్లో ఎవరికీ పట్టనట్లు ఉండే గిరిజన బతుకులు సీఎం వైఎస్ జగన్ పుణ్యాన బాగుపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈమె పేరు కుంజం సావిత్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈమెకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం రెండు ఎకరాలకు భూమి హక్కు పట్టా అందించింది. అలాగే, మూడేళ్లుగా రైతుభరోసా అందిస్తూ పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండగా నిలుస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపింది. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని సామాజిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా కనీస సదుపాయాలకు నోచుకోని ఆదివాసీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరాల మూట అందిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గిరిజనోద్ధరణకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటిద్వారా 95 శాతం మంది గిరిజనులు లబ్ధి పొందారు. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనూ ఇంత ప్రయోజనం కలిగిన దాఖలాల్లేవు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో గిరిజనులకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మేలు ఏమిటంటే.. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 27.39 లక్షల మంది గిరిజనులున్నారు. 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. వాటిలో 7 ఐటీడీఏలు అటవీ ప్రాంతంలోను, రెండు ఐటీడీఏలు మైదాన ప్రాంతాల్లోను గిరిజనుల కోసం పనిచేస్తున్నాయి. ఇక నవరత్నాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా గత మూడేళ్లలో 51,74,278 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.9,204.75 కోట్ల మేర లబ్ధిచేకూరింది. ప్రత్యక్షంగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 33,92,435 మందికి రూ.7,012.35 కోట్లు, పరోక్షంగా (నాన్ డీబీటీ) 17,81,843 మందికి రూ.2,192.40 కోట్ల మేర లబ్ధిచేకూరింది. గిరిపుత్రులకు ఇంత భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. దీనికితోడు గిరిజన ఉప ప్రణాళిక(ట్రైబల్ సబ్‌ప్లాన్).. కేంద్ర, రాష్ట్ర నిధులతో దాదాపు 40 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. గిరిజనం కోసం ప్రభుత్వ చర్యల్లో ముఖ్యమైనవి.. ► గిరిజన రైతులకు పోడు భూములపై యాజమాన్య హక్కులను కల్పించేలా సీఎం జగన్మోహన్రెడ్డి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. గత మూడేళ్ల కాలంలో 1,34,056 మందికి ఆర్ఓఎఫ్ఆర్, ఆర్ఓఆర్ పట్టాలు చేతికందాయి. తద్వారా వారికి 2,48,066 ఎకరాలపై హక్కు లభించింది. అంతేకాదు వారికి వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వర్తింపజేశారు. ► గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.746 కోట్లు మంజూరు చేసింది. ► గిరిజన గ్రామాల్లో డోలీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఫీడర్ అంబులెన్సులను వినియోగిస్తున్న ప్రభుత్వం తాజాగా.. 128 బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తేనుంది. ► రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తుండడంతో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలుచేస్తున్నారు. ► ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్‌డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న రూ.400 జీతాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచారు. ► గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. ► వంద శాతం గిరిజనుల జనాభా కలిగిన తండాలు, గూడేలను 165 కొత్త గిరిజన పంచాయతీలుగా ఏర్పాటుచేసిన ప్రభుత్వం అక్కడ ప్రజాప్రతినిధులంతా గిరిజనులే ఎన్నికయ్యేలా రిజర్వ్ చేస్తూ జీఓ నెంబర్ 560 జారీచేసింది. ► 4,76,206 గిరిజనుల కుటుంబాల గృహావసరాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోంది. ► గిరిజనులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ కురుపాంలో రూ.153 కోట్లతో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ► కోట్లాది రూపాయలతో విద్యా సంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. è రాష్ట్రానికి మంజూరైన గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రస్తుతం విజయనగరం వద్ద నిర్వహిస్తున్నారు. ► కరోనా కష్టకాలంలో.. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అడవి బిడ్డలకు అండగా నిలిచింది. ► ఇక విశాఖ జిల్లా తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన సమరయోధుల మ్యూజియం, కాపులుప్పాడలో రూ.45 కోట్లతో అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశాఖలో రూ.10కోట్లతో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ (టీఆర్ఎం)కు భవన నిర్మాణం పూర్తయింది. గిరిజనులకు వైఎస్ కుటుంబమే బాసట నాడు వైఎస్సార్ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి పాలనలో గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. అందుకే వీరిని గిరిజనులు దైవంతో సమానంగా భావిస్తారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటుచేశారు. మరో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. గిరిజనులకు విద్య, వైద్యం రెండు కళ్లుగా భావిస్తూ సీఎం జగన్మోహన్రెడ్డి విద్యాసంస్థలు, ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగానే రూ.9వేల కోట్లకు పైగా వారికి లబ్ధిచేకూర్చారు. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి -
కాఫీ తోటలకు ఉపాధిహామీ!
సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్న అరకు కాఫీ సాగును ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. తాజాగా ఏజెన్సీ ప్రాంతంలో సాగవుతున్న కాఫీ తోటల పెంపకానికి ఉపాధిహామీని కొనసాగించడంతోపాటు పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని కోరింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశంలో సైతం కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండాకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర బృందం ప్రత్యేకంగా ప్రతిపాదనలను కూడా అందజేసింది. గతంలో కాఫీసాగుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని వర్తింపజేసింది. అటవీ హక్కుల పత్రం (ఆర్వోఎఫ్ఆర్ పట్టా) ఉన్న భూముల్లో ఏడాదికి 150 రోజులు, హక్కుల పత్రాలు లేని మామూలు భూముల్లో 100 రోజులు చొప్పున ఇచ్చేవారు. కాఫీతోటల పెంపకంలో గుంతల తవ్వకం, మొక్కలు నాటడం తదితర పనులకు ఉపాధిహామీ నిధులు కేటాయించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గిరిజన సంక్షేమశాఖ, ఐటీడీఏ, కాఫీబోర్డు ఈ పనులను పర్యవేక్షించేవి. దీనివల్ల అటు కాఫీతోటల సాగును ప్రోత్సహించడంతోపాటు గిరిజనులకు ఏడాదిలో కొన్ని రోజులైనా పనిదినాలకు భరోసా ఉంటుంది. ఉపాధిహామీలో కాఫీ రైతులకు వేతనాలు చెల్లించడం కుదరదని 2020లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. కాఫీని వాణిజ్యపంటగా గుర్తించి ఉపాధిహామీ ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తోంది. దేశంలో కాఫీతోటలు విరివిగా ఉండే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీసాగు వాణిజ్యపంటగా ప్రత్యేకంగా ఎస్టేట్లలో సాగవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల జీవనోపాధిగా మాత్రమే సాగవుతున్నందున ప్రత్యేక కేసుగా పరిగణించి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. తాజాగా కేంద్రంపై మరోమారు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. కేరళ రబ్బరుతోటల మాదిరిగా ఏపీలో కాఫీతోటలను ప్రోత్సహించాలి కేరళకు ప్రత్యేకమైన రబ్బరుతోటల సాగుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని కొనసాగిస్తోంది. ఏపీలోని కాఫీతోటల సాగును కూడా ప్రత్యేకంగా పరిగణించి ఉపాధిహామీ వర్తింపజేసి ఏడాదికి 180 రోజుల పనిదినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పలు రాష్ట్రాల్లో కాఫీని వాణిజ్యపంటగా ఎస్టేట్లలో పండిస్తున్నప్పటికీ ఏపీలోని ఏజెన్సీలో మాత్రం కాఫీసాగు గిరిజనులకు ప్రధాన ఉపాధిగా ఉందని తెలిపింది. కాఫీతోటల పెంపకం వలన అక్కడి గిరిజన కుటంబాల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయని పేర్కొంది. ఏపీకి గర్వకారణమైన అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేందుకు కేంద్రం సహకరించాలని, ఉపాధిహామీని కొనసాగించడంతోపాటు పనిదినాలు పెంచాలని కోరింది. -
పాడేరులో అల్లూరి విగ్రహావిష్కరణ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సోమవారం ఆవిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, అరకు, రంపచోడవరం ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, నాగులపల్లి ధనలక్ష్మి హాజరవుతారని వివరించారు. -
అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా పాలన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలనుగుణంగా ఉందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. దళితులంతా బానిసలు కాదు.. అంబేడ్కర్ వారసులని ఈ మూడేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారన్నారు. ఈ నెల 26న శ్రీకాకుళంతో ప్రారంభమయ్యే ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్ర నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సాగుతుందని, 29న అనంతపురంలో ముగుస్తుందని చెప్పారు. విశాఖపట్నంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ పాలన అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రానున్న ఎన్నికల్లో అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సీఎంకు మద్దతుగా, ఈ ప్రభుత్వానికి అండగా చేపడుతున్న ఈ సామాజిక బస్సుయాత్రను జైత్రయాత్రగా సాగేలా అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజన్నదొర మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలను చూసి యావత్ దేశం ప్రశంసలు కురిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యతను దావోస్ పర్యటనలో సీఎం వివరించనున్నారని తెలిపారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రెండురోజుల కిందట ఒక దళితుడు హత్యకు గురైతే దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి నేరుగా డీజీపీకి ఫోన్‌చేసి ఈహత్యలో నిందితులను శిక్షించాలని ఆదేశించారని గుర్తుచేశారు. ఇది దళితులపై తమ నాయకుడికి ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతలని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అండతో గద్దెనెక్కిన చంద్రబాబు వారికి పూర్తిగా అన్యాయం చేశాడన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు, భావితరాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. బ్యాక్‌బోన్ క్లాస్ అని నిరూపించిన సీఎం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ క్లాస్ అని నిరూపించారని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి, వారి జీవనవిధానాలకనుగుణంగా, సామాజికంగా, రాజకీయంగా అధిక ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఖాదర్‌బాషా మాట్లాడుతూ చట్టసభల సభ్యులుగా, మంత్రులుగా పలువురు ముస్లింలకు వకాశం కల్పించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జాన్‌వెస్లీ, కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్, పి.సుజాత, నెడ్‌క్యాప్ చైర్మన్ రాజు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రాజన్న దొర బాధ్యతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకి అనుగుణంగా గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. గురువారం ఆయన సచివాలయంలోని రెండవ బ్లాక్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, లాభసాటి వ్యవసాయం వైపు గిరిజనులని ప్రోత్సహిస్తామని.. విద్య, వైద్యం గిరిజనులకి అందేలా అన్ని ఐటీడీఎ పరిధిలో ఏరియా ఆసుపత్రులని నిర్మాణం చేస్తున్నామని.. ప్రతీ మండలానికి రెండు కళాశాలలు నిర్మిస్తామని రాజన్నదొర అన్నారు. చదవండి: మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు రాజకీయ నేపథ్యం: 1985లో 21 ఏళ్ల వయస్సులో జీసీసీలో జూనియర్ మేనేజర్‌గా చేరి ఉమ్మడి ఆంధ్రలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఆయన 2004లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయినా.. తనపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ గిరిజనుడు కాదని కోర్టులో నిరూపించి 2006లో ఎమ్మెల్యేగా అవకాశం పొందారు. 2009లో కాంగ్రెస్ తరఫున, 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. -
గిరిపుత్రుల్లో కొత్త ‘రాజ’సం
గిరిజనులకు తగిన గుర్తింపునిస్తూ పార్వతీ పురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి వారికి మరో వరం అందించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, గిరిజనులకు తలలో నాలుకలా ఉన్న పీడిక రాజన్నదొరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఉపముఖ్యమంత్రిగా అత్యున్నత గౌరవం కల్పించారు. గౌరవం పొందిన రాజన్నదొర రాక కోసం పార్వతీపురం మన్యం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన రాజన్నదొర పోస్టు గ్రాడ్యుయేషన్ చదివారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మేనేజరుగా కొన్నేళ్లు పనిచేశారు. ప్రజాసేవపై మక్కువతో ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. వరుసగా నాలుగు దఫాలు సాలూరు నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. గిరిజన బిడ్డగా, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయనపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. తమ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపిస్తారని ఆశిస్తున్నారు. గిరిజనులపై ప్రత్యేక మమకారం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో తమ ప్రాంతాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారని విశ్వసిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన పార్వతీపురం మన్యం జిల్లాలో తొలి మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా రాజన్నదొర తనదైన ముద్ర వేసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న ముందు సవాళ్లు.... ∙గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేయడానికి అటవీశాఖ అనుమతులు రాక పనులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. వాటికి పరిష్కారం చూపా ల్సిన అవసరం ఉంది. ∙అభివృద్ధిగా దూరంగా ఉన్న గిరిశిఖర గ్రామాల్లో గిరిజనులకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందేలా చేయాలి. ∙గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు దళారుల బారిన పడకుండా జీసీసీ ద్వారా గిట్టుబాటు« దరకు కొనుగోలు జరిగేలా చూడాలి. ∙పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆధ్యాత్మిక, ఆçహ్లాదకర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ∙వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేలాది మంది గిరిజనులకు పోడు (ఆర్వోఎఫ్ఆర్) పట్టాలు అందాయి. ఆ భూముల్లో చిరుధాన్యాలు, ఉద్యానవన పంటలు సాగు మరింత పెరిగేలా ప్రోత్సా హకాలు అందించాల్సి ఉంది. రాజన్నదొరకు శుభాకాంక్షలు... చీపురుపల్లి: డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీడిక రాజన్నదొరకు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం అమరావతిలో దుశ్శాలువతో సత్కరించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఉన్నారు. -
రాజన్న దొర అనే నేను..
-
ఇది జగనన్న ప్రేమ యుగం: ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర
-
మమ్మల్ని ఆంధ్రా వాసులుగా గుర్తించండి
పాచిపెంట: తామంతా తెలుగువారమేనని.. ఒడిశా ప్రభుత్వం తమ పల్లెలను అక్రమంగా ఆ రాష్ట్రంలో కలిపేసిందని, మళ్లీ తమను ఆంధ్రాలో చేర్చి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పీవో కూర్మనాథ్‌కు గురువారం విన్నవించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం సంపంగిపాడు పంచాయతీకి సమీపంలో ఒడిశా పరిధిలో ఉన్న కరిడి, పిలకబిట్రా, బిట్రా, జంగంవలస, అడ్డబొడ్డవలస, బొర్రమామిడి, బైరిపాడు తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు పి.కోనవలసలో ఎమ్మెల్యే, పీవోలను కలిశారు. తమ తండ్రులు సాలూరు మండలం సారికి గ్రామానికి చెందిన దివంగత ఎంపీ డిప్పల సూరిదొరకు శిస్తు చెల్లించేవారన్నారు. వాటికి సంబంధించిన రాగి ఒప్పంద పత్రాలను చూపించారు. ఒడిశా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాలు కూడా తీరని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలన బాగుందని, తమను కూడా ఆంధ్రా ప్రజలుగా గుర్తించి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని విన్నవించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే రాజన్నదొర వారికి హామీ ఇచ్చారు. -
'పవన్.. వివాదాస్పద వాఖ్యలు మానుకో'
సాక్షి, విజయనగరం: ప్రతీ పేద విద్యార్థి ఓ శాస్త్రవేత్తగా, ఓ ఇంజినీరుగా, ఓ మేధావిగా ఉన్నతస్థానంలో చూడాలన్న ఉత్తమ సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టారని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టలేకపోయానన్న ఓర్వలేనితనంతో బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయనగరంలోని ప్రదీప్‌నగర్‌లో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సాలూరు, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ల వాఖ్యలపై ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఇసుక మాఫియాను నియంత్రించేందుకు వెళ్లి తహసీల్దార్ వనజాక్షిపై ధౌర్జన్యం చేసిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆ పార్టీ క్యాడెర్‌కు చెప్పడం రౌడీయిజాన్ని ప్రోత్సహించడమే అవుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ 5 కోట్ల మంది ఆంధ్రుల మన్ననలను అందుకుంటున్న సీఎంపై లేనిపోని వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. పచ్చమీడియాను అడ్డంపెట్టుకుని భాషకు, కులానికి లింక్‌పెట్టి మారణహోమాలు, విధ్వంసాలు సృష్టించేలా ప్రజలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఉత్తర భారత దేశంలో ఉన్న వారంతా హిందీ లో మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పొందుతుండగా... కేవలం తెలుగుపైనే ఆధారపడి చదువుతున్న ఆంధ్ర విద్యార్థులు ఇంగ్లిష్ భాషలో చదువుకుంటే తప్పేమిటో చెప్పాలన్నారు. క్రిస్టియన్ దేశమైన లండన్‌లో చదువుకున్న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ క్రిస్టియన్‌గా మారిపోయారా అంటూ ప్రశ్నించారు. తన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని, తన భార్య పిల్లలు క్రైస్తవ మతంలో ఉంటూ చర్చికి వెలుతుంటారని పదే పదే చెబుతున్న పవన్‌కళ్యాణ్ మత వ్యాప్తిని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారనడం ఎంత వరకు సమంజసమన్నారు. పదవీ దాహంతో హిందువులు, క్రిస్టియన్ల మధ్య వివాదాలు రేపే వాఖ్యలు మానుకోవాలన్నారు. మనం లౌకిక భారతదేశంలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న, వైఎస్సార్ సీపీ నాయకులు ఎంఎల్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘హోదా కోసం పోరాడిన ఏకైక నాయకుడు ఆయనే’
విజయనగరం: ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని సాలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని 9 సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సంధర్బంగా ఎమ్మెల్యే రాజన్న దొర ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత రాజన్న దొర మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. పార్టీ పెట్టి 8 సంవత్సరాలూ కూడా వైఎస్ జగన్ ప్రజలతో మమేకమై ప్రజల ఇబ్బందుల్లో తోడుంటూ ఆపన్నులకు అండగా నిలుస్తూ వచ్చారని కొనియాడారు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఇతర అనేక సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. పాదయాత్ర చేస్తూ 3 వేలకు పైగా కిలోమీటర్లు నడిచి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు. వైఎస్ జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్సీపీ గుర్తు సీలింగ్ ఫ్యాన్‌ను ప్రజలకు తెలిసేలా వివరించాలని కార్యకర్తలను కోరారు. -
‘రాష్ట్రంలో లేని పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటాం’
విజయనగరం, సాలూరు: రాబోవు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీఆర్ఎస్తో వైఎస్సార్సీపీ పొత్తు పెట్టుకుట్టుందని టీడీపీ నాయకులు ప్రచారం చేయడం నిజంగా శోచనీయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో లేని పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటామని ఈ సందర్భంగా రాజన్న దొర ప్రశ్నించారు. తమ పార్టీ 175 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుపై రాజన్న దొర మండిపడ్డారు. ఆయన పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతూ తాను చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలైన తృణమూలు కాంగ్రెస్, డీఎంకే, ఎస్పిలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపిన మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారని రాజన్న దొర పేర్కొన్నారు. -
‘ఉద్యోగాలను అమ్మేస్తున్నారు’∙
సాలూరు : కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను అధికార పార్టీ నాయకులు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నారని, అధికారం చేపట్టాక పలువురికి అన్యాయం చేశారన్నారు. ఇప్పుడేమో ఏకంగా కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టర్‌కు అప్పగించాలని చూస్తుండడం దారుణమన్నారు. డబ్బులు తీసుకోకుండా ఒక్కరికీ ఉద్యోగం కల్పించడంలేదన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రానుందని, అప్పుడు తప్పకుండా అర్హులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. జీఓ 279ను రద్దుచేయాలని చేస్తోన్న పోరాటాన్ని కార్మికులు ధైర్యంగా కొనసాగించాలని సూచించారు. కార్మికులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికులకు మద్దతు తెలిపినవారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగపండు అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు సువ్వాడ రమణ, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ గిరి రఘు, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ఉన్నారు. -
ఎమ్మెల్యే భార్యే అయినా...
సాలూరు: ఆయనో ఎమ్మెల్యే. ఆయనకు గానీ... ఆయన కుటుంబ సభ్యులకు గానీ చికిత్స చేయించాలంటే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లొచ్చు. కానీ సహజంగానే నిరాడంబరుడైన సాలూరు ఎమ్మెల్యే(వైఎస్సార్సీపీ) పీడిక రాజన్నదొర మాత్రం స్థానిక ప్రభుత్వాస్పత్రిలోనే తన సతీమణికి చికిత్స చేయించిన సంఘటన ఇది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజన్నదొర సతీమణి రోజారాణి పాచిపెంట మండలంలో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమె మంగళవారం ఉదయం పాఠశాలకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా రోడ్డుపై అకస్మాత్తుగా పాము కనిపించడంతో కంగారుపడి కిందపడ్డారు. ఈ దశలో ఆమె తల వెనుకభాగం, కాలు, చేతులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏమాత్రం సంకోచించకుండా ఆమెను సాలూరు పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రామ్మూర్తి, అప్పలనాయుడు ప్రధమచికిత్స చేసి, తదుపరి వైద్యపరీక్షల కోసం విజయనగరం తరలించాలని సూచించడంతో ఆయన విజయనగరానికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే భార్యను వైద్యం కోసం సామాన్యుడిలా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రులున్నా, ఆక్కడికి వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంపై ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యంపైనా, వైద్యులపైనా వున్న నమ్మకమే కారణమని బదులిచ్చారు. -
గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు
సాలూరు: తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంలో గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణం నుంచి స్థానిక విలేకరులతో ఫోన్లో సోమవారం మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం ఆద్యంతం రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నట్టు పేర్కొన్నారన్నారు. జీడీపీ వృద్ధి రేటు కూడా పెరిగిపోతోందని చెప్పించారన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగాల్లో అభివృద్ధిపైనే రాష్ట్ర ప్రగతి ఆధారపడి ఉందన్న విషయం అందరికీ తెలిసినదేనన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఒక్క పరిశ్రమ స్థాపన జరగలేదని, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. దీనికి తోడు రాష్ట్రం ఆర్థిక లోటుతో నడుస్తోందని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ఎలా దూసుకుపోతోందో..?, ఎటు దూసుకుపోతోందో ? తెలియడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేనట్టేనని గవర్నర్‌తో చెప్పించడం బాధాకరమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని, విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పి, నేడు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆర్థిక లోటును పూడ్చేసాకుతో విద్యుత్ బిల్లులతో వినియోగదారుల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అబద్ధాలతో గొప్పలు చెప్పించుకునేందుకే గవర్నర్ ప్రసంగాన్ని వాడుకున్నారని విమర్శించారు. -
ఇదేనా పేదల ప్రభుత్వం?
మెంటాడ(సాలూరు): గతంలో సర్వం కోల్పోయిన అగ్నిబాధితులకు తాత్కాలికంగా నివాసం కోసం రూ. 15 వేలు అందించామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అగ్నిబాధితులకు రూ.4,200 ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడమంటే పేదల ప్రభుత్వం ఇదేనా అని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర విస్మయం వ్యక్తం చేశారు. మండలంలోని జక్కువ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించడానికి బుధవారం జక్కువ వచ్చిన ఎమ్మెల్యే రాజన్నదొర స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాది పేదల, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు పాలనలో సంక్రాంతి పండగ చేసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని విమర్శించారు. గతంలో కొంపంగి, మీసాలపేటలలో అగ్ని ప్రమాదాలు జరిగితే తమ హయాంలో ఒక్కో బాధితునికి రూ.15 వేల ఇస్తూ, వెంటనే వారికి ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. కొంపంగిలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఐఏవై కింద ఏడుగురు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేసినప్పటికీ నేటి వరకూ బిల్లులు చెల్లించలేదన్నారు. కలెక్టర్ ఆదేశాలను కూడా పక్కనపెట్టి తెలుగుదేశం ప్రభుత్వం వారికి బిల్లులు రాకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. జక్కువలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగు రోజులు అవుతున్నా కలెక్టర్, మండల స్థాయి అధికారులు కనీసం పట్టించుకోలేదని, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయం నేటి వరకూ అందజేయలేదని ఆయన ఆరోపించారు. తక్షణమే కొంపంగి, జక్కువ, కూనేరు గ్రామాలలో జరిగిన అగ్ని ప్రమాదాల బాధితులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శొంఠ్యాన సింహాచలమమ్మ, మండల వైఎస్సార్సీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు రెడ్డి సన్యాసినాయుడు, సిరిపురపు తిరుపతి, యువజన అధ్యక్షుడు రాయిపిల్లి రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బాయి అప్పారావు, మరడ సింహాచలం, దాట్ల హనుమంతురాజు, నాయకులు లచ్చిరెడ్డి ఈశ్వర్రావు, లచ్చిరెడ్డి అప్పలనాయుడు, కుపురెడ్డి మోహనరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులను అడ్డుకుంటారా..?
సాలూరు: ప్రభుత్వం అభివృద్ధి ప నులు మంజూరు చేయకుం డా, తాను మంజూరు చే యించిన పనులను అడ్డుకుంటోందని సాలూరు ఎమ్మె ల్యే, వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర మండిపడ్డారు. సోమవారం జరగాల్సిన తహశీల్దార్ కార్యాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందన్నారు. సాలూరులో *50లక్షలతో నిర్మించిన ఎస్సీ బాలికల హాస్టల్ నిర్మాణం పూర్తయినా ప్రారంభించడం లేదన్నారు. *3కోట్లతో నిర్మించిన యువజన శిక్షణ కేంద్రం ఏడాదిగా ప్రారంభానికి ఎదురు చూస్తోందన్నారు. ఏపీ సీడ్స్ గోదాముల పరిస్థితీ అంతేనని అన్నారు. పాంచాలి- గురువినాయుడుపేటల మధ్య, జీటీపేట వద్ద వంతెనల నిర్మాణాలను అడ్డుకుంటున్నారని అన్నారు. *33కోట్లతో పాచిపెంటలో రక్షిత పథకాన్ని చేపట్టినా పనులు పూర్తికావడం లేదని తెలిపారు. పేరు ఎవరిదైనా అభివృద్ధి పనులను పూర్తి చేస్తే చాలని, ప్రజలకు మేలు చేస్తే అంతే చాలని అన్నారు. -
చంద్రబాబుది డాబుసరి
మున్సిపల్ కార్మికుల పోరాటానికి అండగా ఉంటాం రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు రాజన్నదొర సాలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబుది డాబుసరి పరిపాలన అని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. మారిన మనిషినని ప్రజలను నమ్మించి తన నిజస్వరూపాన్ని చూపుతున్నారన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సీఐటీయు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మెపై మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగాలను రెగ్యులర్ చేసేస్తానని, మెరుగైన జీతాలు అందిస్తానని స్పష్టం చేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడపీకే పనిలో పడ్డారన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓలనే అమలుచేయడం లేదని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులు కొత్త డిమాండ్లేమీ చేయడంలేదని, చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగానే ఉద్యోగాలు రెగ్యులర్ చేయమంటున్నారని, 10వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలను చెల్లించాలంటున్నారన్నారు. గోదావరి పుష్కరాలు ముగిసిన అనంతరం అక్కడ పనిచేస్తున్న కార్మికులను రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పంపి, సమ్మె చేస్తున్న కార్మికుల సంగతి తేల్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారముందన్నారు. అందువల్ల రాష్ట్ర స్థాయిలో కార్మికులు ఆందోళనలు, నిరసనలు ఉద్ధృతం చేయాలని సూచించారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందన్నారు. అంతకుముందు మాట్లాడిన రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ప్రకాశ్ ముఖ్యమంత్రికి కార్మికుల సమస్యలు పట్టడంలేదని, ప్రజల ఆరోగ్యంతో ఆయనకు పనిలేకుండా పోతోందన్నారు. సీపీఐ సాలూరు ఏరియా కార్యదర్శి ఎస్ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ చట్టాలను చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాలు 8వ, 9వ పీఆర్సీలను చక్కగా అమలు చేశాయని, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కూడా 10వ పీఆర్సీని కార్మికులకు వర్తింపజేయాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో బీజేపీ పట్టణ నాయకుడు లక్ష్మణరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు సువ్వాడ రమణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎం.గంగమ్మ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గేదెల సత్యనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, సీపీఎం నాయకుడు శ్రీనివాస్, లోక్ సత్తా నాయకుడు రధంగపాణి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన సంఘ ప్రధాన కార్యదర్శి నాగార్జున, కౌన్సిలర్లు ఎం.అప్పారావు, టి.రవి తదితరులు పాల్గొన్నారు. -
తోఫాతో ముస్లింలకు చంద్రబాబు టోపీ
సాలూరు: ముస్లింల పట్ల సీఎం చంద్రబాబుకు నిజమైన ప్రేమ, అభిమానం ఉంటే వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసి ఉండేవారని, అవి లేవు కాబట్టే రంజాన్ పండగకు తోఫా పేరుతో ఉచితంగా సరుకులిచ్చి టోపీ పెడుతున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర విమర్శించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముస్లిం పేద అమ్మాయిల వివాహానికి 50 వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు ఎందరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని మసీదులను బాగు చేయించారో వెల్లడించాలన్నారు. ముస్లింల వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని, రాయితీ రుణాలను అందిస్తామని నమ్మబలికారని, కానీ ఆ దిశగా ఇప్పటివరకు కనీస చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. నిజంగా ముస్లింలపై ప్రేమే ఉంటే పేదరికంతో అల్లాడుతున్న కుటుంబాలను ఆదుకోవాలన్నారు. నిలువ నీడలేని వారికి గృహాలు మంజూరు చేయాలన్నారు. ముస్లింల శ్మశాన వాటికలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.10 లక్షలను యూత్ రీసోర్స్ సెంటర్ నిర్మాణం కోసం తాను మంజూరు చేశానని గుర్తు చేశారు. భవన నిర్మాణం పూర్తి చేసేందుకు మరో రూ.10 లక్షలు అవసరమవుతాయన్నారు. ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. శ్మశానవాటిక చుట్టూ ప్రహారీ నిర్మాణానికి నిధులు కేటాయించానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ముస్లింలకు ఏమీ చేయదని అందరికీ తెలుసునన్నారు. అందుకే టీడీపీలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరన్నారు. ముస్లింలు వాస్తవాలను గుర్తించి, టీడీపీ తోఫాలకు మోసపోవద్దని కోరారు. రాజన్నదొర వెంట పాచిపెంట మండల జెడ్పీటీసీ ప్రతినిధి సలాది అప్పలనాయుడు ఉన్నారు. -
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే
సాలూరు : హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. శనివారం అసెంబ్లీలో హుద్‌హుద్ తుపానుపై జరిగిన చర్చలో ఆయన ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ మేరకు సమవేశంలో జరిగిన విషయాలను ఆయన ఇక్కడి విలేకరులకు ఫోన్లో వివరించారు. తుపాను సమయంలో ప్ర భుత్వం చేసింది గోరంత అయితే కొండంతగా ప్రచారం చేసుకుందన్నారు. మీడియా కథనాల మేరకు రాష్ట్రంలో రూ. 63 నుంచి రూ. 70 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ప్రభుత్వం మాత్రం 21 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని తేల్చిందన్నారు. పధాని మోదీ రూ. 1000 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించినా... రూ. 400 కోట్ల మాత్రమే ఇచ్చారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 844 కోట్ల మాత్రమే ఖర్చు చేసిందని వి వరించానన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా...రూ. 21 కోట్ల వేల నష్టం జరిగితే అందులో కేవలం ఒకే ఒక్క శాతమైన రూ. 844 కోట్ల ఖర్చు చేయడం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పనితీరును తాము విమర్శించడం లేదని, కానీ ఒడిశాలో 2013లో వచ్చిన ఫైలీన్ తుపాను బీభత్సం నుంచికేవలం రెండు రోజుల్లోనే అక్కడి రాష్ట్రం తేరుకుందని, కానీ మనరాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. ఒక్క విశాఖ పట్టణానికే వారం రోజులు కష్టపడాల్సి వచ్చిందని, గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ఎన్ని రోజులు పట్టిందో తెలిసిందేనన్నారు. తుపాను సమయంలో ప్రభుత్వం కేవ లం విశాఖను మాత్రమే పట్టించుకున్నారని, మిగిలిన గ్రామీణ, గిరిజన ప్రాంతాలను విస్మరించారన్నారు. గిరిజనులకు జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారని ప్రశ్నించినా... ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే కౌలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేసిన ప్రభుత్వం వారికి తుపాను స మయంలో పంట నష్టాన్ని నేరుగా అందించేలా చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. తోటపల్లి నిర్వాసితుల సమస్య ప్రస్తావన సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పారు. గరుగుబిల్లి మండలం నందివానివలస, బాసంగిలో తోటపల్లి ప్రాజె క్టు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. తోటపల్లి ప్రాజెక్టు పునరావాసంలో భాగంగా ఈ రెండు గ్రామాలకు మూడేళ్ల క్రితం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని, దాన్ని ఇంతవరకు అమలు చేయలేదని ఆమె అసెంబ్లీలో వివరించారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని,అలాగని వారికి వేరొకచోట మంచి స్థలం చూపించి ఇళ్లు కట్టించలేదని పేర్కొన్నారు. దీంతో తోట పల్లికి వరద వచ్చినప్పుడల్లా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా స్పం దించినట్టు కూడా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ‘సాక్షి’కి ఫోన్ చేసి చెప్పారు. అలాగే, హుద్‌హుద్ తుపాను సహాయంపై కూడా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజ న్నదొరతో పాటు పాముల పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. ప్రభుత్వం సరిగా సాయం చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక, గజపతినగరం ఎమ్మెల్యే కొం డపల్లి అప్పలనాయుడు డీసీసీబీ అక్రమాల్ని, పీఏసీఎస్‌ల అక్రమాలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. రావివలస సొసైటీలో జరిగిన బినామీ రుణాల వ్యవ హారాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. బొత్స సత్యనారాయణ డీసీసీబీ చైర్మన్ అయిన దగ్గరి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించా రు. దీనిపై సీబీసీఐడీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు. -
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం : ఎమ్మెల్యే రాజన్న దొర
షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో అవినీతిఅక్రమాలు చోటు చేసుకున్నాయని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఆరోపించారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఈ నియామకాల్లో ఒక్కొక్క పోస్టుకు టీడీపీ నేతలు రూ.5 లక్షల వరకూ దండుకున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పాటించలేదని, స్థానికేతరలను ఈ పోస్టుల్లో నియమించారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఈపీడీసీఎల్ సీఎండీ, కలెక్టర్ లేఖ రాయనున్నామని, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. -
హత్యా రాజకీయూలు మానుకోవాలి
సాలూరు : టీడీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, సాలూ రు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. శనివారం ఆ యన అసెంబ్లీ సమావేశాల నుంచి ఫోన్లో ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే ఆయనపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు లేనిపోని ఆరోపణలకు దిగడం విచారకరమన్నారు. సభలో స్పీకర్ అనుసరిస్తున్న తీరు కూడా సరిగ్గా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వంద రోజుల కా ర్యాచరణ ప్రణాళికలో హత్యా రాజకీయాలను కూడా చేర్చినట్టుందని ఎద్దే వా చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత ప్రజా సంక్షేమంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోం దని ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. గిరిజను లు అధికంగా నివశిస్తున్న గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 25 ఏళ్లుగా ఈ డిమాండ్ ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టి ంచుకోవడం లేదన్నారు. జిల్లాలో 460 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా చేర్చాల్సి ఉందని 2012లో అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండాపోయిం దన్నారు. అలా చేయకపోవడం వల్ల గిరిజనులు రాజ్యాంగపరమైన హక్కులు కోల్పోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టంతో పాటు, పీసా చట్టం అమలుకు నోచుకోవడం లేదన్నారు. షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించడం వల్ల ఆయా గ్రామాల పరిధిలోని ఉద్యోగాలు వంద శాతం గిరిజనులకే దక్కుతాయని చెప్పారు. ప్రభుత్వపరంగా ఇస్తున్న అనేక రాయితీలు, రిజర్వేషన్ల ఫలాలు గిరిజనుల దరి చేరుతాయన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని తనతో పాటు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు డిమాండ్ చేసినట్టు తెలిపారు. గిరిజనులకు ఏదైనా మేలు జరిగిందంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డి, ఎన్టీఆర్ హయూంలోనే జరిగిందని గుర్తు చేశారు. అలాగే పదో తరగతి పాసై ఇంటర్లో సీట్లు రాక మధ్యలో చదువు మానేస్తున్న గిరిజన విద్యార్థులపై ప్రభుత్వాన్ని నిలదీశామన్నారు. జిల్లాకు ఐదు గిరి జన గురకుల జూనియర్ కళాశాలలు మంజూరు చేయాల్సిన అవసరం వుందన్నారు. వీటిని తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. -
నన్ను కాదు.. ప్రజలను ఆకర్షిస్తే మంచిది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు : సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర సాలూరు, న్యూస్‌లైన్ : ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా...తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రజాపక్షమే ఉంటానని, అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ప్రభుత్వంతోనే పోట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరించానని చెప్పా రు. శుక్రవారం ఒక దినపత్రికలో రాజన్నదొర వైఎస్సార్ సీపీని వీడి, టీడీపీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వచ్చిన కథనాన్ని ఆయన విలేకరులసమావేశంలో ఖం డించారు. అధికారం కోసం పార్టీ మారే వ్యక్తిత్వం తనది కాదన్నారు. రెండుసార్లు కాం గ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసినా.. తానేమీ దోచుకోలేదు... దాచుకోలేదని తెలిపారు. తనది అధికార పక్షమో.. ప్రతిపక్షమో కాదని, ఎప్పటికీ ప్రజా పక్షమేనని చెప్పారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీని ప్రజలు ఓడించారన్నారు. ఆ పార్టీ నాయకులు ఆకర్షించాలనుకుంటే ముం దుగా ప్రజలను ఆకర్షించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే ప్రజలు ఛీకొట్టడంతో పాటు వ్యతిరేకంగా ఉద్యమిస్తారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ,, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. లక్షా 50 వేల కోట్ల రూపాయలని, టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ల్లో కొంతమేరకైనా నెరవేర్చాలంటే దాదాపు రూ. 3 లక్షల 60 వేల కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.