
సిద్ధమైన ప్రధాన సభావేదిక
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సోమవారం ఆవిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కలెక్టరేట్‌లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, అరకు, రంపచోడవరం ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, నాగులపల్లి ధనలక్ష్మి హాజరవుతారని వివరించారు.