
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం : ఎమ్మెల్యే రాజన్న దొర
షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో అవినీతిఅక్రమాలు చోటు చేసుకున్నాయని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఆరోపించారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఈ నియామకాల్లో ఒక్కొక్క పోస్టుకు టీడీపీ నేతలు రూ.5 లక్షల వరకూ దండుకున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పాటించలేదని, స్థానికేతరలను ఈ పోస్టుల్లో నియమించారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఈపీడీసీఎల్ సీఎండీ, కలెక్టర్ లేఖ రాయనున్నామని, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.