ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే
సాలూరు : హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. శనివారం అసెంబ్లీలో హుద్‌హుద్ తుపానుపై జరిగిన చర్చలో ఆయన ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ మేరకు సమవేశంలో జరిగిన విషయాలను ఆయన ఇక్కడి విలేకరులకు ఫోన్‌లో వివరించారు. తుపాను సమయంలో ప్ర భుత్వం చేసింది గోరంత అయితే కొండంతగా ప్రచారం చేసుకుందన్నారు. మీడియా కథనాల మేరకు రాష్ట్రంలో రూ. 63 నుంచి రూ. 70 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ప్రభుత్వం మాత్రం 21 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని తేల్చిందన్నారు.
పధాని మోదీ రూ. 1000 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించినా... రూ. 400 కోట్ల మాత్రమే ఇచ్చారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 844 కోట్ల మాత్రమే ఖర్చు చేసిందని వి వరించానన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా...రూ. 21 కోట్ల వేల నష్టం జరిగితే అందులో కేవలం ఒకే ఒక్క శాతమైన రూ. 844 కోట్ల ఖర్చు చేయడం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పనితీరును తాము విమర్శించడం లేదని, కానీ ఒడిశాలో 2013లో వచ్చిన ఫైలీన్ తుపాను బీభత్సం నుంచికేవలం రెండు రోజుల్లోనే అక్కడి రాష్ట్రం తేరుకుందని, కానీ మనరాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు.
ఒక్క విశాఖ పట్టణానికే వారం రోజులు కష్టపడాల్సి వచ్చిందని, గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ఎన్ని రోజులు పట్టిందో తెలిసిందేనన్నారు. తుపాను సమయంలో ప్రభుత్వం కేవ లం విశాఖను మాత్రమే పట్టించుకున్నారని, మిగిలిన గ్రామీణ, గిరిజన ప్రాంతాలను విస్మరించారన్నారు. గిరిజనులకు జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారని ప్రశ్నించినా... ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే కౌలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేసిన ప్రభుత్వం వారికి తుపాను స మయంలో పంట నష్టాన్ని నేరుగా అందించేలా చేయడంలో వైఫల్యం చెందిందన్నారు.
తోటపల్లి నిర్వాసితుల సమస్య ప్రస్తావన
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పారు. గరుగుబిల్లి మండలం నందివానివలస, బాసంగిలో తోటపల్లి ప్రాజె క్టు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. తోటపల్లి ప్రాజెక్టు పునరావాసంలో భాగంగా ఈ రెండు గ్రామాలకు మూడేళ్ల క్రితం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని, దాన్ని ఇంతవరకు అమలు చేయలేదని ఆమె అసెంబ్లీలో వివరించారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని,అలాగని వారికి వేరొకచోట మంచి స్థలం చూపించి ఇళ్లు కట్టించలేదని పేర్కొన్నారు. దీంతో తోట పల్లికి వరద వచ్చినప్పుడల్లా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని పాలకుల దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా స్పం దించినట్టు కూడా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ‘సాక్షి’కి ఫోన్ చేసి చెప్పారు. అలాగే, హుద్‌హుద్ తుపాను సహాయంపై కూడా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజ న్నదొరతో పాటు పాముల పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. ప్రభుత్వం సరిగా సాయం చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక, గజపతినగరం ఎమ్మెల్యే కొం డపల్లి అప్పలనాయుడు డీసీసీబీ అక్రమాల్ని, పీఏసీఎస్‌ల అక్రమాలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. రావివలస సొసైటీలో జరిగిన బినామీ రుణాల వ్యవ హారాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. బొత్స సత్యనారాయణ డీసీసీబీ చైర్మన్ అయిన దగ్గరి నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించా రు. దీనిపై సీబీసీఐడీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు.