విజయనగరం: ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని సాలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని 9 సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సంధర్బంగా ఎమ్మెల్యే రాజన్న దొర ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత రాజన్న దొర మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.
పార్టీ పెట్టి 8 సంవత్సరాలూ కూడా వైఎస్ జగన్ ప్రజలతో మమేకమై ప్రజల ఇబ్బందుల్లో తోడుంటూ ఆపన్నులకు అండగా నిలుస్తూ వచ్చారని కొనియాడారు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఇతర అనేక సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. పాదయాత్ర చేస్తూ 3 వేలకు పైగా కిలోమీటర్లు నడిచి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు. వైఎస్ జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్‌సీపీ గుర్తు సీలింగ్ ఫ్యాన్‌ను ప్రజలకు తెలిసేలా వివరించాలని కార్యకర్తలను కోరారు.
‘హోదా కోసం పోరాడిన ఏకైక నాయకుడు ఆయనే’
Published Tue, Mar 12 2019 3:38 PM | Last Updated on Tue, Mar 12 2019 8:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment