యథా సీఎం..తథా కళావతి | - | Sakshi
Sakshi News home page

యథా సీఎం..తథా కళావతి

Published Sat, May 4 2024 6:50 AM | Last Updated on Sat, May 4 2024 11:55 AM

యథా సీఎం..తథా కళావతి

యథా సీఎం..తథా కళావతి

 వృద్ధురాలిని ఆలింగనం చేసుకుని పాదాభివందనం 

 పాలకొండలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం 

 విశ్వాసరాయి కళావతికి అపూర్వ ఆదరణ 

పాలకొండ రూరల్‌: సిద్ధం, మేమంతా సిద్ధం సభలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలతో ఎలా మమేకమై..ఎంత ఆప్యాయంగా కలిసిపోతున్నారో రాష్ట్రప్రజలందరికీ విదితమే. యథా రా జా తథా ప్రజా అన్నట్లు తమ నాయకుడి బాటలోనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమైపోతున్నారు. వారి కష్టాలను విని చలించిపోతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ పాలకొండ నియోజకవర్గం అభ్యర్థి విశ్వాసరాయి కళావతికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆమె పాలకొండ మండలంలోని తంపటాపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్న క్రమంలో వృద్ధురాలు పడాల కామమ్మ కళావతి చేతిలో ఉన్న జగనన్న చిత్రపటాన్ని చూసి దగ్గరకు వచ్చింది. తనకు జగన్‌ బాబు మనుమడని, ఆయన వల్లనే పింఛన్‌ వస్తోందంటూ సంతోషం వెలిబుచ్చింది. వలంటీర్లు లేకపోవడంతో రెండు నెలులుగా పింఛన్‌ కోసం తాను పడుతున్న ఇబ్బందులను వివరించింది. దీంతో చలించిపోయిన కళావతి సదరు వృద్ధురాలిని ఆలిం

గనం చేసుకున్నారు. ప్రతిపక్షాల కుట్రే ఈ పరిస్థితికి కారణమని, మీరంతా జగనన్నను, తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, సంక్షేమం మీ గడప వద్దకే వలంటీర్ల ద్వారా అందిస్తామని చెప్పారు. ప్రజల సమక్షంలో కామమ్మను సన్మానించి, పాధాభివందనం చేశారు. అనుకోని ఈ ఘటనతో కళావతి సున్నిత మనస్తత్వానికి చప్పట్లతో స్థానికులు హర్షం తెలిపారు. జై జగన్‌ నినాదంతో ప్రజలు ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement