బాక్సర్ కళావతికి స్వర్ణం | boxer kalavathi gets gold medal in state level school boxing | Sakshi

బాక్సర్ కళావతికి స్వర్ణం

Published Mon, Dec 19 2016 12:08 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

boxer kalavathi gets gold medal in state level school boxing

హైదరాబాద్: రాష్ట్రస్థాయి స్కూల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో గండిపేట మండల పరిధిలోని పుప్పాలగూడ గ్రామానికి చెందిన జి. కళావతి  స్వర్ణ పతకాన్ని సాధించింది. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ఈ టోర్నీలో కళావతి 46-48 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఈనెల 25వ తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయి పోటీలకు కళావతి ఎంపికైయిందని ఆమె కోచ్ శివకుమార్ తెలిపారు. 9వ తరగతి చదువుతోన్న కళావతి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ నేర్చుకోవడంతో పాటు పలు పోటీలలో పాల్గొని పతకాలు గెలిచింది.  జాతీయస్థాయి పోటీల్లోనూ ఆమె ఇదే జోరును కొనసాగించి పతకం సాధిస్తుందని కోచ్‌లు శివకుమార్, వినేశ్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement