![Mahesh Babu And His Daughter Sitara Make Grand Entry On Dance India Dance Show - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/30/Mahesh%201_0.jpg.webp?itok=IR_LZhpM)
సూపర్ స్టార్ మహేశ్ బాబు బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఓ ప్రముఖ డ్యాన్స్ షోకు కూతురు సితారతో కలిసి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సితార తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సాధారణంగానే మహేశ్ షోలు, ఫంక్షన్లకు చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటిది కూతురు సితారతో కలిసి తొలిసారిగా బుల్లితెరపై కనిపించనుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment