Dance india dance
-
DID Super Mom 3: కూలి పని చేస్తూ డాన్స్.. రూ. 10 లక్షలు సొంతం
ఆకలి రుచిని, నిద్ర సుఖాన్ని ఎరగవు అంటారు. ఇదేవిధంగా టాలెంట్‌కు.. బీద, గొప్ప, వయసుతో సంబంధం ఉండదని అనేక సందర్భాల్లో ఎంతోమంది నిరూపించి చూపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో చేరిన వర్షా బుమ్రా కూడా ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. పొట్ట కూటికోసం కూలిపని చేసుకుంటూనే, తనకెంతో ఇష్టమైన డ్యాన్స్‌ను ఎంతో కష్టపడి స్వయంగా నేర్చుకుని ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సూపర్ మామ్స్ సీజన్–3’ విజేతగా నిలిచింది. ఇటీవల ముంబైలో జరిగిన జీ టీవీ డ్యాన్స్ రియాల్టీషో..‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సీజన్ –3’ ఫినాలేలో టైటిల్ విన్నర్‌గా నిలించింది వర్షా బుమ్రా. అనేక మందితో వివిధ రౌండ్లలో కఠినమైన పోటీని ఎదుర్కొని ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీతోపాటు, షో న్యాయనిర్ణేతలను మెప్పించి కొంత, స్పాన్సర్స్ నుంచి కొంత ఇలా మొత్తం పది లక్షల రూపాయలు గెలుచుకుంది. కూలి పనిచేసుకుని కేవలం వందల్లో సంపాదించే వర్షకు ఇది చాలా పెద్దమొత్తం. అందరిలా కాకుండా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆమె ఈ స్టేజి మీద విజేతగా నిలవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. హర్యానాకు చెందిన వర్షా బుమ్రాది నిరుపేద కుటుంబం. పదిహేడేళ్ల వయసులో పెళ్లి అయ్యింది. భవన నిర్మాణ రంగంలో రోజువారి కూలీగా పనిచేస్తున్న భర్తతో కలిసి తను కూడా పనికి వెళ్లి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. వీరికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. వర్షకు డ్యాన్స్ అంటే ఎనలేని మక్కువ. పెళ్లికి ముందు డ్యాన్స్ చేస్తూ అనేక పోటీల్లో పాల్గొంది. అయితే ఆ విషయం ఎప్పుడూ బయటకు చెప్పలేదు. బాబుకు ఐదేళ్లు వచ్చాక ఓ రోజు డ్యాన్స్‌పై ఉన్న ఇష్టాన్ని భర్తకు చెప్పింది. అతను కూడా వర్షను ప్రోత్సహించడంతో తనకు సమయం దొరికనప్పుడల్లా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేది. వీడియోలు చూసి... భర్త ఇచ్చిన ప్రోత్సాహం, మరోపక్క కొరియోగ్రాఫర్ వర్తికా ఝా వీడియోలను సోషల్ మీడియాలో చూసిన వర్షకు డ్యాన్స్ నేర్చుకోవాలన్న కసి పెరిగింది. దీంతో రోజూ ఆన్లైన్లో వీడియోలు చూసి ఒక్కో పాటను పదిసార్లు సాధన చేసేది. ఇలా అనేకరోజులపాటు క్రమం తప్పకుండా సాధన చేసి చాలా రకాల డ్యాన్స్ స్టెప్స్‌ను త్వరత్వరగా నేర్చేసు కుంది. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సూపర్ మామ్స్‌కు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకుని ఆడిషన్స్‌కు వెళ్లి, వారిని మెప్పించి పోటీలో పాల్గొనడానికి ఎంపికైంది. దీంతో కూలిపనికి వెళ్లడం మానేసి పూర్తి సమయాన్ని డ్యాన్స్ ప్రాక్టీస్‌కే కేటాయించింది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా కఠోర సాధన చేసింది. ఈ షోలో పన్నెండుమంది డ్యాన్సర్లు పోటీపడగా, ఆరుగురు ఫైనల్స్‌కు చేరుకున్నారు. వర్ష అందర్ని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. సిమెంటు, ఇటుకలు మోసిన ఆమె నేడు సూపర్ మామ్స్ ట్రోఫీని మోసుకురావడంతో ఆమె గురించి తెలిసిన హర్యాణావాసులు బ్యాండు మేళాలతో ఘనస్వాగతం పలుకుతున్నారు. లక్ష సంపాదిస్తానని కలలో కూడా అనుకోలేదు ‘‘జీవితంలో లక్షరూపాయలు సంపాదిస్తానని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. కానీ డ్యాన్స్ సాధన చేయడం వల్ల ఈరోజు నేను ఇన్ని లక్షల రూపాయలు గెలుచుకోగలిగాను. ఇలాంటి షోల వద్ద సెక్యూరిటీ గార్డులతో కనీసం మాట్లాడే అర్హత కూడా లేని నేను నాకొడుకుకు మంచి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకోగలిగాను. నేను పడ్డ కష్టాలు మా అబ్బాయి పడకూడదు, వాడికి మంచి జీవితం ఇవ్వాలన్న లక్ష్యంతో సాధన చేసాను. అదే ఈరోజు నన్ను ఈ టైటిల్ విన్నర్‌గా నిలబెట్టింది. షోకు వచ్చిన అతిథులు సైతం నా కొడుకు చదువుకయ్యే ఖర్చుని భరిస్తామని చెప్పడం చాలా పెద్దవిషయం. ఇప్పటిదాకా మాకంటు సొంత ఇల్లు లేదు. వచ్చిన మొత్తంలో కొంత వెచ్చించి చిన్న ఇల్లు కొనుక్కుంటాను’’ అని వర్ష ఆనందం వ్యక్తం చేసింది. -
కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఓ ప్రముఖ డ్యాన్స్ షోకు కూతురు సితారతో కలిసి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సితార తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సాధారణంగానే మహేశ్ షోలు, ఫంక్షన్లకు చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటిది కూతురు సితారతో కలిసి తొలిసారిగా బుల్లితెరపై కనిపించనుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఐదేళ్ల తర్వాత మళ్లీ బుల్లి తెరపైకి హాట్ బ్యూటీ.. న్యాయ నిర్ణేతగా
Mouni Roy Return To Small Screen After 5 Years As A Judge: బాలీవుడ్ బుల్లితెర హాట్ బ్యూటీ మౌని రాయ్ హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తన గ్రామరస్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హిందీ సీరియల్స్‌లో నటించిన తర్వాత ఆమెకు వరుసగా బీటౌన్ మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన గోల్డ్, రాజ్ కుమార్ రావుకు జంటగా మేడ్ ఇన్ చైనాతో పాటు పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్న మౌని.. సుమారు ఐదేళ్ల తర్వతా మళ్లీ బుల్లితెరపైన సందడి చేయనుంది. ఆమె తొలిసారిగా నటనను ప్రారంభించిన వేదికపైకి మళ్లీ వెళ్లనుంది. మంచి గుర్తింపు తెచ్చుకున్న హిందీ షోలలో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' ఒకటి. ఈ షో ఐదో సీజన్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది మౌని రాయ్. ఈ విషయం గురించి మౌని మాట్లాడుతూ 'నాకు డ్యాన్స్ అంటే ఒక ఎక్స్ప్రెషన్. వివిధ కళారూపాల సమ్మేళనం. 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోకు న్యాయనిర్ణేతగా భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదికపై చిన్న పిల్లల ప్రతిభను చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను.' అని తెలిపింది. 'క్యూంకీ సాస్ బీ కబీ బహు థీ', 'దేవోన్ కీ దేవ్.. మహాదేవ్' సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మౌని రాయ్ 'నాగిన్'తో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇదీ చదవండి: తెల్లటి పొట్టి గౌనులో 'నాగిని'.. అదిరిందిగా మౌని -
ఒకపక్క సీరియళ్లు, సినిమాలు, మరోపక్క యాడ్స్..19 ఏళ్లలోనే అనుష్క రికార్డ్
చదువు, ఆటపాటల్లో చురుకుగా ఉండే ఈ అమ్మాయికి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో జరిగే వివిధ ఈవెంట్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనేది. ఒకసారి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొంది కానీ తొలిరౌండ్లో ఎలిమినేట్ అయ్యింది. ఆ తరువాత టీవీ సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో మంచి నటిగా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క సేన్. 19 ఏళ్ల అనుష్క వివిధ సీరియల్స్‌లో నటించి పాపులర్ అవడమేగాక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లక్షలమంది వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటోంది. చిన్న వయసులో సీరియల్స్, యాడ్స్‌లో నటిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎంతో మంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. జార్ఖండ్‌కు చెందిన అనిర్బన్, రాజ్‌రూప సేన్ దంపతుల ఒక్కగానొక్క సంతానం అనుష్కసేన్. 2002 ఆగస్టు 4న రాంచీలో పుట్టిన అనుష్క కొన్ని రోజులు అక్కడే ఉన్న తరువాత, కుటుంబం ముంబైకి మకాం మార్చడంతో ముంబైలోని ‘రయాన్ ఇంటర్నేషనల్ స్కూల్’లో చదివింది. చిన్నప్పటి నుంచి క్యూట్‌గా, యాక్టివ్‌గా ఉండే అనుష్కకు డ్యాన్స్ అంటే ఇష్టం. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ పోటీలో పాల్గొంది. కానీ కాళ్లకు సమస్య ఎదురవడంతో వెంటనే ఎలిమినేట్ అయ్యింది. డ్యాన్స్ కాంపిటీషన్ నుంచి వెనుతిరిగాక, అదే సమయంలో ‘యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీ’ అనే హిందీ టీవీ సీరియల్లో నటించే అవకాశం అనుష్కను బిజీ చేసేసింది. రాణి లక్ష్మిగా... సీరియల్స్‌లో నటిస్తూనే... రాకేష్ ఓమ్ ప్రకాష్ మెహ్రా కంపోజ్ చేసిన ‘హమ్కో హై ఆశా’ మ్యూజిక్ వీడియోలో(2012) నటించింది. మరుసటి ఏడాది బాల్ వీర్, దేవన్ కి దేవ్ మహదేవ్ సీరియల్లో చిన్నప్పటి పార్వతీ దేవిగా, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్, కామెడీ క్లాసెస్, ఇంటర్నెట్ వాలా లవ్ , అప్నా టైమ్ భీ ఆయేగా వంటి సీరియల్స్‌లో నటించింది. కలర్స్ టీవీలో ప్రసారమైన ఝాన్సీ కీ రాణి సీరియల్లో అనుష్క పోషించిన రాణి లక్ష్మి పాత్ర తనకి మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. అంతేగాక బాల్ వీర్లో మెహర్‌గా క్యారెక్టర్లో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక్కడినుంచి అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటనలో కాస్త నిలదొక్కుకున్నాక ‘షియామక్ దేవర్ డ్యాన్స్ అకాడమీ’లో చేరి డ్యాన్స్ నేర్చుకుంది. యాక్టింగ్ చేస్తున్నప్పటికీ, చదువును నిర్లక్ష్యం చేయలేదు. పదోతరగతి, ఇంటర్మీడియట్లలో ఎనభైఐదు శాతం పైగా మార్కులు సాధించింది. భవిష్యత్‌లో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేయాలని అనుష్క భావిస్తోంది. యాడ్స్‌లో.. సీరియల్ ద్వారా అనుష్కకు వచ్చిన పాపులారిటీతో ఆమెకు అనేక యాడ్లలో నటించే అవకాశాలు వచ్చాయి. వీటిలో అమూల్ చీజ్, హార్లిక్స్, హరిదర్శన్ దూప్ స్టిక్స్, డీఎన్ఏ, అబ్సల్యూట్ ఇండియా, ఏరియల్ డిటర్జెంట్, కొరియో ఎలక్ట్రానిక్స్, ఇమేజ్ బజార్, నయి దునియా వంటి అనేక యాడ్లలో నటించింది. ఎమ్ఎస్ ధోనీతో కలిసి కమర్షియల్ యాడ్‌లో కూడా నటించింది. ఇవేగాక అర్బన్ క్లాప్, కూవ్స్, మింత్రా వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా... అనుష్కకు కంగనా రనౌత్ అంటే బాగా ఇష్టం. దీంతో ఆమె నటించిన క్వీన్ సినిమాను అనేకసార్లు చూసింది. 2015లో ‘క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’ సినిమాలో నటించి బాలీవుడ్లో అడుగు పెట్టింది. లిహాఫ్: ద క్విల్ట్, షార్ట్ ఫిల్మ్ సమ్మదిత్తిలో నటించింది. చాలా మ్యూజిక్ వీడియోలలో అనుష్క నటించింది. వీటిలో ‘గల్ కర్కే’, ‘వియా’, ‘సూపర్ స్టార్’ వంటివి బాగా పాపులర్ అయ్యాయి. రామ్ కపూర్ నిర్మించిన బడే అచ్చే లగతే హై సీరియల్, డ్యాన్స్ టెలివిజన్ రియాలిటీ షో జలక్ ధికలాజా, కామెడీ సర్కస్‌లో పాల్గొంది. ఒకపక్క సీరియళ్లు, సినిమాలు, మరోపక్క యాడ్లు చేస్తూనే ఖాళీ సమయాల్లో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూట్యూబ్(2017) చానల్లో తనకు సంబంధించిన కంటెంట్, ఫన్నీ, కామెడీ, బ్యూటీ రెమిడీ వీడియోలను పోస్టు చేస్తూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆరు మిలియన్ల ఫాలోవర్స్‌తో పాపులర్ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. ఇండియాలో టిక్‌టాక్ నడిచినంతకాలం టిక్‌టాక్ సెలబ్రిటీగా, సింగర్, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క యూట్యూబ్ చానల్‌కు దాదాపు 24 లక్షలమంది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ‘ఖతరోంకే ఖిలాడీ– 11’లో పాల్గొని ఎలిమినేట్ అయ్యింది. ఈ షోలో పాల్గొన్న 19 ఏళ్ల పిన్న వయస్కురాలిగా అనుష్క సేన్ నిలవడం విశేషం. తల్లిదండ్రులతో అనుష్కసేన్ సోషల్ స్టార్ -
డెలివరీ బాయ్‌గా మారిన డ్యాన్సర్, అంతలోనే!
కోల్‌కతా: 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ బికీ దాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం అతడు బైక్ మీద వెళుతున్న క్రమంలో మరో బైక్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటన మీద బికి దాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా వుంటే బికి దాస్ 2014లో ప్రసారమైన 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' నాల్గో సీజన్లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన ఎనర్జీతో, హుషారెత్తించే స్టెప్పులతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అతడు షోలో సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. కానీ ఈ షో ద్వారా అతడు పెద్దగా లాభపడిందేమీ లేదు. పొట్టకూటి కోసం పలు ఈవెంట్లకు డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు చేసిన అతడికి లాక్డౌన్ వల్ల ఉపాధి లేకుండా పోయింది. దీంతో గత పది రోజులుగా అతడు కోల్‌కతాలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన బాలీవుడ్ నటి 5జీ టెక్నాలజీ: జూహీచావ్లాకు షాక్.. 20లక్షల జరిమానా -
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ని భలేగా బ్యాలెన్స్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. ప్రస్తుతం లండన్‌లో హాలిడే మోడ్‌లో ఉన్నారు కరీనా. తన టీవీ డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ కోసం ఒక్క రోజు ముంబై వచ్చి, షూట్ కంప్లీట్ చేసుకుని మళ్లీ లండన్ ఫైట్ ఎక్కారని బాలీవుడ్ సమాచారం. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో’లో కరీనా జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గత రెండు వారాలుగా ఒక్క రోజు కోసం ముంబై రావడం, లండన్ వెళ్లడం జరుగుతోందట. ఇక అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసిన కరీనా.. త్వరలో ‘అంగ్రేజీ మీడియం’ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతారు. ఇంకా కరణ్ జోహార్ ‘తక్త్’, ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమాల్లో కరీనా హీరోయిన్గా నటించనున్న సంగతి తెలిసిందే. ఇలా... సినిమాలు, టీవీ షోలు, హాలిడేలతో ‘మై లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అంటున్నారు కరీనా. -
ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై వేధింపుల కేసు
ముంబై : బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, ఏబీసీడీ ఫేం సల్మాన్ యూసఫ్ ఖాన్‌పై వేధింపుల కేసు నమోదైంది. సినిమాల్లో అవకాశాలిప్పిస్తానని, తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న ముంబై, ఒషివరా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతేడాది ఆగస్టులో లండన్‌లో ఉన్నప్పుడు డ్యాన్సర్‌గా అవకాశాల కోసం తొలిసారి యూసఫ్ ఖాన్ మేనేజర్‌ను సంప్రదించానని, అనంతరం ముంబైలోని ఓ కాఫీషాప్‌లో యూసఫ్ ఖాన్‌ను కలిసానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అతను బాలీవుడ్ పార్క్‌లో డ్యాన్సర్‌గా అవకాశం కల్పిస్తానని చెప్పి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తాకరాని చోట చేతులు వేస్తూ ఇబ్బంది పెట్టాడని ఆరోపించింది. అనంతరం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడని, తన చర్యలను తిరస్కరిస్తే.. ఇది బాలీవుడ్లో కామన్ అంటూ మాట్లాడాడని చెప్పుకొచ్చింది. దుబాయ్‌లో హోటల్‌కు రమ్మన్నాడని, అతని కజిన్ బ్రదర్‌తో కలిసి వేధింపులకు గురిచేశాడని తెలిపింది. సల్మాన్, అతని టీమ్ గతకొద్ది రోజులుగా తనను తీవ్రంగా టార్చర్ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. ఫేమస్ డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ విన్నర్ అయిన సల్మాన్ బాలీవుడ్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫర్‌గా పనిచేశారు. ఏబీసీడీ, రక్త చరిత్ర, వాంటెడ్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. -
ఆడిషన్స్‌లో ‘సూపర్ మామ్స్ సీజన్ 2’
గత ఏడాది ప్రసారమైన ‘డాన్స్ ఇండియా డాన్స్ (డి.ఐ.డి)-సూపర్ మామ్స్’కి కొనసాగింపుగా జీ టీవీలో సీజన్ 2 ఆరంభం కానుంది. డాన్స్ పట్ల ఆసక్తి ఉండి, దాన్ని ప్రదర్శించుకోవడానికి సరైన వేదిక దొరకని ప్రతి తల్లీ ఈ షోను సద్వినియోగం చేసుకోవచ్చని జీ టీవీ ప్రతినిధి తెలిపారు. ఈ షోలో పాల్గొనాలనుకున్న వాళ్లు ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మొత్తం 16 నగరాల్లో ఆడిషన్స్ చేస్తున్నారు. నవంబర్ 2న హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో గల నందినీ హైస్కూల్లో ఆడిషన్స్ జరుగుతాయనీ, 18 ఏళ్లు, అంతకన్నా పైబడిన వారు ఆడిషన్స్‌కు రావచ్చని తెలిపారు. -
దటీజ్ తెరియా!
విజయం పోటీ పడనిదే గెలుపు దక్కదు. పరుగు తీయనిదే గమ్యం అందదు. తెరియాకి గెలుపు దక్కింది. ఇక గమ్యాన్ని చేరుకోవడమే మిగిలింది. ఇంతకీ ఆమె గమ్యం ఏమిటో తెలుసా... తన అభిమాన నటి సోనాక్షి సిన్హాలా నటి కావడం! డ్యాన్స ఇండియా డ్యాన్స లిటిల్ మాస్టర్స సీజన్ 3 ఫైనల్స్‌లో ఆఖరి రౌండ్ ముగిసింది. అందరూ ఊపిరి బిగబట్టి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పోటీలో పాల్గొన్న చిన్నారులంతా టెన్షన్ పడుతున్నారు. న్యాయ నిర్ణేతల నోటి వెంట ఎవరి పేరు వినిపిస్తుందోనని చెవులు రిక్కించి నిలబడ్డారు. వాళ్లు ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చింది. విజేత పేరు వెలువడింది. స్టేజిమీద నిలబడిన పదకొండేళ్ల తెరియా మగర్ ముఖం... గెలుపు తెచ్చిన ఆనందంతో వెలిగిపోయింది. రాత్రికి రాత్రే ఆ చిన్నారి పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది. నేపాల్‌లోని రుద్రపూర్ గ్రామంలో జన్మించింది తెరియా. అడుగులు పడుతున్నప్పుడే డ్యాన్సు స్టెప్పులు వేయడం ప్రారంభించింది. కూతురి ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. చదువులో సైతం అత్యంత చురుగ్గా ఉండే ఈ చిచ్చర పిడుగు... డ్యాన్స ఇండియా డ్యాన్సలో చోటు సంపాదించింది. కానీ గెలుస్తుంది అనైతే ఆమె ఇంట్లోవాళ్లుగానీ, ఆమె గానీ ఊహించనేలేదు. అందుకే ఆ విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని అంటోంది... సీజన్ 3 టైటిల్‌తో పాటు పది లక్షల నగదు అవార్డును కూడా గెలుచుకున్న తెరియా. ఇప్పుడే ఇంత సాధించావ్, పెద్దయ్యాక ఏం చేస్తావ్ అంటే.. మరో సోనాక్షీసిన్హాని అవుతా అంటోంది తెరియా తడుముకోకుండా. సోనాక్షి అన్నా, ఆమె నటన, డ్యాన్స తనకి చాలా ఇష్టమని, ఆమెలానే నటినవుతా అంటోంది తెరియా. అంతేకాదు... కొరియోగ్రఫీ కూడా చేస్తుందట. మరో ఏడెనిమిదేళ్లు గడిస్తే మనం మరో సోనాక్షిని తప్పక చూడొచ్చు. ఎందుకంటే... తెరియా చెప్పిందంటే చేసి తీరుతుంది. అనుకున్నది సాధించి చూపిస్తుంది!