గత ఏడాది ప్రసారమైన ‘డాన్స్ ఇండియా డాన్స్ (డి.ఐ.డి)-సూపర్ మామ్స్’కి కొనసాగింపుగా జీ టీవీలో సీజన్ 2 ఆరంభం కానుంది. డాన్స్ పట్ల ఆసక్తి ఉండి,
గత ఏడాది ప్రసారమైన ‘డాన్స్ ఇండియా డాన్స్ (డి.ఐ.డి)-సూపర్ మామ్స్’కి కొనసాగింపుగా జీ టీవీలో సీజన్ 2 ఆరంభం కానుంది. డాన్స్ పట్ల ఆసక్తి ఉండి, దాన్ని ప్రదర్శించుకోవడానికి సరైన వేదిక దొరకని ప్రతి తల్లీ ఈ షోను సద్వినియోగం చేసుకోవచ్చని జీ టీవీ ప్రతినిధి తెలిపారు. ఈ షోలో పాల్గొనాలనుకున్న వాళ్లు ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మొత్తం 16 నగరాల్లో ఆడిషన్స్ చేస్తున్నారు. నవంబర్ 2న హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో గల నందినీ హైస్కూల్‌లో ఆడిషన్స్ జరుగుతాయనీ, 18 ఏళ్లు, అంతకన్నా పైబడిన వారు ఆడిషన్స్‌కు రావచ్చని తెలిపారు.