Zee TV
-
కుప్పకూలిన దిగ్గజ కంపెనీ స్టాక్..
-
రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో న్యూస్ యాంకర్ అరెస్టు!
న్యూఢిల్లీ: జీ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ని అతని నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి చత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఘజియాబాద్ పోలీసులు జోక్యం చేసుకుని రంజన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అయితే యాంకర్ రంజన్‌ను అరెస్టు చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతను అరెస్టు కావల్సి వచ్చింది. ప్రస్తుతం అతను యూపీ పోలీసుల అధీనంలో ఉన్నాడు. అసలేం జరిగిందంటే...రోహిత్ జీ టీవీ ఛానెల్లో పేరుగాంచిన డీఎన్ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నాడు. రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియో న్యూస్‌ని తప్పుగా అందించారు. ఆ తర్వాత ఛానెల్ వెంటనే సరిచేసుకుని క్షమాపణల చెప్పింది. ఐతే ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడారంటే.."రాహుల్ గాంధీ తన వయనాడ్ కార్యాలయంపై దాడిని ప్రస్తావిస్తూ...ఇలా చేసిన యువకులు చాలా బాధ్యతారహితం ప్రవర్తించారు. అయినా వారు చిన్న పిల్లలు క్షమించండి. అని అన్నారు." అయితే జీ ఛానెల్ ఉదయపూర్‌లో కన్హయ్య లాల్‌ను చంపిన ఘటనతో లింక్ చేస్తూ... వారు చిన్నపిల్లలని, వారిని క్షమించాలంటూ చెబుతున్నట్లుగా వక్రీకరించి సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఆ యాంకర్‌పై చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఆ ఛానల్ జర్నలిస్ట్ ట్విట్టర్లో..చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా తనని ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసం నుంచి ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఎలా తీసుకువెళ్లారని రంజన్ ప్రశ్నించారు. ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ...సమాచారం ఇవ్వాలనే నియమం లేదు. అయినా ఇప్పడూ మీకు తెలిసింది కాబట్టి తమకు సహకరించాలని రంజన్కి చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ..బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. జర్నలిస్టుల పై దాడులు నిర్వహించేందుకు చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను నిర్మోహమాటంగా కాంగ్రెస్ వినియోగించేస్తుందంటూ.. విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాటి అధికార జ్ఞాపకాల మత్తులో కూరుకుపోయి ఇలాంటి ఘటనలకు పాల్పడతోందని అన్నారు. बिना लोकल पुलिस को जानकारी दिए छत्तीसगढ़ पुलिस मेरे घर के बाहर मुझे अरेस्ट करने के लिए खड़ी है,क्या ये क़ानूनन सही है @myogiadityanath @SspGhaziabad @adgzonelucknow — Rohit Ranjan (@irohitr) July 5, 2022 (చదవండి: శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు?) -
ముంబైలో ఆర్ఆర్ఆర్ టీమ్ న్యూ ఇయర్ వేడుకలు
Roar Of RRR In Mumbai: రౌధ్రం.. రణం.. రుధిరం..(ఆర్ఆర్ఆర్).. నార్త్ టు సౌత్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగుతోంది. ఎంతైనా పాన్ ఇండియా సినిమా కదా! అందుకే ఆ రేంజ్‌కు తగ్గట్లే ప్రమోషన్లు చేస్తోంది చిత్రయూనిట్. ఇన్నాళ్లు సినిమా అద్భుతంగా రావడం కోసం కష్టపడితే ఇప్పుడది ప్రేక్షకుల నోళ్లలో నానేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను చెరిపేసేందుకు కొత్త సంవత్సరంలో జనవరి 7న బాక్సాఫీస్ బరిలోకి దూకుతున్నారు ఎన్టీఆర్, రామ్‌చరణ్. సినిమాకు ఎంత ఖర్చు పెట్టారో కానీ.. దాని ప్రమోషన్స్‌కు సైతం అదే రేంజ్లో ఖర్చు పెడుతున్నారు. ప్రెస్మీట్లు, ఇంటర్వ్యూలతో నానా హంగామా చేస్తున్నా ఆర్ఆర్ఆర్ టీమ్ తాజాగా ముంబైలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహించిన ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, రాజమౌళి హాజరయ్యారు. మరి ఆర్ఆర్ఆర్ సందడితో కొత్త సంవత్సరాన్ని షురూ చేయాలంటే జీ టీవీలో ప్రసారమయ్యే రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ ఇన్ ముంబై పేరిట ప్రసారం కానున్న స్పెషల్ ఎపిసోడ్‌ను వీక్షించాల్సిందే. Get ready to welcome 2022 with a roar of RRR! 💥🙌🏻 Watch #RoarOfRRRInMumbai - ‘New Year Celebrations with RRR’, on Fri, 31st Dec at 11pm, on #ZeeCinema and @ZeeTV pic.twitter.com/iOxK2sCEt6 — BA Raju's Team (@baraju_SuperHit) December 31, 2021 -
బాంబే హైకోర్టుకి చేరిన జీ టీవీ వివాదం
జీ టీవీ యాజమాన్యానికి దానిలో పెట్టుబడిదారులకు మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. వివాదం పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు సుముఖంగా లేవు. దీంతో రెండు వైపులా వేర్వేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. బాంబై హైకోర్టులో అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించాలంటూ ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్లు పంపిన నోటీసులు చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జీ టీవీ యాజమాన్యం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందే అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించలేమంటూ ఇన్వెస్కో , ఓఎఫ్‌ఐలకు జీ టీవీ తెలియజేసింది. ముదిరిన వివాదం జీ టీవీలో ఇన్వెస్కోతో పాటు ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ రెండు సంస్థలు దాదాపు 18 శాతం వాటాతో జీ టీవీలో మేజర్ షేర్‌హోల్డర్లుగా ఉన్నాయి. సెప్టెంబరు 4న జీ టీవీ సీఈవోగా పునీత్ గోయెంకాను తొలగించాలంటూ మేజర్ షేర్ హోల్డర్లు జీ మేనేజ్మెంట్ని కోరారు. దీనిపై చర్చలు జరుగుతుండగానే షేర్ హోల్డర్లను సంప్రదించకుండా సోనీ టీవీలో జీ టీవీని విలీనం చేశారు. ఈ రెండు సంస్థలకు సంయుక్తంగా సీఈవోగా పునీత్ గోయెంకాను నియమించారు. వెనక్కి తగ్గట్లేదు మేజర్ షేర్ హోల్డర్ల నిర్ణయాలను పక్కన పెట్టి విలీనం చేయడమే కాకుండా తాము కోరినట్టుగా సీఈవో మార్పు చేయకపోవడంతో అత్యవరసర బోర్డు సమావేశం నిర్వహించాలంటూ మరోసారి ఇన్వెస్కో జీని కోరింది. అయితే జీ ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్టోబరు 4న విచారణ జీ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ ఇన్వెస్కో సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. వెనువెంటనే అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించేలా జీ మేనేజ్మెంట్కు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అక్టోబరు 4న దీనిపై విచారణ జరగనుంది. దీంతో అక్టోబరు 2నే జీ యాజమాన్యం బాంబే హై కోర్టును ఆశ్రయించింది. చదవండి : ‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని -
‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని
ఇండియాలోనే అతి పెద్ద టీవీ, ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా చెప్పుకుంటున్న జీ - సోనీ విలీన ప్రక్రియలో మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్లు పట్టు వదిలేందుకు సిద్ధంగా లేరు. ఇన్వెస్కో లేఖ జీ లిమిటెడ్‌కి ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయోంకాను తొలగించడంతో పాటు ఆరుగురు డైరెక్టర్లను తొలగించాలంటూ జీలో మేజర్ షేర్‌హోల్డర్‌గా ఉన్న ఇన్వెస్కో జీ బోర్డును కోరింది. అందుకు గల కారణాలు వివరిస్తూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. తెరపైకి విలీనం ఇన్వెస్కో నుంచి లేఖ వచ్చిన వెంటనే స్పందించిన జీ బోర్డు ఇద్దరు డైరెక్టర్లను తప్పించింది. అనంతరం సోనీతో చర్చలు ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో జీ విలీనం అవుతున్నట్టు భారీ డీల్‌ని సెప్టెంబరు 22న ప్రకటించింది. ఈ రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు సైతం పునీత్ గోయెంకానే ఎండీగా ఉంటాడని ప్రకటించింది. దీంతో వివాదం సమసిపోతుందని జీ భావించింది. ఇన్వెస్కో కోరినట్టు అత్యవసర సమావేశం నిర్వహించలేదు. న్యాయ పోరాటం జీలో మేజర్ షేర్ హోల్డర్‌గా తాము అభ్యంతరం చెప్పిన విషయాలపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడమే కాకుండా విలీన ప్రక్రియ జరపడం, ఆ తర్వాత పునీత్ గోయెంకానే తిరిగి ఎండీగా నియమించడం పట్ల ఇన్వెస్కో అసంతృప్తిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతుంది. లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోనికి చిక్కులు జీని విలీనం చేసుకోవడం ద్వారా ఒకే సారి అర్బన్, రూరల్ మార్కెట్లతో పాటు హిందీ, రీజనల్ లాంగ్వెజ్లలో మరింతగా విస్తరించాలనుకున్న సోనికి ఇన్వెస్కో వ్యవహరం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. జీ అంతర్గత సమస్యలు ఇప్పుడు సోనిని కూడా చుట్టుముట్టాయి నామ్‌కే వాస్తే సుభాష్ చంద్ర స్థాపించిన జీ మీడియాలో ప్రస్తుతం ఆయన వాటా కేవలం 5 శాతమే. చాలా మంది ఆ కంపనీలో పెట్టుబడులు పెట్టారు. నిన్నా మొన్న సోనీతో విలీన ప్రక్రియ ముగిసే వరకు ఇన్వెస్కో సంస్థ జీలో మేజర్ పెట్టుబడిదారుగా ఉంది. చదవండి: సోనీకి ‘జీ’ హుజూర్! -
జీ -సోనీ డీల్..! వారం రోజుల్లో సుమారు రూ. 50 కోట్ల లాభం..!
భారత మీడియా రంగంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య విలీనం ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్కు 47.07 శాతం, సోనీ పిక్చర్స్ కు 52.93 శాతం మేర వాటాలు దక్కనున్నాయి. విలీనం తర్వాత సోనీ పిక్చర్స్ 1.575 బిలియన్ డాలర్ల నిధుల్ని పెట్టుబడిగా పెట్టనుంది. చదవండి: సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం ! కాసుల వర్షం కురిపించిన ఒప్పందం...! జీ, సోనీ నెట్వర్క్స్ మధ్య జరిగిన ఒప్పందం...స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ జున్‌జున్‌వాలాకు కాసుల వర్షం కురిపించింది. జీ, సోనీ నెట్‌వర్క్స్‌ల విలీన వార్తలతో బుధవారం మార్కెట్లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) షేర్లు 30% పైగా పెరిగాయి. దీంతో బిగ్‌బుల్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. గతవారం రాకేశ్ జున్‌జున్‌వాలా సుమారు 50లక్షల జీల్ షేర్లను కొనుగోలు చేశారు. జీల్ ఒక్కో షేర్‌ను రూ. 220.4 కు కొనుగోలు చేయగా ప్రస్తుతం వాటి విలువ ఏకంగా రూ. 337 పెరిగింది. దీంతో రాకేశ్ 50 శాతం మేర లాభాలను గడించారు. జీ మీడియా చీఫ్ పునీత్ గోయెంకా బోర్డు నుంచి తప్పుకున్న రోజునే రాకేశ్తోపాటుగా , యూరప్‌కు చెందిన బోఫా సెక్యూరిటీస్ సుమారు 50 లక్షల షేర్లను కొన్నారు. కాగా పలువురు ఈ డీల్ గురించి ముందే తెలిసి జీల్ భారీగా షేర్లను కొన్నట్లు సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కచ్చితంగా ఇన్సైడర్ ట్రేండింగ్ జరిగి ఉండవచ్చునని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జీ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించడం గమనార్హం. దక్షిణాసియాలో ప్రధాన మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీ వాటాదార్లకూ ఇది లాభదాయకమని జీ మీడియా వెల్లడించింది. చదవండి: చైనాకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుందా..? -
సోనీటీవీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం !
భారత మీడియా రంగంలో రెండు సంస్థల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సోనీ టీవీలో..జీ ఎంటర్ టైన్మెంట్ విలీనమైంది. కంటెంట్ క్రియేషన్‌లో గత మూడు దశాబ్దాలుగా వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటున్న జీఎంటర్ టైన్మెంట్ పలు కీలక పరిణామల నేపథ్యంలో సోనీ టీవీలో విలీనం అయ్యేందుకు సిద్ధ పడింది. ఇందుకు జీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలపడంతో విలీనం ఖరారైంది. దీంతో విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో జీ ఎంటర్టైన్మెంట్కు 47 శాతం, ఎస్పీఎన్ఐకు 52 శాతం వాటాలు దక్కనున్నాయి. ప్రస్తుతం జీ ఎంటర్ టైన్మెంట్ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించనున్నారు. జీ లెర్న్, జీ మీడియాకూ సెగ! మరో వైపు జీ ఎంటర్టైన్మెంట్, డిష్ టీవీ తదుపరి జీ లెర్న్, జీ మీడియాలపై సుభాష్ చంద్ర కుటుంబానికి వాటాదారుల నుంచి అసమ్మతి సెగ తగలనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.తొలుత డిష్ టీవీలో సవాళ్లు ఎదురుకాగా..గత వారం జీ ఎంటర్టైన్మెంట్ నుంచి ప్రమోటర్లతో పాటు,పునీత్ గోయెంకా అధ్యక్షతన ఏర్పాటైన మేనేజ్మెంట్ను తొలగించడంపై ఈజీఏం ఏర్పాటుకు డిమాండ్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ లెర్న్, జీ మీడియా నుంచి సైతం సుభాష్ చంద్రకు చెందిన ప్రమోటర్ ఎస్సెల్ గ్రూప్‌నకు వ్యతిరేకంగా వాటాదారులు గళమెత్తే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈజీఎం ఏర్పాటుకు వాటాదారులు పట్టుబట్టే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. అయితే జీ ఎంటర్టైన్మెంట్లో సుభాష్ చంద్ర వాటా 3.99 శాతమేకాగా.. జూన్‌కల్లా జీ లెర్న్‌లో 21.69 శాతం, జీ మీడియా కార్పొరేషన్లో 14.72 శాతం చొప్పున ప్రమోటర్లు వాటాను కలిగి ఉన్నారు. -
కథ కొత్తగా ఉంటే ఆదరిస్తారు
‘‘నాది విజయవాడ. బీటెక్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాను. అసిస్టెంట్ రైటర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశా. కొన్ని యాడ్ ఫిల్మ్స్, 5 షార్ట్స్ ఫిల్మ్స్ చేశాను. ఆ తర్వాత ‘మేకసూరి’ చిత్రానికి దర్శకత్వం వహించాను... ఇదే నా తొలి సినిమా’’ అని డైరెక్టర్ త్రినా«ద్ వెలిశిల అన్నారు. అభినయ్ రెడ్డి, సమయ జంటగా నరేష్ బైరెడ్డి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మేకసూరి’. కార్తీక్ కంచెర్ల నిర్మించిన ఈ చిత్రం జీ 5లో శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా త్రినా«ద్ వెలిశిల మాట్లాడుతూ –‘‘మోసగాళ్లకు మోసగాడు, ఒక్కక్షణం’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. ఆ తర్వాత ‘మేకసూరి’ కథను రెడీ చేసుకున్నా. ఈ చిత్రానికి నేను, కెమెరామెన్ పార్ధు సైనా కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యాం. విడుదల తర్వాత చాలా మంచి స్పందన వస్తోంది. నార్త్ వారు కూడా సబ్ టైటిల్స్‌తో చూస్తున్నారు. కథ వైవిధ్యంగా ఉంటే ఎక్కడైనా ఆదరిస్తారు. మా సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఫోన్ చేసి నన్ను అభినందించడం మరచిపోలేను. కొన్ని పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి’’ అన్నారు. -
జీ వాటాపై బిలియనీర్ల కన్ను?
సాక్షి, న్యూఢిల్లీ: బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాటాలపై కన్నేసినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దేశీయ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ సుభాష్ చంద్ర వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తొలి దశ చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ క్వింట్ తాజాగా పేర్కొంది. త్వరలోనే జీ ఎంటర్టైన్మెంట్లో సుభాష్ వాటా కొనుగోలుకు నిమిత్తం ప్రాథమిక బిడ్స్ దాఖలు చేయవచ్చని, ఈ మేరకు అధికారిక ప్రతిపాదన త్వరలోనే రానుందని రిపోర్ట్ చేసింది. అయితే వాటా కొనుగోలు రేసులో ఆర్ఐఎల్, ఎయిర్టెల్ ఉన్నాయన్న వార్తలపై ఎయిర్టెల్ స్పందించింది. ఈ ఊహాగానాలను ఎయిర్టెల్ ప్రతినిధి తిరస్కరించారు. జీలో వాటాల కొనుగోలు రేసులో ఎయిర్టెల్ లేదంటూ ఒక ప్రకటన జారీ చేశారు. కాగా ఎస్సెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర కార్యకలాపాలలో పెట్టుబడుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర కొంతమేర వాటాను విక్రయించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన విషయం సంగతి తెలిసిందే. -
ఆడిషన్స్‌లో ‘సూపర్ మామ్స్ సీజన్ 2’
గత ఏడాది ప్రసారమైన ‘డాన్స్ ఇండియా డాన్స్ (డి.ఐ.డి)-సూపర్ మామ్స్’కి కొనసాగింపుగా జీ టీవీలో సీజన్ 2 ఆరంభం కానుంది. డాన్స్ పట్ల ఆసక్తి ఉండి, దాన్ని ప్రదర్శించుకోవడానికి సరైన వేదిక దొరకని ప్రతి తల్లీ ఈ షోను సద్వినియోగం చేసుకోవచ్చని జీ టీవీ ప్రతినిధి తెలిపారు. ఈ షోలో పాల్గొనాలనుకున్న వాళ్లు ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మొత్తం 16 నగరాల్లో ఆడిషన్స్ చేస్తున్నారు. నవంబర్ 2న హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో గల నందినీ హైస్కూల్లో ఆడిషన్స్ జరుగుతాయనీ, 18 ఏళ్లు, అంతకన్నా పైబడిన వారు ఆడిషన్స్‌కు రావచ్చని తెలిపారు. -
అల్లుడా మజాకా!
కొన్ని కథలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తాయి. కానీ వాటిని ప్రెజెంట్ చేసే విధానం వల్ల బాగానే అలరిస్తుంటాయి. జీ టీవీలో ప్రసారమయ్యే ‘జమాయీ రాజా’ కూడా అంతే! ఏఎన్నార్ దగ్గర్నుంచి అల్లరి నరేష్ వరకూ ఎంతోమంది హీరోలు చేసిన సినిమాల్లోని సన్నివేశాలను మిక్స్ చేసినట్టుగా ఉంటుందీ సీరియల్. ఓ కోటీశ్వరుడైన అబ్బాయి... ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె పేదదేమీ కాదు. కానీ తాను పెరిగిన పరిస్థితుల వల్ల ఆమెకి డబ్బున్నవాళ్లంటే ఇష్టముండదు. దాంతో పేదవాడిగా నాటకమాడి ఆమె మనసును గెల్చుకుంటాడు హీరో. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఆమె తల్లి అడ్డు పడుతుంది. పేదవాడు తనకు అల్లుడు కావడానికి వీల్లేదంటుంది. ఆమెను ఎదిరించి హీరోని పెళ్లాడుతుంది కూతురు. అప్పట్నుంచీ తన కూతురి జీవితంలోంచి అతడిని ఎలా దూరం చేయాలా అని ప్లాన్లు వేస్తుంటుంది అత్తగారు. వాటిని ఆ అల్లుడు ఎలా తిప్పికొడతాడు అనేదే కథ! సీరియల్‌కి పెద్ద సమస్య కథే. కాకపోతే కథనం బాగుండటం, అల్లుడిగా రవి దూబే అదరగొట్టేయడం కలసి వచ్చింది. ఒక రకంగా అతడి ఇమేజ్, టాలెంట్, ఎనర్జీలే ‘జమాయీ రాజా’ని హిట్ సీరియళ్ల లిస్టులో చేర్చాయని చెప్పవచ్చు! -
ఒక్కచోట ఇద్దరు... ఒకలా మాత్రం ఉండరు!
ఇద్దరమ్మాయిలు. ఒకరు మహా ఫాస్టు. ఇంకొకరు మరీ మృదువు. ఒకామె పులిపిల్లలా విరుచుకుపడుతుంది. ఇంకొకామె కుక్కపిల్లను చూసినా భయంతో పరుగు పెడుతుంది. ఒకామె జలపాతంలా హుషారుగా ఉంటుంది. ఇంకొకామె మలయ పవనంలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి విభిన్నమైన మనస్తత్వాలు కల రచన, గుంజన్ అనే ఇద్దరమ్మాయిలను ఒక్కచోట చేర్చి తీసిందే ‘సప్నే సుహానే లడక్పన్ కే’. జీ టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్‌ని అద్భుతమైన సీరియల్ అనడానికి లేదు. అలాగని చెత్తా అనలేం. పాత్రల చిత్రణ బాగుంటుంది. కథ మాత్రం కాస్త కాస్త విసిగిస్తూ ఉంటుంది. అయినా రెండేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతుండటం విశేషమే! -
ఈ బంధం ఇక సడలదా?!
అసలు కథను పక్కకు నెట్టేసి, కొసరు కథలతో సీరియళ్లను సాగదీయడం టీవీ వాళ్లకు బాగా అలవాటైన పనే. కానీ ఆ సాగతీత మరీ అర్థం పర్థం లేకుండా ఉంటే మాత్ర ప్రేక్షకుల బుర్రలు వాచిపోవడం ఖాయం. జీ టీవీలో ప్రసారమయ్యే ‘పవిత్రరిష్తా’తో ఇప్పుడు అదే సమస్య వచ్చింది. మొన్న ఆగస్టు 22కు 1,378 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్లో కథేంటి అని ఆలోచిస్తే... జుట్టు పీక్కున్నా గుర్తుకు రాదు. ఎందుకంటే అసలు కథను అందరూ ఎప్పుడో మర్చిపోయారు. మానవ్, అర్చన అనే రెండు పాత్రలు, వారి కుటుంబాల చుట్టూ తిరగుతూ మొదలైన కథ... ఇప్పుడు చాలామంది చుట్టూ తిరుగుతోంది. రకరకాల పాత్రలు రంగ ప్రవేశం చేశాయి. చెప్పలేనని మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట మానవ్‌గా నటించిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సినిమాల్లోకి వెళ్లిపోయాడు. అతడి స్థానంలో హితేన్ తేజ్వానీ ఎంటరయ్యాడు. కానీ హీరోయిన్ ఇప్పటికీ అంకితా లోఖండేనే. ఆమెతో పాటు హితేష్ కూడా పేరున్నవాడు కావడంతో సీరియల్‌కి ఇంకా కాస్త ఆదరణ ఉంది. లేదంటే ఆ జీడిపాకాన్ని భరించడం అంత సులభం కాదు. పవిత్రబంధం అంటూ ఇలా రకరకాల బంధాలను అలా కలుపుకుంటూ పోతుంటే... ప్రేక్షకులకు పిచ్చెక్కిపోవడం ఖాయం! వాస్తవాలకు దర్పణం సీరియళ్లు చూస్తే నిజ జీవితాలకు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ నిజంగా నిజాలను చెప్పే సీరియళ్లు వేళ్లమీద లెక్కపెట్టేటన్నే ఉంటాయి. కుటుంబ సమస్యలు, పాత్రలు పడే ఇబ్బందుల్ని చూపించడమే తప్ప... సమాజం, అందులోని సమస్యలు, వాటికి పరిష్కారాలు వంటి వాటిని చర్చించే సీరియళ్లు ఎప్పుడోగానీ రావు. చాలా కాలం తర్వాత ‘బాలికావధు’ ఒకటి వచ్చింది. ఆ సీరియల్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది. ఇప్పుడు అదే కోవలో ‘ఉడాన్’ (కలర్స) ప్రారంభమయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని వెనుకబడిన గ్రామాల్లో పాతుకునిపోయి ఉన్న బాల కార్మిక వ్యవస్థ చుట్టూ తిరిగే కథ ‘ఉడాన్’. కోట్లకు పడగలెత్తిన ఓ జమీందారు ఊరిని గుప్పెట్లో పెట్టుకుంటాడు. ధన సహాయం చేస్తున్నట్టు, జీవనోపాధి కల్పిస్తున్నట్టు నటిస్తూ... అందరినీ తమ కాళ్ల దగ్గర పడివుండేలా చేసుకుంటాడు. అలాంటి ఊళ్లో జన్మిస్తుంది ‘చకోర్’. ఆమె కడుపులో ఉన్నప్పుడు డబ్బు అవసరమై జమిందారు దగ్గరకు వెళ్తే, బిడ్డను తాకట్టు పెట్టించుకుని డబ్బు ఇస్తాడు. ఏడేళ్లు వచ్చేవరకూ పెంచి, తర్వాత బిడ్డను తమకు అప్పగించమని కండిషన్ పెడుతుంది జమీందారు భార్య. కూతుర్ని తాకట్టు పెట్టామన్న బాధ, ఏడేళ్ల తర్వాత ఆమె తమకు దూరమైపోతుందే అన్న ఆవేదనతో చకోర్ తల్లిదండ్రులు కుమిలిపోతుంటారు. ఇవేమీ తెలియని చకోర్ సంతోషంగా కాలం గడుపుతూ ఉంటుంది. చిలిపి చేష్టలతో, అల్లరి వేషాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. మరి ఏడేళ్లు వచ్చాక చకోర్ జీవితం ఏమవుతుంది? ఎదిగేకొద్దీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అన్న ఉత్కంఠతో సాగుతోంది ‘ఉడాన్’. చిన్నారి చకోర్గా స్పందన్ చతుర్వేద్ నటన అద్భుతం. ఇప్పటికే మధుబాల, సంస్కార్ లాంటి సీరియళ్లకు తన టాలెంట్‌తో అందాన్ని తెచ్చిన స్పందన్... చకోర్ పాత్రను రక్తి కట్టిస్తోంది. గతంలో ఉడాన్ పేరుతో దూరదర్శన్‌లో ఓ సీరియల్ ప్రసారమైంది. మన దేశంలో మొట్టమొదటి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య జీవితం ఆధారంగా, ఆవిడ చెల్లెలు కవితా చౌదరి తీసిన ఆ సీరియల్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. మరి ఈ ‘ఉడాన్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! -
నటించమంటే జీవించింది!
పని అందరూ చేస్తారు కానీ జ్యోతి సురభిలా చేయడం కష్టమంటారు ఆమె గురించి తెలిసినవాళ్లు. జీటీవీలో ప్రసారమవుతోన్న ‘కుబూల్ హై’ సీరియల్లో లీడ్ రోల్ చేస్తోన్న జ్యోతి... ఈ మధ్య తన టీమ్‌కి పెద్ద షాకిచ్చిందామె. ‘కుబూల్ హై’ షూటింగ్ జరుగుతోంది. పగిలిన సీసాతో జ్యోతి తన చేతి నరాన్ని కోసుకునే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆమె రెండుమూడుసార్లు సీన్ చేసినా దర్శకుడు తృప్తిపడలేదు. ఇంకాస్త సహజంగా చేయమని కోరాడు. దాంతో జ్యోతి సన్నివేశంలో పూర్తిగా లీనమైపోయింది. తన చేతిని నిజంగానే కోసేసుకుంది. చర్మం చీరుకుపోయి, రక్తం కారిపోతుంటే సెట్లోని వారంతా అవాక్కైపోయారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదృష్టంకొద్దీ గాయం లోతుగా అవ్వలేదు. ఎందుకిలా చేశావ్ జ్యోతీ అని అడిగితే... ‘నటన ఎప్పుడూ అసహజంగానే అనిపిస్తుంది, సహజత్వం రావాలంటే కాస్త జీవించాలి కదా’ అంది నవ్వేస్తూ. ఆమె కమిట్మెంట్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదట ఆ దర్శకుడికి. మరీ ఇంతగా జీవించాల్సిన అవసరం లేదులేమ్మా అన్నాడట ఎలా స్పందించాలో తెలీక! -
జీటీవీపై ధోనీ కోట్ల పరువునష్టం దావా
-
ధోనీ పరువునష్టం దావా:జీటీవీపై మద్రాస్ హైకోర్టు నిషేధాజ్ఞలు
చెన్నై: ఐపిఎల్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రమేయానికి సంబంధించి ఎటువంటి వార్తలను జీటీవీ ప్రసారం చేయకూడదని మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. దాంతో ధోనీకి కొంత ఊరట లభించింది. తనపై అసత్యప్రచారం చేశారని ధోని మద్రాస్ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. 2013 ఐపిఎల్ టోర్నమెంట్ సందర్భంగా చోటు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో పలువురు టాప్ క్రికెటర్లు భాగస్వాములుగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలోని వాస్తవాలను వెలికితీయడానికి సుప్రీంకోర్టు జస్టిస్ ముద్గల్ కమిటీని నియమించింది. ఆ టోర్నమెంట్లో మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ఉన్నాడు.