RRR Movie Team Celebrates New Year Celebration in Mumbai - Sakshi
Sakshi News home page

RRR Movie: మామూలు ప్రమోషన్స్‌ కాదు.. ముంబైలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ కొత్త ఏడాది వేడుకలు

Published Fri, Dec 31 2021 1:43 PM | Last Updated on Fri, Dec 31 2021 2:23 PM

RRR Movie Team Celebrates New Year Celebration in Mumbai - Sakshi

Roar Of RRR In Mumbai:  రౌధ్రం.. రణం.. రుధిరం..(ఆర్‌ఆర్‌ఆర్‌).. నార్త్‌ టు సౌత్‌.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగుతోంది. ఎంతైనా పాన్‌ ఇండియా సినిమా కదా! అందుకే ఆ రేంజ్‌కు తగ్గట్లే ప్రమోషన్లు చేస్తోంది చిత్రయూనిట్‌. ఇన్నాళ్లు సినిమా అద్భుతంగా రావడం కోసం కష్టపడితే ఇప్పుడది ప్రేక్షకుల నోళ్లలో నానేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను చెరిపేసేందుకు కొత్త సంవత్సరంలో జనవరి 7న బాక్సాఫీస్‌ బరిలోకి దూకుతున్నారు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. 

సినిమాకు ఎంత ఖర్చు పెట్టారో కానీ.. దాని ప్రమోషన్స్‌కు సైతం అదే రేంజ్‌లో ఖర్చు పెడుతున్నారు. ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలతో నానా హంగామా చేస్తున్నా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ తాజాగా ముంబైలో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహించిన ఈవెంట్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆలియా భట్‌, రాజమౌళి హాజరయ్యారు. మరి ఆర్‌ఆర్‌ఆర్‌ సందడితో కొత్త సంవత్సరాన్ని షురూ చేయాలంటే జీ టీవీలో ప్రసారమయ్యే రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ ఇన్‌ ముంబై పేరిట ప్రసారం కానున్న స్పెషల్‌ ఎపిసోడ్‌ను వీక్షించాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement