రాయలసీమ వాసులకు గుడ్‌న్యూస్‌.. విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్! | vijay devarakonda latest Movie VD14 Auditions In rayalaseema | Sakshi
Sakshi News home page

vijay devarakonda: 'ఈ తూరి అంతా మన సీమలోనే'.. బెరీనా పోయి కలవండి!

Jun 25 2024 3:27 PM | Updated on Jun 25 2024 3:29 PM

vijay devarakonda latest Movie VD14 Auditions In rayalaseema

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను అలరించాడు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో  వీడీ14 వర్కింగ్ టైటిల్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీని ప్రధానంగా రాయలసీమలో జరిగిన పీరియాడిక్ కథగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ మూవీ కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినవారికే ప్రత్యేకంగా ఆడిషన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. 'ఈ తూరి అంతా మన సీమలోనే..బెరీనా పోయి మావోల్లను కల్వండి' అంటూ సీమ యాసలో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.  జూలై 1,2 తేదీల్లో కర్నూలు, 3,4 తేదీల్లో కడప, 5,6 తేదీల్లో తిరుపతి, 7,8 తేదీల్లో అనంతపురంలో కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడేవారిని ఆడిషన్స్‌ ద్వారా సినిమా ఛాన్సులు ఇవ్వనున్నారు. మరి ఇక ఆలస్యమెందుకు? సీమ యాసలో మెప్పించి సినిమా ఛాన్స్‌ కొట్టేయండి. 

vd

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement