
Mouni Roy Return To Small Screen After 5 Years As A Judge: బాలీవుడ్ బుల్లితెర హాట్ బ్యూటీ మౌని రాయ్ హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తన గ్రామరస్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హిందీ సీరియల్స్‌లో నటించిన తర్వాత ఆమెకు వరుసగా బీటౌన్ మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన గోల్డ్, రాజ్ కుమార్ రావుకు జంటగా మేడ్ ఇన్ చైనాతో పాటు పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్న మౌని.. సుమారు ఐదేళ్ల తర్వతా మళ్లీ బుల్లితెరపైన సందడి చేయనుంది. ఆమె తొలిసారిగా నటనను ప్రారంభించిన వేదికపైకి మళ్లీ వెళ్లనుంది.
మంచి గుర్తింపు తెచ్చుకున్న హిందీ షోలలో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' ఒకటి. ఈ షో ఐదో సీజన్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది మౌని రాయ్. ఈ విషయం గురించి మౌని మాట్లాడుతూ 'నాకు డ్యాన్స్ అంటే ఒక ఎక్స్‌ప్రెషన్. వివిధ కళారూపాల సమ్మేళనం. 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోకు న్యాయనిర్ణేతగా భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదికపై చిన్న పిల్లల ప్రతిభను చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను.' అని తెలిపింది. 'క్యూంకీ సాస్ బీ కబీ బహు థీ', 'దేవోన్ కీ దేవ్.. మహాదేవ్' సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మౌని రాయ్ 'నాగిన్'తో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకుంది.
ఇదీ చదవండి: తెల్లటి పొట్టి గౌనులో 'నాగిని'.. అదిరిందిగా మౌని
Comments
Please login to add a commentAdd a comment