క్రీస్తు చరిత్ర | Lokarakshakudu movie logo released | Sakshi
Sakshi News home page

క్రీస్తు చరిత్ర

Published Sun, Apr 16 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

క్రీస్తు చరిత్ర

క్రీస్తు చరిత్ర

చండ్ర పార్వతమ్మ సమర్పణలో చండ్రస్‌ ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై చంద్రశేఖర్‌ చండ్ర నిర్మిస్తున్న చిత్రం ‘లోకరక్షకుడు’. బ్రహ్మం సి.హెచ్‌. దర్శకత్వం వహిస్తున్నారు. గత నెల 29న లండన్‌ పార్లమెంట్‌లో చిత్రం లోగో విడుదల చేశారు.

నేడు ఈస్టర్‌ పండగ సందర్భంగా చంద్రశేఖర్‌ చండ్ర మాట్లాడుతూ– ‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రలోని కొత్త అంశాలతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాం.ఇంగ్లాండ్‌లో రెండో షూటింగ్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేశాం. ఈ ఏడాది క్రిస్మస్‌కు చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని అన్నారు. ‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ఇదో మంచి సినిమా అవుతుంది. ఎక్కడ రాజీ అన్నదే లేకుండా చిత్రాన్ని నిర్మిచేందుకు నిర్మాతలు సహాయం చేస్తున్నారు’’ అని చిత్రదర్శకుడు బ్రహ్మం సి.హెచ్‌ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: నందమూరి హరి, సంగీతం: ఎ.కె రిసాల్‌ సాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement