Lokarakshakudu
-
లోకరక్షకుడు
ఏసుక్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా బ్రహ్మం సి. హెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లోకరక్షకుడు’. చండ్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాటలను రికార్డ్ చేస్తున్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘కొత్త అంశాలతో ఏసుక్రీస్తు జీవిత చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఏకే రిసాల్ సాయి మంచి ట్యూన్స్ కంపోజ్ చేశారు. సింగర్ మధుబాల కృష్ణన్, గీతామాధురి, హేమాంబిక చక్కగా పాడారు. అభినవ్ శ్రీనివాస్ రాసిన పాట ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ను ఫారిన్ ఆర్టిస్టులతో కర్ణాటకలో జరుపుతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: క్రిష్. -
క్రీస్తు చరిత్ర
చండ్ర పార్వతమ్మ సమర్పణలో చండ్రస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్న చిత్రం ‘లోకరక్షకుడు’. బ్రహ్మం సి.హెచ్. దర్శకత్వం వహిస్తున్నారు. గత నెల 29న లండన్ పార్లమెంట్లో చిత్రం లోగో విడుదల చేశారు. నేడు ఈస్టర్ పండగ సందర్భంగా చంద్రశేఖర్ చండ్ర మాట్లాడుతూ– ‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రలోని కొత్త అంశాలతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాం.ఇంగ్లాండ్‌లో రెండో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. ఈ ఏడాది క్రిస్మస్కు చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని అన్నారు. ‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ఇదో మంచి సినిమా అవుతుంది. ఎక్కడ రాజీ అన్నదే లేకుండా చిత్రాన్ని నిర్మిచేందుకు నిర్మాతలు సహాయం చేస్తున్నారు’’ అని చిత్రదర్శకుడు బ్రహ్మం సి.హెచ్ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: ఎ.కె రిసాల్ సాయి.