chilakala guda
-
కనుమరుగవుతున్న సికింద్రాబాద్ రైల్వే కాలనీలు.. అప్రోచ్ రోడ్లు మూసివేత
రైల్వే కాలనీలు, సాధారణ ప్రజల సమ్మేళనంగా దశాబ్దాల కాలంగా సికింద్రాబాద్ నగరం వర్ధిల్లింది. రైల్వే కాలనీలు, కార్యాలయాలు, స్టేషన్ల సమాహారంగా ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంది. ఇదిలా ఉండగా రైల్వే కాలనీలు, స్థలాల మీదుగా సాధారణ ప్రజలు రాకపోకలకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉండేవి. క్రమేణా పరిస్థితులు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల తొలగింపుతో రైల్వే కాలనీలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ ప్రాంతాల మీదుగా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న రైల్వే అప్రోచ్ రోడ్లు కనుమరుగు అవుతున్నాయి. కొంతకాలం క్రితం హమాలిబస్తీ, మెట్టుగూడ ప్రాంతాల్లో రోడ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరిన్ని రోడ్లను మూసి వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. దశాబ్దాల కాలంగా...సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం రైల్వే స్థలాలు దశాబ్దాల కాలంగా ఆవరించి ఉన్నాయి. మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్ల పరిధిలో రైల్వేశాఖకు చెందిన కాలనీలు నెలకొని ఉన్నాయి. ఆవిర్భావ కాలం నుంచి రైల్వే రోడ్ల మీదుగా పరిసర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది మంది సాధారణ ప్రజలు పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లడం కోసం రైల్వే రహదారులను వినియోగించుకుంటున్నారు.శిథిలావస్థకు చేరడంతో.... దశాబ్దాల క్రితం నిర్మించిన రైల్వే క్వార్టర్లు క్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. శిథిలావస్థకు చేరుతున్న క్వార్టర్లను రైల్వే అధికారులు నేలమట్టం చేస్తూ వస్తున్నారు. ఖాళీ ప్రదేశాలుగా మారుతున్న సదరు స్థలాల చుట్టూ అధికారులు ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. పనిలో పనిగా ఆయా కాలనీల్లోంచి లోగడ కొనసాగిన అప్రోచ్ రోడ్లను కూడా మూసివేస్తున్నారు. మైదానాలుగా మారుతున్న రైల్వే క్వార్టర్లు, కాలనీల స్థలాల్లో కొన్నింటిని రైల్వే అధికారులు పరిరక్షిస్తున్నారు. ఇంకొన్ని స్థలాలను ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేశారు. రహదారుల మూసివేతలు పూర్వకాలం నుంచి రైల్వే అప్రోచ్ రోడ్లను వినియోగించుకున్న లష్కర్ ప్రజలకు తాజాగా ప్రవేశాల మూసివేత వ్యవహారం గుదిబండగా మారుతుంది. ఈ వ్యవహారాల్లో భాగంగా హమాలిబస్తీ – చిలకలగూడ కూడలి, విజయపురికాలనీ–రైల్వే ఆసుపత్రి, లాలాగూడ–మారేడుపల్లి అప్రోచ్ రోడ్లను ఇప్పటికే మూసివేశారు. లీజుదారులు రైల్వే స్థలాల్లో నిర్మాణం పనులు ప్రారంభిస్తే మరిన్ని రహదారులు మూతడబడే అవకాశాలు ఉన్నాయి.ఇబ్బంది పడుతున్న ప్రజలు రైల్వే అధికారులు ఎడాపెడా రోడ్లు మూసివేస్తుండడంతో పరిసర ప్రాంతాల వెళ్లి రావడం కోసం తీవ్ర ఇబ్బందులపాలవుతున్నాంమని స్థానికులు వాపోతున్నారు. సమీపంలోని ఆసుపత్రి, పాఠశాల, బస్‌స్టాప్‌లకు వెళ్లడానికి కోసం కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా సరైన సమయంలో వచ్చే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించి అప్రోచ్ రోడ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలి.చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులుఅనుమతిస్తే డంపింగ్యార్డులుగా మారుతున్నాయి : అధికారులు రైల్వే స్థలాల మీదుగా ప్రయాణాలకు అనుమతిస్తే వాటిని చెత్త డంపింగ్ కేంద్రాలుగా మార్చుతున్నారు. అల్లరిమూకలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు వ్యర్థ పదార్థాలు డంప్ చేస్తున్నారు. రైల్వే స్థలాల పరిసర ప్రాంతాల ప్రజలకు రక్షణ, ఆరోగ్యకర వాతావరణం కోసం మాత్రమే అప్రోచ్ రోడ్లను మూసివేసి, రైల్వే స్థలాల్లోకి ప్రవేశాలను కట్టడి చేస్తున్నామని రైల్వే డివిజనల్ అధికారులు చెబుతున్నారు. -
మారణాయుధాలతో తిరుగుతున్న ఇద్దరికి జైలు
సాక్షి, చిలకలగూడ: మారణాయుధాలతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధించిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్, డీఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ మెట్రోస్టేషన్ ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న జంజర్ల ప్రేమ్, లోయర్‌ట్యాంక్‌బండ్ గోశాల ప్రాంతానికి చెందిన కైత నాగరాజు చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ బ్యాటిల్స్ ఏరుకుని జీవనం సాగించేవారు. ఈనెల 21న రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని గస్తీ పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అదుపులోకి తీసుకుని సోదా చేయగా వారి వద్ద కత్తి, చాకు లభించాయి. ఈ పెట్టీ కేసులు నమోదు చేసి గురువారం సికింద్రాబాద్ 15వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. (చదవండి: దారి కాచి...దాడి చేసి) -
అత్తా కోడళ్ల పంచాయితీ: ఇంట్లోకి రానివ్వకపోవడంతో..
సాక్షి, చిలకలగూడ: ఇంట్లోకి తమను రానివ్వాలంటూ ఓవ్యక్తి కుంటుంబంతో కలిసి తన తల్లి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన కింజర్ల సాయికుమార్ యాదవ్, భార్గవిలకు 2009లో వివాహం అయింది. ప్రస్తుతం వీరికి నలుగురు పిల్లలున్నారు. కట్నం డబ్బులతో ఇంటి భవనం మొదటి అంతస్తుపై సాయికుమార్‌యాదవ్ ఓ గదిని నిర్మించుకుని అందులో ఉంటున్నారు. సాయికుమార్ తల్లి భారతమ్మ, భార్య భార్గవి మధ్య గొడవ మొదలైంది. కోడలు తనపై దాడి చేసిందని గతంలోనే భారతమ్మ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి సాయికుమార్, భార్గవి కుటుంబం వేరే అద్దె ఇంట్లో ఉంటున్నారు. సాయికుమార్‌యాదవ్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గతేడాది లాక్డౌన్ వల్ల ఆటోకు సరైన గిరాకీ లేక ఇంటి అద్దె, కుటుంబ పోషణ భారమైంది. దీంతో శనివారం సాయంత్రం సాయికుమార్‌యాదవ్ భార్యా పిల్లలతో కలిసి తల్లి భారతమ్మ ఇంటికి వచ్చారు. తాను ఇంటిపైన నిర్మించుకున్న గదిని తమకు ఇవ్వాలని తల్లిని కోరాడు. దీనికి భారతమ్మ నిరాకరించింది. దీంతో శనివారం రాత్రి నుంచి ఇంటి ముందు సాయికుమార్ కుటుంబంతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. తమను ఇంట్లోకి రానివ్వకపోతే భార్య, పిల్లలతో కలిసి అత్మహత్య చేసుకుంటానని సాయికుమార్‌యాదవ్ తెలిపాడు.. ఆదివారం సాయికుమార్ కుటుంబానికి శ్రీనివాసనగర్ కాలనీవాసులు వేములవాడ మహాత్మాచారి, భరత్, బీజేపీ నాయకులు మేకల హర్షకిరణ్, ముషీరాబాద్ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అమరేందర్ యాదవ్, మధుయాదవ్ అండగా నిలిచారు. చదవండి:మానవత్వం మిస్సింగ్.. అంతిమ సంస్కారానికి అంత్యక్రియలు! -
క్లినిక్ పేరుతో అసభ్య ప్రవర్తన..!
సాక్షి, హైదరాబాద్ : ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ డాక్టర్ కటకటాల పాలయ్యాడు. సికింద్రాబాద్‌లో గత పదేళ్లుగా హోమియోపతి క్లినిక్ నడిపిస్తున్న చంద్రమోహన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు డాక్టర్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
సిగరెట్ అడిగితే లేదన్నాడని..
సాక్షి, హైదరాబాద్: సిగరెట్ అడిగితే లేదని చెప్పినందుకు గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఇనుపరాడ్‌తో దాడిచేసిన సంఘటన నగరంలోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిలకలగూడ హమాలీబస్తీకి చెందిన షేక్ హజీ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఈనెల 3న రాత్రి స్థానిక క్రాస్‌రోడ్డు వద్ద ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి సిగరెట్ అడిగారు. అతను లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవ పడ్డారు. అదే రోజు రాత్రి షేక్హజీ తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతుండగా పద్మారావునగర్ లక్ష్మీ అపార్ట్మెంట్ వద్ద కాపుకాసిన సదరు వ్యక్తులు అతనిపై ఇనుపరాడ్‌తో దాడి చేయడంతో షేక్హజీకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
-
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
సికింద్రాబాద్: ఫేస్బుక్లో నగ్న చిత్రాలు పెడతానంటూ ఓ యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థిని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. సీతాఫల్మండిలో నివశిస్తున్న ఆకాష్ రెడ్డికి,అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఐదేళ్లక్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. నిత్యం వీరు చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానంటూ ఆకాష్‌రెడ్డి సదరు యువతిని బెదిరించి 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.