సాక్షి, హైదరాబాద్: సిగరెట్ అడిగితే లేదని చెప్పినందుకు గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఇనుపరాడ్‌తో దాడిచేసిన సంఘటన నగరంలోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిలకలగూడ హమాలీబస్తీకి చెందిన షేక్ హజీ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఈనెల 3న రాత్రి స్థానిక క్రాస్‌రోడ్డు వద్ద ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి సిగరెట్ అడిగారు.
అతను లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవ పడ్డారు. అదే రోజు రాత్రి షేక్‌హజీ తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతుండగా పద్మారావునగర్ లక్ష్మీ అపార్ట్‌మెంట్ వద్ద కాపుకాసిన సదరు వ్యక్తులు అతనిపై ఇనుపరాడ్‌తో దాడి చేయడంతో షేక్‌హజీకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment