తాడ్వాయి (నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపాడు గ్రామ శివారులో ఆటో డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు కత్తితో దాడి చేశాడు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఎర్రపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చిన్న గంగాధరగౌడ్(45)కు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆటో కామారెడ్డి వైపు నుంచి లింగంపేట వైపు వెళుతుండగా ఎర్రపాడు గ్రామ సమీపంలోకి రాగానే మద్యం మత్తులో ఉన్న గుర్తు తెలియని ప్రయాణికుడు కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. గాయపడిన గంగాధరగౌడ్‌ను స్థానికులు తాడ్వాయి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.