మహానగరం ముంబైలో నిత్యం రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌ఎంటీ)ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 2008, నవంబరు 26న దాడులు జరిపారు. ఈ దాడుల్లో 50 మంది రైల్వే స్టేషన్‌లోనే మృతి చెందారు. ఈ ఘటన అనంతరం రైల్వేశాఖ స్టేషన్లలో భద్రతకు పలు చర్యలు చేపట్టింది.
ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, రౌండ్ ది క్లాక్ భద్రతను కల్పించారు. సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలోని 80 సున్నితమైన ప్రదేశాలలో 3,459 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాల్లోని రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది ఫుటేజీని పర్యవేక్షిస్తారు. పశ్చిమ రైల్వే లైన్‌లోని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ కింద 31 స్టేషన్లలో 2,770 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
వీడియో సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా 62 స్టేషన్లకు మరో 1,039 సీసీ కెమెరాలు మంజూరయ్యాయని, నిర్దిష్ట స్టేషన్లలో ఇప్పటికే 160 కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వాకీ-టాకీలు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్లు, బారికేడ్‌లు వంటి అవసరమైన భద్రతా పరికరాలను కొనుగోలు చేశామని, వీటిని ప్రయాణికుల భద్రత కోసం ఉపయోగిస్తున్నామని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది?
Comments
Please login to add a commentAdd a comment