ముంబై: ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా రతన్ టాటా అక్టోబర్ 9న కన్నుమూశారు. మంచి వ్యక్తిగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న రతన్ టాటా విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి అంశాలలో దేశానికి పలు సేవలు అందించారు. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడిలో, ఉగ్రవాదులు హోటల్ తాజ్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటనపై రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
2008లో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్రం మీదుగా దక్షిణ ముంబైలోకి ప్రవేశించి, తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌తో సహా నగరంలోని పలు ప్రదేశాలలో దాడులకు పాల్పడి, భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ 26/11 దాడుల సమయంలో ఎవరో తనకు ఫోన్ చేసి, హోటల్ లోపల కాల్పులు జరుగుతున్నాయని చెప్పారని, దీంతో తాను వెంటనే తాజ్ హోటల్ సిబ్బందికి ఫోన్ చేశానని, అయితే తన కాల్ ఎవరూ స్వీకరించలేదని అన్నారు.
ఆ తర్వాత తాను కారులో తాజ్ హోటల్‌కు వెళ్లానని, అయితే లోపల కాల్పులు జరుగుతున్నందున తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నానని రతన్ టాటా తెలిపారు. ఆ సమయంలో తాను ‘ఒక్క ఉగ్రవాదిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టకూడదని, అవసరమైతే తాజ్ ఆస్తులను పేల్చివేయండి’ అని భద్రతా సిబ్బందికి చెప్పానని రతన్ టాటా పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు ముంబైలో 26/11 దాడికి పాల్పడ్డారు. ఇందులో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా జనం గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: టాటా వెన్నంటే ఉన్న ఈ కుర్రాడి గురించి తెలుసా..?
Comments
Please login to add a commentAdd a comment