సూరత్: రతన్ టాటా తన 86వ ఏట ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మన దేశానికి అమూల్యమైన రత్నం మాదిరిగా నిలిచిన రతన్ టాటాకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యాపారి వజ్రాలతో రతన్ టాటాకు నివాళులు అర్పించారు.
ఉన్నత వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటాను దేశంలోని ఏ ఒక్కరూ మరచిపోలేరు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి విపుల్‌భాయ్ 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం రూపకల్పనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వతహాగా కళాకారుడైన విపుల్.. రతన్ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ వినియోగించారు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో పలువురు షేర్ చేస్తున్నారు.
सूरत में एक व्यापारी ने 11000 अमेरिकन डायमंड की मदद से बनाया रतन टाटा जी का डायमंड पोट्रेट💎 pic.twitter.com/2Q8QMJJfwy
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 12, 2024
ఇది కూడా చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్
Comments
Please login to add a commentAdd a comment