రతన్‌ టాటాకు కన్నీటి వీడ్కోలు | Ratan Tata final journey and funeral updates | Sakshi
Sakshi News home page

రతన్‌ టాటాకు కన్నీటి వీడ్కోలు

Published Thu, Oct 10 2024 2:40 PM | Last Updated on Fri, Oct 11 2024 6:47 AM

Ratan Tata final journey and funeral updates

Updates

  • ముగిసిన రతన్‌ టాటా అంత్యక్రియలు

  • వర్లి శ్మశానవాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు

  • రతన్‌ టాటాకు పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు తుపాకీలు పేల్చి గౌరవ వందనం సమర్పించారు.

     

  • ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర నేతలు నివాళులర్పించారు.

     

  • రతన్‌ టాటా పార్థీవదేహానికి  పోలీసుల గౌరవ వందనం
  • వర్లి శ్మశానవాటికకు చేరుకున్న రతన్‌ టాటా పార్థివదేహం

 

  • కేంద్రం తరఫున కేంద్ర మంత్రి అమిత్‌ షా  రతన్‌ టాటా అంత్యక్రియలకు హాజరయ్యారు.
  • ఎన్‌సీపీఏ గ్రౌండ్‌ నుంచి ప్రారంభమైన  రతన్‌ టాటా అంతిమ యాత్ర కొనసాగుతోంది. 
     
  • ఎన్‌సీపీఏ గ్రౌండ్‌ నుంచి రతన్‌  టాటా అంతిమయాత్ర ప్రారంభమైంది.
  • కాసేపట్లో వర్లి శ్మశానవాటికలో రతన్‌ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి.
  • అధికారిక లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు  జరుగుతాయి.
     
  • రతన్‌ టాటా అంతిమ యాత్ర ప్రారంభం అయింది.

  • ఎ‍న్‌సీపీఏ  గ్రౌండ్‌ రతన్‌ టాటా పార్థివదేహానికి రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖలు నివాళులు ఆర్పించారు.

  • ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ నావల్‌ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో రతన్‌టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మృతిని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు.

  • టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రా­జ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన వయసు 86 ఏళ్లు.

  • LIVE: కాసేపట్లో రతన్‌ టాటా అంతిమయాత్ర

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement