final journey
-
రతన్‌టాటాకు పార్థివదేహానికి ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు
Updatesముగిసిన రతన్ టాటా అంత్యక్రియలువర్లి శ్మశానవాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలురతన్ టాటాకు పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు తుపాకీలు పేల్చి గౌరవ వందనం సమర్పించారు.#WATCH | Last rites of veteran industrialist Ratan Tata, being performed with state honour at Worli crematorium in Mumbai pic.twitter.com/08G7gnahyS— ANI (@ANI) October 10, 2024 ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర నేతలు నివాళులర్పించారు.#WATCH | Union Home Minister Amit Shah, Maharashtra CM Eknath Shinde, Gujarat CM Bhupendra Patel, Maharashtra Deputy CM Devendra Fadnavis and other leaders pay tribute to veteran industrialist Ratan Tata, at Worli crematorium in Mumbai. pic.twitter.com/GRzHMn2B7E— ANI (@ANI) October 10, 2024 రతన్ టాటా పార్థీవదేహానికి పోలీసుల గౌరవ వందనంవర్లి శ్మశానవాటికకు చేరుకున్న రతన్ టాటా పార్థివదేహం#WATCH | Mumbai, Maharashtra: Mortal remains of veteran industrialist Ratan Tata brought to Worli crematorium for his last rites, which will be carried out with full state honour. pic.twitter.com/8lB2F2AmFH— ANI (@ANI) October 10, 2024 కేంద్రం తరఫున కేంద్ర మంత్రి అమిత్ షా రతన్ టాటా అంత్యక్రియలకు హాజరయ్యారు.ఎన్సీపీఏ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన రతన్ టాటా అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఎన్సీపీఏ గ్రౌండ్ నుంచి రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభమైంది.కాసేపట్లో వర్లి శ్మశానవాటికలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి.అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు జరుగుతాయి. రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభం అయింది.ఎన్సీపీఏ గ్రౌండ్ రతన్ టాటా పార్థివదేహానికి రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖలు నివాళులు ఆర్పించారు.ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో రతన్‌టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి.. పేదవాడి కారు కలను తీర్చాలని ‘నానో’ తెచ్చిన టాటా గొప్ప వితరణశీలి. యువతకు ఆదర్శప్రాయుడు. విలువలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన దార్శనికుడు. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన వయసు 86 ఏళ్లు. -
అంతిమ యాత్రలో అపశ్రుతి.. రూ.5 లక్షలు నష్టం
కురబలకోట: అంతిమ సంస్కారంలో భాగంగా పేల్చిన టపాసులు ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై పడటంతో అవి అంటుకుని కాలిపోయాయి. క్రేట్లను ఆనుకునే ఉన్న మరో రైతు భవనం ఎగిసిపడిన మంటలకు దెబ్బతింది. ఈ సంఘటనలో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు..కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మలిపెద్దివారిపల్లెకు చెందిన చిటికి తిప్పారెడ్డి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇతని అంత్యక్రియలు మంగళవారం ఉదయం నిర్వహించారు. ఆఖరి మజిలీ కావడంతో అంతిమ యాత్రను ఘనంగా ముగించాలన్న ఉద్దేశంతో పూలు చల్లుతూ టపాసులు పేలుస్తూ ముందుకు సాగారు. ఆ మార్గంలో పక్కనే ఉన్న టమాటా మండీల వద్ద మదనపల్లెకు చెందిన టమాటాల వ్యాపారి పీఏకె (పి. అహ్మద్ ఖాన్) ముందు రోజు రాత్రి లారీ లోడు టమాటా క్రేట్లు తోలాడు. పేలిన టపాసులు పక్కనే ఉన్న టమాటా క్రేట్లపై నిప్పురవ్వలు పడి అంటుకున్నాయి. ప్లాస్టిక్‌వి కావడంతో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలకు అంగళ్లు, పరిసర ప్రాంతాల వారు కలవరపడ్డారు. అనంతరం మదనపల్లె పైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే క్రేట్లన్నీ కాలిపోయాయి. రూ. 3 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. క్రేట్లు కాలడంతో వీటిని ఆనుకుని ఉన్న చిటికి హరినాథరెడ్డికి చెందిన భవనం కూడా నల్లగా మారిపోయింది. ప్లాస్టింగ్, కిటీకీలు, గోడలు దెబ్బతిన్నాయి. ఇతని భవనానికి కూడా రూ.2 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ఊహించని పరిణామం పట్ల విచారం వ్యక్తమవుతోంది. ∙ -
రామోజీకి అశ్రు నివాళి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ఉదయం ఫిలింసిటీలోని ఆయన నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీ చితికి ఆయన కుమారుడు కిరణ్ నిప్పంటించారు.ప్రముఖుల నివాళిరామోజీరావు (88) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం నుంచి ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం రామోజీ మృతదేహాన్ని ఫిలింసిటీలోని నివాసంలో ఉంచారు. ఆదివారం ఉదయం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, బీజేపీ ఎంపీలు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు మురళీ మోహన్ తదితరులు రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. రామోజీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.పాడె మోసిన చంద్రబాబుఆదివారం ఉదయం 9.30 గంటలకు రామోజీ నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతిమ యాత్ర వాహనంపై కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి, సోహన, మనవడు సుజయ్తోపాటు జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు కూర్చున్నారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర స్మృతివనానికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంతిమ యాత్రలో పాల్గొని రామోజీ పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. 11.30 గంటల సమయంలో రామోజీ భౌతికకాయాన్ని చితిపై ఉంచారు. పోలీసులు గౌరవ వందనం చేసి, గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత.. రామోజీ కుమారుడు కిరణ్ చితికి నిప్పంటించారు. -
Chandra Mohan Last Rites: ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు (ఫొటోలు)
-
దుఃఖంలోనూ భర్తకు సెల్యూట్ చేసిన భార్య సౌజన్య
బోయినపల్లి(చొప్పదండి): జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన అనిల్ అంతిమయాత్ర కుటుంబ సభ్యుల రోదనలు, బంధువులు, ప్రజాప్రతినిధుల ఆశ్రునయనాల మధ్య ముగిసింది. శనివారం ఉదయం అనిల్ భౌతికకాయం ఆయన స్వగ్రామమైన మల్కాపూర్‌లోని ఇంటికి చేరడంతో మండలవ్యాప్తంగా జనం భారీగా తరలివచ్చారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి గంగాధరకు చేరుకుంది. అక్కడ పలువురు యువకులు జాతీయ జెండాలతో స్వాగతం పలికి ర్యాలీగా మల్కాపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆర్మీ అధికారులు సైనికలాంఛనాలతో గౌరవ వందనం చేశారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభించారు. అనిల్ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మీ సిబ్బంది గౌరవ వందనం చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. అనిల్ పెద్ద కుమారుడు అయాన్ తండ్రి చితికి నిప్పంటించాడు. నిన్ను విడిచి ఎలా ఉండాలే బావా.. అనిల్ భార్య సౌజన్య రెండురోజులుగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉంది. ‘బావా నిన్ను విడిచి నేనెలా ఉండాలే బావా.. పిల్లలను ఎట్ల సాదాలే బావా.. అని రోదించడం చూసేవారిని కంటతడి పెట్టించింది. ‘నన్ను పోలీస్‌గా చూడాలని అంటివి. నీ మాటతోనే ఎస్సై పరీక్ష రాసిన బావ..’ రెండు నెలలైతే దగ్గరికి బదిలీ చేయించుకుంట అంటివి.. అంతలోనే ఘోరం జరిగిందా బావా..’ అంటూ భర్త ఫొటో ఉన్న ఫ్లెక్సీ వద్ద విలపించింది. అనిల్ తల్లి లక్ష్మి, అనారోగ్యంతో ఉన్న తండ్రి మల్లయ్య ఏడుస్తుండడాన్ని ఆపడం ఎవరితరమూ కాలేదు. కుమారులు అయాన్, అరయ్ సైతం తండ్రి శవపేటిక వద్ద విలపించారు. అమరుడైన భర్తకు భార్య సెల్యూట్ అనిల్ భౌతికకాయాన్ని చితిపై పెట్టిన అనంతరం సైనికులు గౌరవ వందనం చేశారు. సైనిక గీతం ఆలపించిన సమయంలో అంతులేని దుఃఖంలోనూ సౌజన్య భర్త భౌతికకాయానికి సెల్యూట్ చేయడం అక్కడున్నవారిని మరింత కంటతడి పెట్టించింది. తండ్రి చితికి ఆయన పెద్ద కుమారుడు అయాన్ నిప్పు పెట్టాడు. అనిల్ సైనిక యూనిఫాంను ఆర్మీ అధికారులు సౌజన్యకు అందించారు. హాజరైన మంత్రి గంగుల, ఎంపీ సంజయ్ అనిల్‌కు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ అనురాగ్‌జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ తదితరులు నివాళులు అర్పించారు. అంత్యక్రియలు ముగిసేవరకూ అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ అనిల్ పాడె మోశారు. అంతిమయాత్రలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, వేములవాడ ఆర్డీఓ పవన్‌కుమార్, రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీలు కత్తెరపాక ఉమ, నాగం కుమార్, సెస్ డైరెక్టర్ కొట్టెపెల్లి సుధాకర్, సర్పంచు కోరెపు నరేశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, ఎంపీడీఓ నల్లా రాజేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, బోయినపల్లి ఎస్సై మహేందర్ బందోబస్తు నిర్వహించారు. అనిల్ కుటుంబాన్ని ఆదుకుంటాం అనిల్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అనిల్ అంత్యక్రియలు పూర్తయిన అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన కుటుంబాన్ని పరామర్శించామని, యువ జవాన్‌ను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
ముగిసిన రాకేష్ అంత్యక్రియలు
-
తండ్రికి తలకొరివి పెట్టిన ఏడేళ్ల చిన్నారి
భీమడోలు(ఏలూరు జిల్లా): కన్న తండ్రికి ఏడేళ్ల కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన గుండుగొలనులో మంగళవారం జరిగింది. బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆభం శుభం తెలియని ఏడేళ్ల వయస్సు ఉన్న పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించి కన్న రుణం తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. గుండుగొలనులోని బీసీ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీ కాకర్ల శ్రీనివాసరావు (42) ఆనారోగ్యంతో ఇంటి వద్దనే మృతి చెందాడు. చదవండి: అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు.. అతనికి భార్య పార్వతి, కుమార్తెలు ప్రియదర్శిని (7), సంజన (5) ఉన్నారు. కుమారులు లేకపోవడంతో శ్రీనివాసరావుకు మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు బంధువులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పెద్దలు తండ్రి చితికి పెద్ద కుమార్తె ప్రియదర్శినితో తలకొరివి పెట్టించారు. భార్య పార్వతీ, కుమార్తెలిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. -
రాజాజీ హాల్లో తొక్కిసలాట.. ఇద్దరి మృతి
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధిని కడసారి చూసేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. జనం రద్దీ పెరగడం, అభిమానులు బారికేడ్లను తోసుకొని రావడంతో రాజాజీ హాల్లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా, 40 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంతిమయాత్ర సజావుగా సాగేలా కార్యకర్తలు సహకరించాలని కోరారు. సీఎం పళనిస్వామిని కలసి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహిస్తామంటే సహకరించలేదని తెలిపారు. కోర్టు ద్వారా అనుమతులు సాధించామని పేర్కొన్న ఆయన దీనిని తమిళ ప్రజల విజయంగా అభివర్ణించారు. 4 గంటలకు ప్రారంభంకానున్న అంతిమయాత్ర సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. మెరీనా బీచ్‌లో ఆర్మీ బలగాలు.. కరుణానిధి అంత్యక్రియలు జరగనున్న మెరీనా బీచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటుండటంతో అక్కడ భారీగా సైనిక బలగాలను మొహరించారు. మరోవైపు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. -
శ్రీదేవి అంతిమ యాత్ర
-
శ్మశానవాటికకు శ్రీదేవి భౌతికకాయం
ముంబై : సినీనటి శ్రీదేవి అంతిమ యాత్ర ముగిసింది. ఆమె అంతిమ యాత్రకు తారాలోకం తరలి వచ్చింది. తన అభిమాన నటిని కడసారి చూసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. మరోవైపు విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటిక వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 9.30 సమయంలో అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి ఇంటికి సమీపంలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో ఉంచారు. మధ్యాహ్నం 12.30 వరకు అభిమానులను అనుమతించారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా యాత్రలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో వెంకటేష్‌లతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే ముంబై విచ్చేశారు విలేపార్లే హిందూ స్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. గౌరవ సూచకంగా ఆమె భౌతికకాయంపై పోలీసులు త్రివర్ణ పతాకం కప్పారు. ఈ నెల 24న శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
బాలచందర్ అంతిమయాత్ర ప్రారంభం
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు కే బాలచందర్ అంతిమయాత్ర బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ప్రారంభమైంది. బీసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు తరలివచ్చి బాలచందర్‌కు నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచందర్ మంగళవారం చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు బాలచందర్ మృతికి సంతాపం తెలియజేశారు. -
దర్మవరపు సుబ్రమణ్యం అంత్యక్రియలు