
తండ్రి చితికి నిప్పంటిస్తున్న చిన్నారి
భీమడోలు(ఏలూరు జిల్లా): కన్న తండ్రికి ఏడేళ్ల కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన గుండుగొలనులో మంగళవారం జరిగింది. బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆభం శుభం తెలియని ఏడేళ్ల వయస్సు ఉన్న పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించి కన్న రుణం తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. గుండుగొలనులోని బీసీ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీ కాకర్ల శ్రీనివాసరావు (42) ఆనారోగ్యంతో ఇంటి వద్దనే మృతి చెందాడు.
చదవండి: అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు..
అతనికి భార్య పార్వతి, కుమార్తెలు ప్రియదర్శిని (7), సంజన (5) ఉన్నారు. కుమారులు లేకపోవడంతో శ్రీనివాసరావుకు మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు బంధువులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పెద్దలు తండ్రి చితికి పెద్ద కుమార్తె ప్రియదర్శినితో తలకొరివి పెట్టించారు. భార్య పార్వతీ, కుమార్తెలిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment