stations
-
ఢిల్లీ మెట్రోలో గోల్డెన్ లైన్.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం!
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తాజాగా మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్ట్‌లోని తుగ్లకాబాద్ నుండి ఢిల్లీ ఏరోసిటీ కారిడార్ కలర్ కోడ్‌లో చోటుచేసుకున్న మార్పును ప్రకటించింది. ఇంతకుముందు ఈ లైన్‌ను సిల్వర్ లైన్ అని పిలిచేవారు. ఇకపై ఈ రూట్‌ను గోల్డెన్ లైన్ అని పిలవనున్నారు. విజిబిలిటీ సంబంధిత సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మెట్రో కోచ్‌లలో వెండి రంగు స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే దీనిని గోల్డెన్ లైన్ కారిడార్‌గా మార్చారు. ఇది 23.62 కిలోమీటర్ల విస్తీర్ణంలో, మొత్తం 15 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఈ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025నాటికి ఇవి పూర్తికావచ్చని అధికారులు చెబుతున్నారు. ఫేజ్-4లో గోల్డెన్ లైన్‌తో పాటు మరో రెండు కారిడార్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో జనక్‌పురి వెస్ట్ నుండి ఆర్కే ఆశ్రమం వరకు మెజెంటా లైన్‌ను పొడిగించడం, మజ్లిస్ పార్క్ నుండి మౌజ్‌పూర్ వరకు పింక్ లైన్‌ను పొడిగించడం మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలోని ఒక్కో కారిడార్‌ను ఒక్కో రంగుతో గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లో లైన్ సమయపూర్ బద్లీ నుండి గుర్గావ్ వరకు, బ్లూ లైన్ వైశాలి నుండి ద్వారక వరకు, రెడ్ లైన్ కొత్త బస్టాండ్ నుండి రితాలా వరకు నడుస్తుంది. -
26/11 తరువాత ముంబై రైల్వే స్టేషన్ల పరిస్థితి ఇదే..
మహానగరం ముంబైలో నిత్యం రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 2008, నవంబరు 26న దాడులు జరిపారు. ఈ దాడుల్లో 50 మంది రైల్వే స్టేషన్లోనే మృతి చెందారు. ఈ ఘటన అనంతరం రైల్వేశాఖ స్టేషన్లలో భద్రతకు పలు చర్యలు చేపట్టింది. ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, రౌండ్ ది క్లాక్ భద్రతను కల్పించారు. సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలోని 80 సున్నితమైన ప్రదేశాలలో 3,459 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాల్లోని రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది ఫుటేజీని పర్యవేక్షిస్తారు. పశ్చిమ రైల్వే లైన్‌లోని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ కింద 31 స్టేషన్లలో 2,770 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీడియో సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా 62 స్టేషన్లకు మరో 1,039 సీసీ కెమెరాలు మంజూరయ్యాయని, నిర్దిష్ట స్టేషన్లలో ఇప్పటికే 160 కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వాకీ-టాకీలు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్లు, బారికేడ్లు వంటి అవసరమైన భద్రతా పరికరాలను కొనుగోలు చేశామని, వీటిని ప్రయాణికుల భద్రత కోసం ఉపయోగిస్తున్నామని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. ఇది కూడా చదవండి: నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
ఎటు చూసినా చెత్తే..!
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్యానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. స్వచ్ఛభారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మేరకు చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ ‘స్వచ్ఛతా పక్వారా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రయాణికుల్లోనే మార్పు రావటం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, వర్క్‌షాపులు, రైల్వే ఉద్యోగులు నివాసం ఉండే కాలనీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. పక్షం రోజుల్లో ఏకంగా 544 టన్నుల చెత్త పోగవడం చూసి అధికారులు నివ్వెరపోయారు. పారిశుధ్యంపై రైల్వే ప్రత్యేక దృష్టి గత కొంతకాలంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. అధునాతన రైళ్లతో పాటు స్టేషన్లలో అన్నిరకాల వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేగాక స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రైల్వే అధికారులూ అప్రమత్తంగా ఉంటున్నారు. స్టేషన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించి క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూస్తున్నారు. రైళ్లలో కూడా శుభ్రపరిచే సిబ్బందిని ఉంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకముందే క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం దీనికి ఎలాంటి సహకారం లభించడం లేదని రైళ్లు, స్టేషన్లలో దర్శనమిచ్చే చెత్త స్పష్టం చేస్తోంది. పట్టించుకోని ప్రయాణికులు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు, కాఫీ/టీ కప్పులు, భోజన ప్యాకెట్లు, విస్తరాకులు.. ఇలాంటి వాటన్నిటినీ ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు. దీంతో రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. సిబ్బంది ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ చెత్త పోగవుతోంది. ఇటీవల పక్షం రోజుల పాటు 639 రైల్వే స్టేషన్లు, 180 రైళ్లలో స్వచ్ఛతా పక్వారా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఉన్నా, విచ్చలవిడిగా చెత్త విసురుతున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 544 టన్నుల చెత్తను పోగేసిన అధికారులు.. చెత్తను విసురుతూ పట్టుబడ్డ 857 మంది నుంచి రూ.4.5 లక్షల జరిమానా వసూలు చేశారు. 21,685 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోగైన చెత్తలో 42 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుండటం విశేషం. ఇక రైల్వే ప్రాంగణాల్లో 436 టన్నుల తుక్కును సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 3,510 కి.మీ. నిడివిగల ట్రాక్‌ను కూడా ఈ సందర్భంగా శుభ్రం చేశారు. అయితే స్వచ్ఛతా పక్వారా పేరుతో ఎప్పుడో ఓసారి నిర్వహించే కార్యక్రమాలతో ఫలితం అంతగా ఉండదని, రైళ్లు, రైల్వే స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయతి్నంచాలనే సూచనలు వస్తున్నాయి. -
జీ-20 ఎఫెక్ట్: ఈ తేదీల్లో పలు మెట్రో స్టేషన్లు రద్దు
ఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ ముస్తాబవుతోంది. సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమావేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఢిల్లీ మెట్రోపై ఆంక్షలను విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్నారు. దాదాపు 25 దేశాలకు చెందిన లీడర్లతో సహా వివిధ ప్రపంచస్థాయి సంస్థల నాయకులు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. In order to maintain foolproof security arrangements during the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10, the Delhi Police metro unit asked the Chief Security Commissioner to close some metro station gates that open towards the VVIPS Route/venue of… pic.twitter.com/5ssPc9xepz — ANI (@ANI) September 4, 2023 ఢిల్లీలోని మోతీ బాగ్, భికాజీ కామా ప్లేస్, మునిర్కా, ఆర్కే పురం, ఐఐటీ, సదర్ బజార్ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జన్‌పథ్, భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్లను సున్నితమైన ప్రదేశాల జాబితాలో ఉంచారు. దీనితో పాటు వేదికకు సమీప స్టేషన్ అయిన సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ పూర్తిగా మూసివేయనున్నారు. ఢిల్లీలో మిగిలిన స్టేషన్లు సాధారణంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 4-13 వరకు స్మార్ట్ కార్డ్ సేవలను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ సేవలు ఉన్నప్పటికీ ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే -
తెలంగాణలో 39 అమృత్ భారత్ స్టేషన్లు.. రైల్వే స్టేషన్లకు కొత్తరూపు
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా తెలంగాణలోని మొత్తం 39 రైల్వే స్టేషన్లను గుర్తించి వీటిని సంపూర్ణంగా ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మొదటి విడతగా 21 స్టేషన్లకు సంబంధించిన పనులను ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ‘అమృత్ భారత్ స్టేషన్ల’పథకంలో భాగంగా.. రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణి కులకు వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఉచిత వై–ఫై సదుపాయాన్ని కల్పిస్తారు. అదేవిధంగా స్థానిక ఉత్పత్తులకు సరైన గుర్తింపు కల్పించేందుకు ‘వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్’దుకాణాలు, ప్రయాణీకులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు ఏర్పాటు చేస్తారు. స్టేషన్ ముందు, వెనక భాగాల్లో మొక్కల పెంపకంతో పాటు చిన్న గార్డెన్లు కూడా నెలకొల్పుతారు. ఇక స్టేషన్ల అవసరాలకు అనుగుణంగా బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారు. వీటికి తోడుగా నగరానికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడం, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, పట్టాలకు ఇరువైపులా కాంక్రీట్ బాటలు, రూఫ్ ప్లాజాలు (అవసరాన్ని బట్టి), దీర్ఘకాలంలో అవసరమయ్యే నిర్మాణాలను ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నారు. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే 40 ఏళ్ల అవసరాలు తీర్చేవిధంగా అభివృద్ధి చేసేందుకు రూ.715 కోట్లు, చర్లపల్లి టరి్మనల్ అభివృద్ధికి రూ.221 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మొత్తం గుర్తించిన స్టేషన్లు 39: ఆదిలాబాద్, బాసర్, బేగంపేట్, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్ (నాంపల్లి), జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మలక్‌పేట్, మల్కాజ్గిరి, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ, తాండూర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా, జహీరాబాద్. ∙మొదటి విడతలో ఆగస్టు 6న పనులు ప్రారంభం కానున్న 21 స్టేషన్లపై రూ.894 కోట్లు ఖర్చుచేయనున్నారు. -
Hyderabad: మెట్రో ప్రయాణికులకు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు మరో షాక్ ఇచ్చారు. మెట్రో స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లలో ఉపయోగించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ చార్జీలను నేటి నుంచే(జూన్2) వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. స్టేషన్లో టాయిలెట్ వాడకానికి 5 రూపాయలు, యూరినల్ వాడకానికి రూ.2 వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని ఉపయోగించినందుకు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయడం లేదు. కానీ ఇకపై వాటికి డబ్బులు వసూలు చేయనున్నారు. దీంతో ఇప్పటికే మెట్రో చార్జీల రాయితీల్లో కోతతో ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులకు తాజా నిర్ణయం మరింత భారం కానుంది. ఇక ఇటీవలె మెట్రో చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డులు, క్యూఆర్‌కోడ్‌పైన ప్రయాణం చేస్తున్న వారికి ఇప్పటి వరకు చార్జీల్లో 10 శాతం రాయితీ ఉండగా.. ఈ రాయితీపైన కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేశారు. అదే విధంగా గుర్తించిన సెలవు రోజుల్లో కేవలం రూ.59కే అపరిమితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన సూపర్ సేవర్ ఆఫర్ ధరలను సైతం రూ.100కు పెంచింది. చదవండి: తెలుగులోనే పూర్తి ప్రసంగం.. కళాకారులతో గవర్నర్ తమిళిసై డ్యాన్స్ -
టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
వరంగల్ కు మహర్దశ..
-
మెట్రో బాట..నోట్లవేట!
గ్రేటర్ మెట్రో వాణిజ్య బాట పట్టనుంది. మెట్రో స్టేషన్లకు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన విలువైన స్థలాలను వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా కమర్షియల్ షెడ్లుగా అభివృద్ధి చేసి అద్దెకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా కావూరిహిల్స్ సమీపంలోని లుంబినీ ఎన్క్లేవ్ వద్ద 2990 చదరపు గజాలు, మాదాపూర్ నీరూస్ ఎదురుగా ఉన్న 2 వేల చదరపు గజాలు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని 1210 చదరపు గజాల స్థలాల్లో వాణిజ్య షెడ్లను అభివృద్ధి చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు మెట్రో ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. గతంలో మాల్స్ అభివృద్ధి చేయాలనుకున్న ప్రాంతాల్లో ‘కమర్షియల్ స్పేస్’ రూపకల్పనకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ దెబ్బతో ఆర్థికంగా ఎదురవుతున్న నష్టాలను ఎదుర్కొనేందుకు మెట్రో సంస్థ పలు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే నాంపల్లి చౌరస్తా వద్ద పీపీపీ విధానంలో ఓ ప్రైవేటుసంస్థ సౌజన్యంతో మల్టీలెవల్ కార్ పార్కింగ్ కేంద్రాన్ని నెలకొల్పుతోన్న హెచ్ఎంఆర్ సంస్థ..పాతనగరంలోని కిల్వత్ ప్రాంతంలోనూ మరో పార్కింగ్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు తాజాగా వాణిజ్య షెడ్ల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ అనంతరం సైతం భారీ నష్టాలను చవిచూస్తోన్న సంస్థ ..గట్టెక్కేందుకు ఆపసోపాలు పడుతుండడం గమనార్హం. మాల్స్ నుంచి వాణిజ్య స్థలాలుగా.... మెట్రో నిర్మాణ ఒప్పందం సమయంలో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి కేటాయించిన విలువైన స్థలాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులు, మాల్స్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్న విషయం విదితమే. నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో 69 కి.మీ మార్గంలో గతంలో 18 మాల్స్ నిర్మించాలని నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర విభజన, ఆర్థిక నష్టాల భయం నేపథ్యంలో మాల్స్ సంఖ్యను 4కు కుదించింది. ప్రస్తుతం మూసారాంబాగ్, ఎర్రమంజిల్, పంజగుట్ట, హైటెక్‌సిటీ వద్ద మాల్స్‌ను నిర్మించింది. మిగతా చోట్ల మాల్స్ నిర్మాణాన్ని వాయిదా వేసింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వాణిజ్య షెడ్లను పీపీపీ విధానంలో ఏర్పాటుచేసి అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత మేర ఆదాయాన్ని ఆర్జించాలని హెచ్ఎంఆర్ నిర్ణయించడం విశేషం. నష్టాల నుంచి గట్టెక్కేనా? గ్రేటర్ వాసుల కలల మెట్రోకు కోవిడ్ కలకలం, లాక్డౌన్ ఆర్థికంగా నష్టాల బాట పట్టించింది. గతేడాది మార్చికి ముందు మూడు మార్గాల్లో నిత్యం 4 లక్షలమంది ప్రయాణికులతో కళకళలాడిన మెట్రో రైళ్లు.. ప్రస్తుతం 1.70 లక్షల నుంచి 2 లక్షలమంది ప్రయాణికులతో కనాకష్టంగా నెట్టుకొస్తున్నాయి. ప్రయాణికుల ఛార్జీలు, వాణిజ్య ప్రకటనలు, రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా ఆదాయ ఆర్జన చేయాలనుకున్న సంస్థ ఆశలు తల్లకిందులయ్యాయి. ప్రస్తుతం వస్తున్న ఆదాయం సరిపోకపోగా..నిత్యం మె ట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణకు అదనంగా నిర్మా ణ సంస్థ నిత్యం కోటి వ్యయం చేస్తున్నట్లు సమాచారం. మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీతోపాటు నిర్మాణ సంస్థ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ స్టేషన్ల పరిసరాలను, పార్కింగ్ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోన్న హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్)సంస్థ కూడా నష్టాల బాటపట్టింది. ప్రభుత్వం ఏటా వార్షిక బడ్జెట్లో కేటాయించే మొత్తం హెచ్ఎంఆర్ ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలకు కూడా కనాకష్టంగా సరిపోతోంది. దీంతో నష్టాల నుంచి గట్టెక్కేందుకు వాణిజ్య షెడ్ల నిర్మాణం ప్రతిపాదనలను హెచ్ఎంఆర్ ముందుకు తీసుకొచ్చినట్లు తెలిసింది. -
మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ప్రారంభం
-
సిటీలో అమెరికా స్టేషన్!
అవును...మన నగరంలో అగ్రరాజ్యంలోని కంపెనీ పేరిట మెట్రో రైలు స్టేషన్ ఏర్పాటైంది. ఇది ప్రత్యేకంగా ఏర్పాటు కాలేదు...ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్‌కే అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ‘ఇన్వెస్కో’ పేరు పెట్టారు. ఇలా నగరంలోని 65 మెట్రో స్టేషన్ల పేర్లు ఇక బహుళ జాతి కంపెనీలు, విదేశీ సంస్థల పేరిట మార్పు చెందనున్నాయి. ఆదాయం పెంపు కోసం ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో స్టేషన్ల పేర్లను లీజుప్రాతిపదికన కట్టబెట్టేందుకు నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి, హెచ్ఎంఆర్కు ప్రతిపాదించింది. కానీ దీనిపై హెచ్ఎంఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు, ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో విదేశీ కంపెనీల పేర్లు పెడితే వివాదాలు తలెత్తుతాయని పేర్కొంది. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన మెట్రో స్టేషన్లకు బహుళజాతి, ప్రైవేటు కంపెనీల పేర్లు పెట్టే అంశం తెరమీదకు రావడంతో వివాదం నెలకొంది. ప్రస్తుత తరుణంలో ప్రయాణికుల చార్జీలతో మెట్రో గట్టెక్కే పరిస్థితి లేనందున.. వివిధ ఆర్థిక సంస్థల నుంచి తాము తీసుకున్న రుణాలపై కనీసం వడ్డీ అయినా కలిసివస్తుందన్న అంచనాతో నిర్మాణ సంస్థ పలు మెట్రో స్టేషన్లకు ప్రైవేటు సంస్థల నుంచి నెలవారీగా లేదా వార్షిక ప్రాతిపదికన లీజు తీసుకొని ఆయా స్టేషన్లకు ప్రైవేటు కంపెనీల పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇటు ప్రభుత్వానికి, అటు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ముందు పెట్టింది. అంతటితో ఆగకుండా ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్‌కు ఏకంగా అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్కో సంస్థ పేరు పెట్టడం గమనార్హం. నిర్మాణ సంస్థ ప్రతిపాదనలను ఇటు ప్రభుత్వం, అటు హెచ్ఎంఆర్ అధికారులు ససేమిరా అన్నట్లు తెలిసింది. చారిత్రక భాగ్యనగరిలో ప్రతి ప్రాంతానికి భౌగోళికంగా, చారిత్రకంగా ప్రత్యేకత ఉన్న నేపథ్యంలో ఆయా స్టేషన్లకు ప్రైవేటు కంపెనీల పేర్లు పెడితే అనేక వివాదాలు తలెత్తుతాయని హెచ్ఎంఆర్ అధికారులు ఎల్అండ్టీకి స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాకుండా నిర్మాణ ఒప్పందంలో ఇలా ఇష్టారాజ్యంగా పేర్లు పెట్టే క్లాజ్ కూడా లేదని చెప్పినట్లు సమాచారం. పేరు పెట్టేయ్.. లీజు పట్టేయ్.. మెట్రో స్టేషన్లకు ప్రైవేటు పేర్లు పెట్టే ప్రతిపాదనలు దుబాయి మెట్రో ప్రాజెక్టు నుంచి మొదలైనట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ మెట్రో రైలు అధికా>రులు ఈ ప్రతిపాదనలను దశలవారీగా అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో బెంగళూరు, చెన్నై నగరాలు కూడా ఇదేబాటలో ముందుకెళతాయని అంచనా వేస్తున్నామన్నారు. అయితే ఇప్పటికే మెట్రో స్టేషన్లు,పిల్లర్ల ఏర్పాటుతో నగరంలో ఎంతో చారిత్రక నేపథ్యంలో ఉన్న కట్టడాలు తమ వైభవాన్ని కోల్పోయాయన్న విమర్శలున్న నేపథ్యంలో ఈ పేర్ల రగడ కొత్త వివాదాలు సృష్టిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి లెక్కలు వారివే.. నగరంలో మొత్తం ప్రాజెక్టును 2018 డిసెంబరు నాటికి పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి రూ.16,375 కోట్లు వ్యయం చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.13,200 కోట్లు ఖర్చుచేసినట్లు ఎల్అండ్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రూ.11 వేల కోట్లు వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించినట్లు పేర్కొంటున్నాయి. ఇక మెట్రో నిర్మాణ ఒప్పందం ప్రకారం మెట్రో ప్రాజెక్టుకు అయిన వ్యయాన్ని నిర్మాణ సంస్థ.. 50 శాతం ప్రయాణీకుల చార్జీలు..మరో 45 శాతం రవాణా ఆధారిత ప్రాజెక్టులు,రియల్ఎస్టేట్ అభివృద్ధి, మరో ఐదు శాతాన్ని వాణిజ్య ప్రకటనల ద్వారా 40 ఏళ్లపాటు సమకూర్చుకోవాలని నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో వినూత్న ఆర్థిక విధానాలను అమలుచేయని పక్షంలో తొలి ఏడేళ్లు తమకు నష్టాల బాట తప్పదని, బ్యాంకుల నుంచి తాము సేకరించిన రుణాలపై వడ్డీ భారం కూడా పెరుగుతోందని నిర్మాణ సంస్థ చెబుతోంది. రోజుకు 70 వేలమంది ప్రయాణికులే... తొలివిడత మెట్రో రైళ్లు పరుగులుపెడుతోన్న నాగోల్–అమీర్‌పేట్(17 కి.మీ) మార్గంలో రోజుకు సరాసరిన 40 వేల మంది..మియాపూర్–అమీర్‌పేట్(13 కి.మీ)మార్గంలో రోజుకు సరాసరిన 30 వేల మంది..మొత్తంగా 30 కి.మీ మార్గంలో నిత్యం 70 వేలమంది మాత్రమే మెట్రో జర్నీ చేస్తుండడం గమనార్హం. ఆదివారం, ఇతర సెలవురోజుల్లో రద్దీ మరో 10 వేలు అదనంగా ఉంటోందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 2 లక్షల స్మార్ట్‌కార్డులు విక్రయించినప్పటికీ ఇందులో నెలవారీగా రీచార్జి అవుతున్నవి 50 వేలకు మించి లేకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఎల్అండ్టీ సంస్థ ఆశించిన ఆదాయం లేనట్టే అని చెప్పొచ్చు. ఎల్బీనగర్–అమీర్‌పేట్, హైటెక్‌సిటీ–అమీర్‌పేట్ రూట్లో ఈ ఏడాది జూన్‌లో మెట్రో ప్రారంభమైతే రద్దీ అనూహ్యంగా పెరుగుతుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో 65 స్టేషన్లు.. భారీగా ఆదాయం.. గ్రేటర్ పరిధిలో నాగోల్– రాయదుర్గం,ఎల్భీనగర్– మియాపూర్, జేబీఎస్– ఫలక్‌నుమా మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ మార్గంలో 65 మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే మెట్రో పరుగులు పెడుతున్నా నాగోల్– అమీర్‌పేట్– మియాపూర్ మార్గంలో మొత్తం 30 కి.మీ రూట్లో 24 మెట్రో స్టేషన్లున్నాయి. వీటిని ఒక్కోటి రూ.65 నుంచి రూ.100 కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఒక్కో స్టేషన్‌కు ప్రైవేటు, బహుళ జాతి కంపెనీ నుంచి అద్దె లేదా లీజు రూపంలో నెలకు కనీసం రూ.10 లక్షలు వసూలు చేసినా.. మొత్తంగా 65 స్టేషన్లకు నెలకు రూ.6.5 కోట్లు. ఏడాదికి రూ.78 కోట్లు ఆదాయం లభిస్తుందని నిర్మాణ సంస్థ ఈ పేర్లు పెట్టే ప్రణాళికను తెరమీదకు తీసుకొచ్చిందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. -
మిలటరీ కేంద్రాలకు ఐటీ హంగులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 2 వేల మిలటరీ కేంద్రాలను స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆధునీకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద 58 మిలటరీ కేంద్రాలను ఎంపిక చేసినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలను కూడా ఈ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు ఆధికారులు తెలిపారు. సరిహద్దుల్లో కీలకంగా ఉండే మిలటరీ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా ఐటీ, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగాన్ని ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా మౌలిక వసతులు కల్పన, రహదారులు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. -
రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై దుర్వినియోగం అవుతుంది
-
ఇక పట్టాలపైకి పెప్సీ రాజధాని, కోక్ శతాబ్ది!
న్యూడిల్లీ : బ్రాండెడ్ స్టేషన్ నుంచి ఇక పెప్సీ రాజధాని లేదా కోక్ శతాబ్ది పట్టాల పైకి రానున్నాయట. ప్రయాణికుల చార్జీలపై ఎలాంటి పెంపు అవసరం లేకుండా రెవెన్యూలను ఆర్జించడానికి రైల్వే రూపొందించిన బ్రాండెడ్ రైళ్ల, స్టేషన్ల ప్రణాళికను ఇక పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది..ఈ ప్రతిపాదనతో రైలు మొత్తాన్ని(వెలుపల, బయట) బ్రాండెడ్ ప్రకటనలకు విక్రయించేందుకు రైల్వే సిద్ధమవుతోంది.. వచ్చే వారంలో ఈ ప్రతిపాదనను రైల్వే బోర్డు ఆమోదించనుంది. ఒకవేళ కొత్త పాలసీ ఆమోదం పొందితే బోగిల వెలుపల వైపు, లోపలవైపు ప్రకటనలకు కంపెనీలకు మీడియా హక్కులు లభించనున్నాయి. దీంతో కాదేది కవితకనర్హం అన్నట్టు, కాదేది ప్రకటనర్హం మాదిరి రైల్వేలు మారనున్నాయి. అంతకముందు పీస్-మీల్ మాదిరి కొద్ది స్థలాన్ని మాత్రమే రైల్వే ప్రకటనలకు విక్రయించేంది. కానీ ప్రస్తుతం రైళ్లంతటిన్నీ(వెలుపల, లోపల) మీడియా హక్కులకు విక్రయించాలని రైల్వే ప్లాన్ చేసింది. దీంతో ఎలాంటి ఛార్జీల పెంపు అవసరముండదని ఓ సీనియర్ అధికారి చెబుతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు దీర్ఘకాల గడువుగా ఈ మీడియా హక్కులను రైల్వే విక్రయించనుంది. రవాణా వ్యవస్థలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తున్న రైల్వే కార్యకాలపాల అభివృద్ధికి, రెవెన్యూల పెంపుకు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు, రైల్వే శాఖ ఈ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ప్రకటనల ద్వారా రెవెన్యూలను ఆర్జించాలని యోచిస్తోంది. అంతేకాక ఖాళీగా పడి ఉండే స్టేషన్లను కూడా పెళ్లి వేడుకలకు, ఈవెంట్లకు అద్దెకు ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ముందటి యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఈ మాదిరి ప్రణాళికలే రూపొందించినప్పటికీ, అవి పట్టాలెక్కడానికి నోచుకోలేదు. ప్రస్తుతం ఈ ప్రణాళిక పట్టాలెక్కితే, పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు స్టేషన్లపై, ప్లాట్‌ఫామ్‌లపై దర్శనమివ్వనున్నాయి. దశల వారీగా ఈ ప్యాకేజీని అమలు చేయనున్నారు. మొదట రాజధాని, శతాబ్ది సర్వీసులతో వీటిని ప్రారంభించనున్నారు. -
కొత్త జిల్లాకు కొత్త స్టేషన్లు
ఎస్పీ షానవాజ్ ఖాసీం పాల్వంచ:కొత్తగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా లో కొత్తగా ఆరు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్టు ఎస్పీ షానవాజ్ ఖాసీం చెప్పారు. పాల్వంచ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లక్ష్మిదేవిపల్లి, చుంచుపల్లి, మహిళ, సీసీఎస్ (సిటీ క్రైం స్టేషన్), పాల్వంచ టూ టౌన్, ట్రాఫిక్ స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని వివరించారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్‌ను కిన్నెరసాని స్టేషన్‌గా పేరు మార్చి అక్కడికి తరలిస్తామన్నారు. కొత్త జిల్లా లో పోలీస్ శాఖకు కల్పించాల్సిన ప్రాథమిక, మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలను డీజీపీకి పంపుతామన్నారు. అన్ని ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారిం చామన్నారు. ‘‘చోరీల నివారణ, దొంగల గుర్తిం పు కోసమే కాదు. పోలీస్ సిబ్బంది పని తీరును తెలుసుకునేందుకు; ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు జరుగుతున్న సమయంలో వారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో గమనించేందుకు.. పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయి’’ అని వివరించారు. తాగుబోతుల వీరంగం, ఈవ్ టీజింగ్, స్పీడ్ డ్రైవింగ్, అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ తదితరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయన్నారు. ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు సత్ఫలితాలిస్తున్నదని అన్నారు. సమావేశంలో ఓఎస్డీ భాస్కర్, డీఎస్పీ సురేంద్ర రావు, సీఐ షుకూర్, ఎస్ఐలు పి.సత్యనారాయణ రెడ్డి, బి.సత్యనారాయణ, కృష్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జలగంతో ఎస్పీ భేటీ కొత్తగూడెం: కొత్త జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై శనివారం స్థానిక ఇల్లెందు అతిధి గృహంలో ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో ఎస్పీ షానవాజ్ ఖాసీం సమావేశమయ్యారు. కొత్త జిల్లాల సరిహద్దులు, ప్రస్తుత పోలీస్ స్టేషన్లు, సర్కిల్స్‌పై చర్చించారు. టూరిజం హబ్‌గా కిన్నెరసాని అభివృద్ధవుతున్న నేపథ్యంలో అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని; పోలీస్ శాఖకు ప్రస్తుతమున్న సిబ్బంది, ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపించాలని ఎస్పీకి జలగం సూచించారు. పోలీసు శాఖకు కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని కూడా ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ బి.సురేందర్‌రావు పాల్గొన్నారు. -
దేశంలో అగ్నిమాపక కేంద్రాల కొరత!
న్యూఢిల్లీః భారత నగరాలు, గ్రామీణ ప్రాంతాలు అగ్నిమాపక కేంద్రాల కొరత తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని లోక్ సభ తెలిపింది. దేశంలో సుమారు ఎనిమిది వేల ఐదు వందలకు పైగా ఉండాల్సిన కేంద్రాలు.. కేవలం మూడు వేల పైచిలుకు ఉన్నాయని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి రిజిజు వెల్లడించారు. దేశంలోని నగరాలు, గ్రామీణ ప్రాంతాలను అగ్నిమాపక కేంద్రాల కొరత వేధిస్తోందని లోక్ సభ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 8,559 ఫైర్ స్టేషన్ల అవసరం ఉండగా, కేవలం 2,987 కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, దీంతో అగ్నిమాపక సేవల్లో 65 శాతం లోటు కనిపిస్తోందని హోం శాఖ సహాయ మంత్రి రిజిజు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అవసరానికి అనుగుణంగా అర్బన్ ఏరియాలకు 5 నుంచి 7 నిమిషాల్లోనూ, గ్రామీణ ప్రాంతాలకు 20 నమిషాల్లోపు వెళ్ళేలా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలంటే... అవసరమైనన్ని అగ్నిమాపక కేంద్రాలుండాలని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కలిగిన స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక సేవలను పురపాలక కేంద్రాలు నిర్వహించడమే కాక, అగ్ని ప్రమాదాలను అధిగమించాలంటే కేంద్రం కూడ నిధులతోపాటు, తగినంత సహకారం అందించి, సిబ్బందికి అత్యవసర సేవల్లో నాణ్యత పెరిగేలా శిక్షణ కూడ అందించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 2012 లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆధునీకరణను అమల్లోకి తెచ్చి, తగిన పరికరాలను అందుబాటులో ఉంచడం ఎంతైనా అవసరమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అర్బన్ ఏరియాల్లో పెరుగుతున్న పారిశ్రామికీకరణను దృష్టిలో ఉంచుకొని నాగపూర్ లోని నేషనల్ ఫైర్స్ సర్వీస్ కాలేజ్ ఫైర్ ఆఫీసర్స్ కు ప్రత్యేక ట్రైనింగ్ అందిస్తోందని, అగ్ని ప్రమాదాల సమయంలో ఆధునిక పద్ధతుల వాడకం, సందర్భాను సారం స్పందించేందుకు కావలసిన పద్ధతులను నేర్పిస్తోందని రిజుజు ఓ రాత ప్రతిలో తెలిపారు. -
త్వరలో మెట్రో-3 పనులు
- ముందుకు సాగించేందుకు ఎంఎంఆర్‌సీ ప్రయత్నాలు - సలహాదారులతో కమిటీ నియామకం - బాధితులక నచ్చిన విధంగానే పునరావాసం! సాక్షి, ముంబై: ప్రతిపాదిత ‘కొలాబా-బాంద్రా-సిబ్జ్’ మెట్రో-3 ప్రాజెక్టు పనులు నాలుగైదు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది. కొద్ది నెలలుగా గిర్గావ్-కాల్బదేవి ప్రాంత ప్రజల పునరావసం, గోరేగావ్‌లోని ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్డు నిర్మాణం వివాదాస్పదమయ్యాయి. దీంతో మెట్రో-3 ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. అయితే ఈ సమస్యలు పరిష్కరించేందుకు ముంబై మెట్రో రైల్వే కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీ) యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తోంది. అదేవిధంగా స్టేషన్లు, మెట్రో రైలు మార్గాన్ని భూగర్భ మార్గంలో నిర్మించేందుకు ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. గిర్గావ్ నుంచి కాల్బదేవి ప్రాంతాల్లో ఉంటున్న 650 కుటుంబాల పునరావాస సమస్యను పరిష్కరించేందుకు ఎంఎంఆర్‌సీ సలహదారుల కమిటీని నియమించనుంది. ఈ కమిటీ ద్వారా పునరావస సమస్య పరిష్కారం కానుంది. ఈ ప్రాంత ప్రజల పునరావస సమస్య అనేక సంవత్సరాల నుంచి పెండింగులో ఉంది. ఇక్కడుంటున్న కుటుంబాలకు నచ్చిన విధంగానే పునరావసం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎంఎంఆర్‌సీ ఎండీ అశ్విని బిడే తెలిపారు. ముంబైలో మెట్రో రైలు పరుగులు తీసే ప్రాంతాలు, స్టేషన్ పరిసరాలకు ఎంతో డిమాండ్ వస్తుంది. ఇళ్లు, స్థలాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. దీంతో మెట్రో రైలు రాకపోకలు సాగించడానికే కాకుండా అభివృద్థికి కూడా మెట్రో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. స్థానికులకు అక్కడే పునరావసం కల్పించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నట్లు బిడే చెప్పారు. అయినప్పటికీ స్థానికులు ఇష్టపడే చోటే పునరావసం కల్పించడానికి ప్రాధాన్యమిస్తామని వివరించారు. -
పెళ్లి పందిరి కాదుపోలింగ్ కేంద్రం
ప్యారిస్, న్యూస్‌లైన్:చెన్నైలో ఉన్న మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఐదు మోడ్రన్ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిం ది. ఈ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు పన్నీరు చల్లి, రెడ్ కార్పెట్‌తో ఆహ్వానం పలకనున్నారు. ఎన్నికల కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వుల మేరకు నగరంలోని ఉత్తర చెన్నై నియోజకవర్గంలో ఒకటి, దక్షిణ, సెంట్రల్ చెన్నైలలో రెండు చొప్పున మొత్తం ఐదు మోడ్రన్ పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రా ల్లో ఓటు వేసే ఓటర్లకు కొత్త అనుభూతిని ఇచ్చే రీతిలో చర్యలు చేపట్టారు. అరటి మొక్కలు, మామిడి తోరణాలతో అలంకరించిన మోడ్రన్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు పన్నీరు చల్లి, రెడ్ కార్పెట్‌తో ఆహ్వానం పలుకుతారు. ఇంకనూ కేంద్రంలో అత్యాధునిక కుర్చీలతో రిసెప్షన్ హాల్ ఉంటుంది. అక్కడికి ఓటర్లను ఎన్నికల సిబ్బంది తీసుకు వెళ్లి కూర్చోబెడతారు. ఈ కేంద్రాల్లో పని చేసే సిబ్బంది యూనిఫామ్, గుర్తింపు కార్డులతో కనిపిస్తారు. ఈ కేంద్రాల్లో ఎయిర్ కూలింగ్ సౌకర్యం ఉంటుంది. ఈవీఎంలను అట్ట పెట్టెల చాటున పెట్టకుండా ప్రత్యేకంగా రూపొందించిన మరుగైన టేబుల్‌పై ఉంచుతారు. ఒక ఓటరు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత మరొకరిని లోపలికి పంపిస్తారు. రిసెప్షన్ హాల్లో కూర్చుని ఉన్న ఓటర్లకు చల్లటి మజ్జిగను అందిస్తారు. ఈ కేంద్రాలకు వచ్చే వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్ సౌకర్యం కల్పించారు. ఈ విధమైన ఒక మోడ్రన్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఒక్కో కేంద్రానికి 60 వేల రూపాయలు ఖర్చు చేసినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇలాంటి మోడ్రన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇదే ప్రప్రథమం.