సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 2 వేల మిలటరీ కేంద్రాలను స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆధునీకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద 58 మిలటరీ కేంద్రాలను ఎంపిక చేసినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలను కూడా ఈ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు ఆధికారులు తెలిపారు.
సరిహద్దుల్లో కీలకంగా ఉండే మిలటరీ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా ఐటీ, ఇంటర్‌నెట్ నెట్‌వర్క్‌ను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగాన్ని ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా మౌలిక వసతులు కల్పన, రహదారులు, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment