ఆటోడ్రైవర్‌పై కత్తులతో దాడి
హైదరాబాద్: నగరంలోని కాలాపత్తార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్యామ్స్ గార్డెన్ సమీపంలో మంగళవారం ఉదయం సయ్యద్ సాబేర్(25) అనే ఆటో డ్రైవర్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారుఏ. ఈ ఘటనలో బాధితుడి మెడ, గొంతుపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సాబేర్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడు పాతబస్తీలోని ముంతాజ్‌బాగ్‌కు చెందినవాడిగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.