అగ్గిపెట్టపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో ఓవ్యక్తిపై కొందరు దాడిచేసి గాయపర్చారు.
నెల్లూరు(క్రైమ్) : అగ్గిపెట్టపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో ఓవ్యక్తిపై కొందరు దాడిచేసి గాయపర్చారు. వివరాలు.. నెల్లూరులోని హరనాథపురం సర్వేపల్లి కాలువకట్టకు చెందిన ఆర్.సాయి ఆటో డ్రైవర్. అతను ఈనెల 26వ తేదీ రాత్రి ముత్తుకూరు బస్టాండు సమీపంలోని బ్రాందీషాప్ వద్ద తన అల్లుడు కోదండపాణితో కలిసి ఉండగా అదేప్రాంతానికి చెందిన నాగరాజు అతని స్నేహితులు అక్కడకి వచ్చారు. మద్యం మత్తులో అగ్గిపెట్టె కావాలని సాయిని అడిగారు.
తనవద్ద అతను లేదని చెప్పడంతో కోపోద్రిక్తులైన వారు గొడవపడ్డారు. రాడ్ తీసుకొని సాయిపై దాడిచేసి గాయపర్చారు. బాధితుడు మంగళవారం నాలుగో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.