ఫేస్బుక్ ఫ్రెండ్ పై పోలీసులకు ఫిర్యాదు
మంగళూరు: ఫేస్బుక్ లో పరిచయమైన యువతిని మోసగించి మరో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పెళ్లి చేసుకుంటానని తనను వంచించి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని పర్వేజ్ ముషారఫ్ అనే వ్యక్తి కర్ణాటకలోని మంగళూరుకు చెందిన యువతి(26) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు దగ్గరయ్యాడని, తర్వాత మొహం చాటేశాడని వాపోయింది. నాలుగు నెలల నుంచి తనను తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె తెలిపింది. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని తెలుసుకున్న బాధితురాలు.. అతడిని నిలదీసింది. తమ మధ్య సంబంధాన్ని మర్చిపోవాలని ఆమెకు సూచించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.