నెట్ స్లోగా ఉందా? ఫేస్ బుక్ లైట్ ట్రై చేయండి | Slow net connection? Try Facebook Lite | Sakshi
Sakshi News home page

నెట్ స్లోగా ఉందా? ఫేస్ బుక్ లైట్ ట్రై చేయండి

Published Fri, Jun 5 2015 2:42 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

నెట్ స్లోగా ఉందా? ఫేస్ బుక్ లైట్ ట్రై చేయండి - Sakshi

నెట్ స్లోగా ఉందా? ఫేస్ బుక్ లైట్ ట్రై చేయండి

న్యూయార్క్: ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్నప్పుడు కూడా స్మార్ట్ గా తమ వెబ్ సైట్ చూసేందుకు కొత్త యాప్ ను అధికారికంగా ప్రవేశపెట్టనున్నట్టు ఫేస్ బుక్ ప్రకటిచింది. ఫేస్ బుక్ లైట్ పేరుతో తయారు చేసిన ఈ ఆండ్రాయిడ్ యాప్ ను తక్కువ డేటాతో వినియోగించుకోవచ్చు. ఏడాదిపైగా దీన్ని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని ప్రాజెక్టు మేనేజర్ విజయ్ శంకర్ తెలిపారు.

ఆగ్నేయాసియా, ఆఫ్రికాల్లో జనవరి నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశామన్నారు. గూగుల్ ప్లే యాప్ స్టోర్ లో నాలుగు స్టార్ల రేటింగ్ తో పాటు 50 వేల రివ్యూలు వచ్చాయన్నారు.  ఒక మెగా బైట్ కన్నా తక్కువ వెయిట్ ఉన్న ఫేస్ బుక్ లైట్ యాప్ ను సులువుగా ఇన్ స్టాల్ చేసి వాడుకోవచ్చని వెల్లడించారు. ఫేస్ బుక్ యాప్ ను వాడినట్టుగానే దీన్ని వాడుకోవచ్చని, ఎటువంటి మార్పులు లేవన్నారు. ఫేస్ బుక్ లైట్ యాప్ ను ఆసియాలో కొన్ని దేశాల్లో ప్రవేశపెట్టి తర్వాత లాటిన్ అమెరికా, ఆఫ్రికా, యూరప్ విస్తరిస్తామని విజయ్ శంకర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement