ఎఫ్‌బీ ఫ్రెండ్‌ తో వాలెంటైన్స్ డేకు వెళ్లి! | Delhi man goes to Gurgaon to celebrate Valentines Day with FB friend, gets killed | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీ ఫ్రెండ్‌ తో వాలెంటైన్స్ డేకు వెళ్లి!

Published Mon, Feb 15 2016 9:40 AM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

ఎఫ్‌బీ ఫ్రెండ్‌ తో వాలెంటైన్స్ డేకు వెళ్లి! - Sakshi

ఎఫ్‌బీ ఫ్రెండ్‌ తో వాలెంటైన్స్ డేకు వెళ్లి!

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితురాలితో ప్రేమికుల రోజును జరుపుకోవడానికి వెళ్లిన ఓ యువకుడు దారుణంగా హతమయ్యాడు. ఇద్దరు వ్యక్తులు అతన్ని నాలుగు అంతస్తుల బంగ్లా నుంచి తోసివేసి చంపేశారు. గుర్గావ్‌లోని సుశాంత్ లోక్‌ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ హత్య ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే యువకుడి స్నేహితురాలు పోలీసుల ముందు నోరు విప్పడంతో అసలు రహస్యం వెలుగులోకి వచ్చింది. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం..

ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఈశ్వర్‌ అలియాస్‌ నిషాంత్ ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో ఏడు నెలలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు సందర్భంగా గుర్గావ్‌కు రావాలని ఆ యువతి నిషాంత్‌ను కోరింది. గుర్గావ్‌లోని హుడా సిటీ సెంటర్ వద్ద ఇద్దరు కలుసుకున్నారు. ఆ తర్వాత సుశాంత్ లోక్ ఏరియాలోని ఓ నాలుగంతస్తుల భవనంలోకి వెళ్లారు. అక్కడ వారిద్దరిని చూసిన యువతి భావ రమేశ్‌ (30), అతని డ్రైవర్ అనిల్ కుమార్ (25) ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే నిషాంత్‌పై వాళ్లు దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. ఆ తర్వాత అతన్ని బాల్కనీ నుంచి కిందకు తోసేసి చంపేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement