
సినీ నటిని గర్భవతిని చేసి...
బంజారాహిల్స్(హైదరాబాద్): ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మించి ఏడాదిపాటు సహజీవనం చేయడమేగాక ఆమె గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ముఖం చాటేసిన బీటెక్ విద్యార్థిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.
రహ్మత్‌నగర్‌లో నివాసం ఉండే యువతి(23) సినీ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేసేది. గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామానికి చెందిన మేడ యశ్వంత్‌కుమార్ అనే బీటెక్ విద్యార్థితో 2014లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడడంతో‡హ్మత్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. 2016 డిసెంబర్ 2న యశ్వంత్‌కుమార్ అదే గదిలో ఆమెకు పసుపుతాడు కట్టి పెళ్ళి చేసుకున్నట్లు నమ్మించి శారీరకంగా దగ్గరయ్యారు.
ఇటీవల ఆమె గర్భవతికాగా స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లి అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, అందుకు అతడు నిరాకరించడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యశ్వంత్‌కుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు.