
రెండు కోట్ల నలభై లక్షలంటే కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న పారితోషికం గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా? అదేం కాదు. ఆ మాటకొస్తే.. దక్షిణాది హీరోయిన్లు 2 కోట్లు టచ్ చేయడం కష్టమే. మరి.. ఏ విషయంలో కాజల్ అగర్వాల్ ఈ రికార్డ్ సాధించారు అంటే.. ‘ముఖ పుస్తకం’ ద్వారా అన్నమాట. అంటే.. ఫేస్‌బుక్ అండీ. ‘‘ నా ఫాలోయర్ల సంఖ్య 24 మిలియన్స్‌కు చేరుకుంది. చాలా ఆనందంగా ఉంది’’ అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. 24 మిలియన్స్ అంటే అక్షరాల 2 కోట్ల 40 లక్షల మంది. ఈ లెవల్లో కాజల్ ఫాలోయర్స్‌ని సంపాదించుకున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఈ బ్యూటీ ఎక్కువగా ఫేస్‌బుక్ లైవ్ చాట్స్‌ను ప్రిఫర్ చేస్తుంటారు. ఫాలోయర్స్ సంఖ్య పెరగడానికి ఇదో కారణం అని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. బుధవారం తన తల్లి సుమన్ అగర్వాల్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు కాజల్. ‘‘నాకు తెలిసిన అందమైన మహిళ మా అమ్మనే. ఆమెను అమ్మా అని పిలుస్తున్నందుకు అదృష్టంగా ఫీలవుతున్నాను. నా రోల్ మోడల్, గైడ్, స్ట్రెంత్ అన్నీ మా అమ్మగారే’’అని పేర్కొన్నారు కాజల్. ఇక సినిమాల విషయానికొస్తే... ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న సినిమాలోనూ, బాలీవుడ్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్..ప్యారిస్’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment