
‘ది ఇండియా స్టోరీ’ని మొదలెట్టారు హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). శ్రేయాస్ తల్పాడే, కాజల్ అగర్వాల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ ‘ది ఇండియా స్టోరీ’(The India Story). చేతన్ డీకే దర్శకత్వంలో సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పుణేలోప్రారంభమైంది. ‘‘ది ఇండియా స్టోరీ’ తొలి షెడ్యూల్‌ని పుణే(Pune)లోప్రారంభించాం.
ఇప్పటి వరకు ఎవరూ చెప్పని, ఓ ప్రభావితమైన కథను చూపించబోతున్నాం. ఆగస్టు 15న థియేటర్స్‌లో కలుద్దాం’’ అని ‘ఎక్స్’ వేదికగా కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ‘ది ఇండియా స్టోరీ’ లోని ఓ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణ కొల్హాపూర్‌లో జరగనుందని బాలీవుడ్ సమాచారం. రైతుల కష్టాలు, వ్యవసాయ రంగంలో కొన్ని పురుగులమందు వ్యాపార సంస్థలు చేసే మోసాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment