అన్నదమ్ముల మధ్య గొడవలో చిన్నారి మృతి      | Girl died in a confrontation between brothers | Sakshi
Sakshi News home page

అన్నదమ్ముల మధ్య గొడవలో చిన్నారి మృతి     

Published Fri, Jun 1 2018 12:02 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Girl died in a confrontation between brothers - Sakshi

తలకు దెబ్బ తగిలిన చిన్నారి అఖిలను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

నెక్కొండ(నర్సంపేట) : ఇద్దరు అన్నదమ్ముల మ« ద్య జరుగుతున్న గొడవను చూసేందుకు వెళ్లిన ఓ చిన్నారి తలకు తీవ్ర గాయమై మృతి చెందిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మం డలంలో గురువారం చోటుచేసుకుంది. తండావా సులు, బంధువుల కథనం ప్రకారం..  మండలం లోని గొల్లపెల్లి శివారు ధర్మతండలో బుధవారం రాత్రి అన్నదమ్ములు బాదావతు శంకర్, నర్సింహలు ఇంటి వద్ద బాట విషయంలో గొడవకు దిగారు.

తమ్ముడు నర్సింహ తాగిన మైకంలో శంకర్‌ కుటుంబ సభ్యులను తిట్టడంతో ఇరువురి మధ్య గొడవ ముదిరి దాడులకు దారితీసింది. దీంతో నర్సింహ రాళ్లతో దాడి చేయడగా శంకర్‌ భార్య తార చాతికి తగలడంతో ఆమె కేకలు వేసింది. ఈ క్రమంలో బాదావతు లక్ష్మీ–వీరన్న కుమార్తె అఖిల(11) పెద్దమ్మా అంటూ తార దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలో నర్సింహ విసిరిన బండరాయి అఖిల తల వెనుక భాగంలో గట్టిగా తగలడంతో స్పృహ కోల్పోయింది.

తండావాసులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని అఖిలను ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందిం ది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement