girl injured
-
HYD: బంజారాహిల్స్ సిటీ సెంటర్లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ మాల్లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ప్లే జోన్లో మెషిన్లో పడి మూడేళ్ల చిన్నారి చేతి వేళ్లు తెగిపోయాయి. దీంతో చిన్నారిని తల్లిదండ్రులు యశోద ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. వివరాలు. ఇబ్రహీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం సెలవు కావడంతో తన ముగురు పిల్లలతో కలిసి బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ మాల్‌కు వచ్చాడు. మాల్లో నాలుగో అంతస్తులో ఉన్న స్మాల్ ప్లే ఏరియాలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈక్రమంలో అక్కడ తెరిచి ఉన్న ఓ మిషన్‌లో అనుకోకుండా మూడేళ్ల మెహ్వీష్ అనేక బాలిక చేయి చేపట్టడంతో ఆమె చేతి వేళ్లు నలిగిపోయాయి. చిన్నారిని వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక కుడిచేతి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయితే చిన్నారి మూడు వేళ్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం భద్రతా వైఫల్యం వల్లే జరిగిందని, సిటీ సెంటర్ యాజమాన్యంపై చిన్నారి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిటీ సెంటర్ మాల్ యాజమాన్యంపై బంజారాహిల్స్ పీఎస్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెకు జరిగిన నష్టానికి సెంటర్ మాల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్ చేశాడు. చదవండి: ప్రియాంక క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్ -
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి..!
జైపూర్(చెన్నూర్) : ప్రేమ పేరుతో ఏడాది కాలం పాటు వేధింపులకు పాల్పడడ్డ యువకుడు చివరకు తన ప్రేమను అంగికరించడం లేదన్న కసితో యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మి–చంద్రయ్య దంతపలు చిన్నకుమార్తె మౌనిక(19) ఇంటర్ చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కామెర విజయ–బాపు దంపతుల చిన్నకుమారుడైన శ్రీనివాస్ ఇంటర్ వరకు చదివి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఏడాది కాలంగా శ్రీనివాస్ మౌనికను తన ప్రేమను అంగికరించాలని వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని మౌనిక తన కుటుంబసభ్యులకు తెలపడంతో కొంత కాలం క్రితం శ్రీనివాస్‌ను మందలించారు. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. దీంతో కోపం పెంచుకున్న శ్రీనివాస్ బుధవారం సాయంత్రం కిరాణా దుకాణం వద్దకు వచ్చిన మౌనికపై కత్తితో దాడి చేశాడు. కడుపులో పొడిచి చేతికి గాయం చేశాడు. స్థానికులు గమనించి మౌనికను 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని శ్రీరాంపూర్ సీఐ నారాయణనాయక్, ఎస్సై విజేందర్ పరిశీలించి వివరాలు సేకరించారు. మౌనిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అన్నదమ్ముల మధ్య గొడవలో చిన్నారి మృతి
నెక్కొండ(నర్సంపేట) : ఇద్దరు అన్నదమ్ముల మ« ద్య జరుగుతున్న గొడవను చూసేందుకు వెళ్లిన ఓ చిన్నారి తలకు తీవ్ర గాయమై మృతి చెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మం డలంలో గురువారం చోటుచేసుకుంది. తండావా సులు, బంధువుల కథనం ప్రకారం.. మండలం లోని గొల్లపెల్లి శివారు ధర్మతండలో బుధవారం రాత్రి అన్నదమ్ములు బాదావతు శంకర్, నర్సింహలు ఇంటి వద్ద బాట విషయంలో గొడవకు దిగారు. తమ్ముడు నర్సింహ తాగిన మైకంలో శంకర్ కుటుంబ సభ్యులను తిట్టడంతో ఇరువురి మధ్య గొడవ ముదిరి దాడులకు దారితీసింది. దీంతో నర్సింహ రాళ్లతో దాడి చేయడగా శంకర్ భార్య తార చాతికి తగలడంతో ఆమె కేకలు వేసింది. ఈ క్రమంలో బాదావతు లక్ష్మీ–వీరన్న కుమార్తె అఖిల(11) పెద్దమ్మా అంటూ తార దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలో నర్సింహ విసిరిన బండరాయి అఖిల తల వెనుక భాగంలో గట్టిగా తగలడంతో స్పృహ కోల్పోయింది. తండావాసులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని అఖిలను ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందిం ది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. -
భవనంపై నుంచి పడిన చిన్నారి
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములావాడ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. రెండతస్థుల భవనం పై ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడింది. భవనం పై నుంచి ఇంటి ముందు ఉన్న గేటుపై పడటంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన పట్టణంలోని అర్బన్ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. -
ప్రకాశం జిల్లాలో దారుణం
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. తన ప్రేమను ఒప్పుకోలేదని.. మైనర్ బాలికపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వలేటివారిపాలెంలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న ఓ మైనర్ బాలిక(14)ను అదే ప్రాంతానికి చెందిన అంకయ్య(35) గత కొంత కాలంగా ప్రేమ పేరిట వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక ప్రేమను అంగీకరించకపోవడంతో.. కోపోద్రిక్తుడై ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. అనంతరం బాలిక పేరు మార్చి పామూరు ఆస్పత్రిలో చేర్చాడు. పరిస్థితి విషమించడంతో.. అక్కడి నుంచి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని నడుముకు కింది భాగం మొత్తం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఫేస్బుక్ గాళ్‌ఫ్రెండ్’ను కలిసిన తొలిసారే..
కోయంబత్తూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలు ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు గాజుముక్కతో ఆమె మెడను కోశాడు. ఆమెను కలిసిన తొలిసారే యువకుడు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు తమిళనాడులోని కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోయంబత్తూరుకు చెందిన కనకలక్ష్మి (21) అనే యువతి భారతీయార్ యూనివర్శిటీలో ఎంసీఏ తొలి సంవత్సరం చదువుతోంది. ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా వేంబురాజ్ (28) అనే యువకుడు పరిచయమయ్యాడు. రామనాథపురం జిల్లాకు చెందిన వెంబురాజ్ చెన్నైలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ తరచూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కొన్ని నెలల తర్వాత వెంబురాజ్ ప్రేమ విషయాన్ని తెలపగా, ఆమె తిరస్కరించింది. తాను చదువుపై దృష్టిపెట్టాలంటూ తెలిపింది. అయితే ఆన్లైన్లో ఇద్దరూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కనకలక్ష్మి ఫోన్ నెంబర్ సంపాదించిన వెంబురాజ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన కనకలక్ష్మి మాట్లాడటం మానేసింది. దీంతో వెంబురాజ్ నేరుగా ఆమెను కలవాలనుకున్నాడు. గత బుధవారం భారతీయార్ యూనివర్శిటీకి వెళ్లి బస్‌స్టాప్‌లో కనకలక్ష్మిని తొలిసారి కలిశాడు. వెంబురాజ్ మరోసారి ప్రేమ, పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆమె తిరస్కరించింది. అతను వెంటనే అక్కడ ఉన్న బాటిల్‌ను పగలగొట్టి గాజు ముక్కతో ఆమె మెడను కోశాడు. అక్కడున్న విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికే వెంబురాజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు కనకలక్ష్మిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వెంబురాజ్ను అరెస్ట్ చేశారు. -
వంట చేస్తుండగా ప్రమాదం
విజయనగరం: ప్రమాదవశాత్తు బాలికకు నిప్పంటుకొని తీవ్రంగా గాయాలపాలైంది. ఈ సంఘటన విజయనగరం జిల్లా మక్కువ మండలం కప్పబుచ్చంపేట గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. కప్పబుచ్చంపేట గ్రామానికి చెందిన రాయల శృతి(13) కాశీపట్నంలోని కస్తూర్బా పాఠశాలలో 8వతరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు వచ్చిన బాలిక ఇంటివద్దనే ఉంది. ఈ క్రమంలో సోమవారం వంట చేసేందుకు ప్రయత్నిస్తుండగా చున్నీకి నిప్పు అంటుకొని మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే బాలిక ను బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైజాగ్‌లోని కేజీహెచ్ కు తీసుకువెళ్లాల్సిందిగా వైద్యులు సిఫారసు చేశారు. (మక్కువ) -
ఎస్సై గాల్లోకి కాల్పులు:ఇద్దరికి గాయాలు
నెల్లూరు: జిల్లాలోని బంగారుపాలెంలో దొంగలను పట్టుకునేందుకు ఎస్పై గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దొంగలు పట్టుకునే క్రమంలో ఎస్సై సోదాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుని గ్రామానికి చేరుకున్నాడు. పోలీసులు సోదాలను నిర్వహిస్తుండగా దొంగలు ఎదురుదాడికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితి తీవ్ర రూపం దాల్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎస్సై జరిపిన కాల్పుల్లో ఇద్దరు దొంగలు గాయపడ్డారు. పోలీసులు కాల్పులకు పాల్పడటాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.