HYD: బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో దారుణం.. | 3 years Old Girl Injured in Banjara Hills City Center Mall | Sakshi
Sakshi News home page

Hyderabad: బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో దారుణం.. ప్లే జోన్లో మెషిన్‌లో పడి..

Published Sun, May 7 2023 8:20 PM | Last Updated on Mon, May 8 2023 10:06 AM

3 years Old Girl Injured in Banjara Hills City Center Mall - Sakshi

సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ మాల్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ప్లే జోన్లో మెషిన్‌లో పడి మూడేళ్ల చిన్నారి చేతి వేళ్లు తెగిపోయాయి. దీంతో చిన్నారిని తల్లిదండ్రులు యశోద ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు.  

వివరాలు. ఇబ్రహీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం సెలవు కావడంతో తన ముగురు పిల్లలతో కలిసి బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ మాల్‌‌కు వచ్చాడు. మాల్‌లో నాలుగో అంతస్తులో ఉన్న స్మాల్ ప్లే ఏరియాలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈక్రమంలో అక్కడ తెరిచి ఉన్న ఓ మిషన్‌లో అనుకోకుండా మూడేళ్ల మెహ్వీష్ అనేక బాలిక చేయి చేపట్టడంతో ఆమె చేతి వేళ్లు నలిగిపోయాయి. చిన్నారిని వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక కుడిచేతి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయితే చిన్నారి మూడు వేళ్లను తొలగించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రమాదం భద్రతా వైఫల్యం వల్లే జరిగిందని, సిటీ సెంటర్‌ యాజమాన్యంపై చిన్నారి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిటీ సెంటర్ మాల్‌ యాజమాన్యంపై బంజారాహిల్స్ పీఎస్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు మాల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెకు జరిగిన నష్టానికి సెంటర్ మాల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్‌ చేశాడు.
చదవండి: ప్రియాంక క్ష‌మాప‌ణ చెప్పాలి.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement