City Centre Mall
-
HYD: బంజారాహిల్స్ సిటీ సెంటర్లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ మాల్లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ప్లే జోన్లో మెషిన్లో పడి మూడేళ్ల చిన్నారి చేతి వేళ్లు తెగిపోయాయి. దీంతో చిన్నారిని తల్లిదండ్రులు యశోద ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. వివరాలు. ఇబ్రహీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం సెలవు కావడంతో తన ముగురు పిల్లలతో కలిసి బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ మాల్‌కు వచ్చాడు. మాల్లో నాలుగో అంతస్తులో ఉన్న స్మాల్ ప్లే ఏరియాలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈక్రమంలో అక్కడ తెరిచి ఉన్న ఓ మిషన్‌లో అనుకోకుండా మూడేళ్ల మెహ్వీష్ అనేక బాలిక చేయి చేపట్టడంతో ఆమె చేతి వేళ్లు నలిగిపోయాయి. చిన్నారిని వెంటనే కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక కుడిచేతి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయితే చిన్నారి మూడు వేళ్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం భద్రతా వైఫల్యం వల్లే జరిగిందని, సిటీ సెంటర్ యాజమాన్యంపై చిన్నారి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిటీ సెంటర్ మాల్ యాజమాన్యంపై బంజారాహిల్స్ పీఎస్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెకు జరిగిన నష్టానికి సెంటర్ మాల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్ చేశాడు. చదవండి: ప్రియాంక క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్ -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్లో గురువారం రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. కొంత సమయానికే భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 20 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం సైతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో 200 నుంచి 300 మంది మరకు సిటీ సెంటర్ మాల్లో ఉన్నారు. తొలుత దీన్ని లెవల్ 1 ప్రమాదమని ప్రకటించారు. ఆపై తీవ్రతను చూసి లెవల్ 3 (భారీ) అగ్ని ప్రమాదమని తెలిపారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో శుక్రవారం ఉదయం ఈ అగ్నిప్రమాదాన్ని లెవల్ 5 ఘటనగా పేర్కొన్నారు. సిటీ సెంటర్ మాల్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మాల్ పక్కనే ఉన్న 55 అంతస్తుల భవనాన్ని ఖాళీ చేయించి దానిలో ఉన్న 3500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. (చదవండి: సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం) మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో నలుగురు అగ్నిమాపక సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం జేజే ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం వరకు మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఒకేరోజు ముంబైలో రెండు అగ్నిప్రమాదాలు సంభవించాయి. గురువారం అంతకుముందు కుర్లా వెస్ట్ ప్రాంతంలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. రెండు గంటలపాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. -
మెక్‌డొనాల్డ్స్‌లో ఉడకని చికెన్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1/10 చౌరస్తాలో ఉన్న సిటీ సెంటర్ మాల్లో మెక్ డొనాల్డ్స్ ఆహార కేంద్రంలో ఉడకని చికెన్ వడ్డించారంటూ బాధితులు ఆదివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–1లో ఉన్న సిటీ సెంటర్ మాల్‌లోకి శివశంకర్ అనే జర్నలిస్ట్‌తో పాటు ఆయన స్నేహితుడు శ్రీనివాస్ శనివారం రాత్రి షాపింగ్‌కు వెళ్లారు. అనంతరం మెక్‌డొనాల్డ్స్‌లో చికెన్ వింగ్స్ తినడానికి ఆర్డర్ చేశారు. ఆ తరువాత దానిని తింటుండగా సరిగ్గా ఉడకలేదని శివశంకర్ గుర్తించారు. ఇదే విషయాన్ని బాధితుడు నిర్వాహకుల్ని నిలదీశాడు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుందని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేనేజర్ వచ్చి ఇంకో ఆర్డర్ తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. ఈ చికెన్ హర్యానా, పంజాబ్ నుంచి సగం ఉడకబెట్టి వస్తుందని, ఇక్కడికి వచ్చాక మళ్లీ మిగతా సగాన్ని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఉడకబెట్టి ఇస్తుంటామని, ఇందులో చిన్న పొరపాటు జరుగుతుందని సర్దిచెప్పారు. అయితే.. తిన్న వెంటనే పచ్చి చికెన్ తిన్న ఫీలింగ్ రావడం, బయటికి వచ్చి వాంతులు చేసుకోవడం జరిగింది. రాత్రంతా వీరు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. -
సిటీ సెంటర్‌మాల్‌లో అగ్ని ప్రమాదం
బెంగళూరు : కర్ణాటకలోని మంగళూరులో ఉన్న సిటీ సెంటర్ మాల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న జనం భయంతో పరుగులు పెట్టారు. ఈ భవనంలో నాలుగవ అంతస్థులో ఉన్న ఫూడ్ షాప్‌లో మంటలు అంటుకోవడంతో కాంప్లెక్స్ నిండా దట్టమైన పొగలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపుచేశాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు క్లియరెన్స్, అగ్నిమాపక శాఖనుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే సంవత్సరాల తరబడి ఈ మల్టీపెక్స్ భవనంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2010లో ఆవిష్కరించిన ఈ భవనానికి అవసరమైన అనుమతులు లేవనియాక్టవిస్టు విద్యా దినకర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఫైర్విభాగం అధికారి శివశంకర విచారణ చేస్తున్నామని తెలిపారు. -
సిటీసెంటర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
బొమ్మలతో రిలేషన్ పెరిగింది
‘మన చిన్నప్పుడు ఏవో కొన్ని మట్టి బొమ్మలు అవీ ఉండేవి. వాటితోనే ఆడుకునేవాళ్లం. ఇప్పుడు చిన్నాళ్లకి మనలా కాదు. బోలెడన్ని వెరైటీలు వచ్చేశాయి. వీళ్లు చాలా లక్కీ’ అంటున్నారు హీరో కృష్ణుడు. సరదా నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో బంజారాహిల్స్‌లోని సిటీసెంటర్ మాల్లో ఏర్పాటు చేసిన టెడ్డీ మౌంటైన్ ఇండియా షోరూమ్ ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముచ్చటిస్తూ... తన రెండేళ్ల కూతురు నిత్య కోసం తరచుగా షాపింగ్ చేస్తున్నానని, అందుకే బొమ్మలతో చిన్నప్పటి కంటే ఇప్పుడే రిలేషన్ పెరిగిందని నవ్వుతూ చెప్పారు. వెయిట్ తగ్గించు కోవడంపై మాట్లాడుతూ... ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నానని, ఆల్రెడీ 8 కిలోలకు పైగానే తగ్గానన్నారు. నాన్‌వెజ్ కన్నా స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువ తినడమే తాను బొద్దుగా మారడానికి కారణమన్నారు. ప్రస్తుతానికి వాటిని పూర్తిగా దూరం పెట్టేశానన్నారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ మీ టెడ్డీబేర్‌ను మీరే తయారు చేసుకోండి అనే సరికొత్త కాన్సెప్ట్ తమ ప్రధాన ఆకర్షణ అని తెలిపారు.