బొమ్మలతో రిలేషన్ పెరిగింది | Teddy Mountain India showroom | Sakshi
Sakshi News home page

బొమ్మలతో రిలేషన్ పెరిగింది

Published Thu, Dec 25 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

బొమ్మలతో రిలేషన్ పెరిగింది

బొమ్మలతో రిలేషన్ పెరిగింది

‘మన చిన్నప్పుడు ఏవో కొన్ని మట్టి బొమ్మలు అవీ ఉండేవి. వాటితోనే ఆడుకునేవాళ్లం. ఇప్పుడు చిన్నాళ్లకి మనలా కాదు. బోలెడన్ని వెరైటీలు వచ్చేశాయి. వీళ్లు చాలా లక్కీ’ అంటున్నారు హీరో కృష్ణుడు. సరదా నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో బంజారాహిల్స్‌లోని సిటీసెంటర్ మాల్‌లో ఏర్పాటు చేసిన టెడ్డీ మౌంటైన్ ఇండియా షోరూమ్
 ప్రారంభోత్సవంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారితో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముచ్చటిస్తూ... తన రెండేళ్ల కూతురు నిత్య కోసం తరచుగా షాపింగ్ చేస్తున్నానని, అందుకే బొమ్మలతో చిన్నప్పటి కంటే ఇప్పుడే రిలేషన్ పెరిగిందని నవ్వుతూ చెప్పారు. వెయిట్ తగ్గించు కోవడంపై మాట్లాడుతూ... ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నానని, ఆల్రెడీ 8 కిలోలకు పైగానే తగ్గానన్నారు. నాన్‌వెజ్ కన్నా స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువ తినడమే తాను బొద్దుగా మారడానికి కారణమన్నారు. ప్రస్తుతానికి వాటిని పూర్తిగా దూరం పెట్టేశానన్నారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ మీ టెడ్డీబేర్‌ను మీరే తయారు చేసుకోండి అనే సరికొత్త కాన్సెప్ట్ తమ ప్రధాన ఆకర్షణ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement