సిటీ సెంటర్‌మాల్‌లో అగ్ని ప్రమాదం | Mangaluru  Fire Accident in City Central mall  | Sakshi
Sakshi News home page

సిటీ సెంటర్‌ మాల్‌లో అగ్ని ప్రమాదం

Published Thu, Feb 21 2019 2:33 PM | Last Updated on Thu, Feb 21 2019 4:26 PM

Mangaluru  Fire Accident in City Central mall  - Sakshi

బెంగళూరు : కర్ణాటకలోని మంగళూరులో ఉన్న సిటీ సెంటర్ మాల్‌లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న జనం భయంతో పరుగులు పెట్టారు.  ఈ భవనంలో నాలుగవ అంతస్థులో ఉన్న ఫూడ్‌ షాప్‌లో మంటలు అంటుకోవడంతో కాంప్లెక్స్ నిండా దట్టమైన పొగలు వ్యాపించాయి.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.  సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలు అదుపుచేశాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు క్లియరెన్స్‌, అగ్నిమాపక శాఖనుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ లేకుండానే సంవత్సరాల తరబడి ఈ మల్టీపెక్స్‌ భవనంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  2010లో  ఆవిష్కరించిన ఈ భవనానికి అవసరమైన అనుమతులు లేవనియాక్టవిస్టు  విద్యా దినకర్‌ ఆరోపించారు.  ఈ ఆరోపణలపై స్పందించిన ఫైర్‌విభాగం అధికారి శివశంకర విచారణ చేస్తున్నామని   తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement