ప్రతీకాత్మక చిత్రం
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని రెడ్డివారిపల్లి పంచాయతీ, ఎగువరెడ్డివారిపల్లిలోని ఎస్‌ఎల్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చంద్రగిరికి చెందిన మునిరాజ కుమార్తె మోహనకృష్ణ(19) చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎగువరెడ్డివారిపల్లిలోని తన మేనమామ బాలకృష్ణ చూసుకుంటున్నారు. మోహన్‌కృష్ణ ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్స రం చదువుతోంది.
చదవండి: భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యం
ఈ క్రమంలో నాగయ్యగారిపల్లికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. వారం రోజుల క్రితం బాలిక.. ప్రేమించిన యువకుడితో కలిసి పారిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమజంటకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. తన ప్రియుడికిచ్చి పెళ్లిచేయకుండా దూరం చేశారనే మనస్తాపంతో యువతి గురువారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వంశీధర్ తెలిపారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment