
అమ్మాయిలపై కామెంట్లు.. అడ్డుకున్నందుకు హత్య!
అమ్మాయిలను ఏడిపించడం వల్ల విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ.. ఓ విద్యార్థి మరణానికి కారణమైంది.
అమ్మాయిలను ఏడిపించడం వల్ల విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ.. ఓ విద్యార్థి మరణానికి కారణమైంది. హైదరాబాద్ కోఠి ప్రాంతంలోని డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థి హత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. సతీష్ అనే విద్యార్థి అదే కళాశాలకు చెందిన కొంతమంది అమ్మాయిలపై కామెంట్లు చేశాడని, బీకాం రెండో సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ రావు అనే విద్యార్థి అతడిని అడ్డుకున్నాడని సుల్తాన్బజార్ ఏసీపీ గిరిధర్ తెలిపారు.
ఇలా అడ్డుకున్నందుకు సతీష్కు కోపం వచ్చి, హర్షవర్ధన్ రావుపై దాడి చేశాడన్నారు. ఛాతీపైన, మెడమీద బలమైన గాయాలు కావడంతో హర్షవర్ధన్ మృతిచెందినట్లు ఏసీపీ వివరించారు. మృతుడు హర్షవర్ధన్ రావు రాంకోఠి నివాసి కాగా, నిందితుడు సతీష్ హైదరాబాద్లోని జియాగూడ ప్రాంతానికి చెందినవాడని వివరించారు. ఈ ఘటనపై పోలీసులకు హర్షవర్ధన్ రావు తండ్రి ఫిర్యాదు చేశారు.