harshavardhan rao
-
Neena Rao: బిడ్డ మేధాశక్తిని గ్రహించండి! బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి..
ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. హర్షవర్ధన్ రావు... యూఎస్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న ఆదిలాబాద్ కుర్రాడు. తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడినప్పుడు పిల్లలు అక్కడే చదువుకుంటారు... అందులో కొత్త, వింత ఏమీ ఉండకపోవచ్చు. అయితే హర్ష ఒక విజేత. అతడి తల్లి నీనారావు అతడి మార్గదర్శి. కొడుకును తీర్చిదిద్దడం కోసం ఆమె తన కెరీర్‌ను వదులుకున్నారు. ఇప్పుడు హర్ష చదువు, ఆటపాటలు, హార్స్‌రైడింగ్ వంటి నైపుణ్యాల్లో ఆరితేరాడు. నేషనల్ లెవెల్ హార్స్ రైడింగ్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నాడు. సానుభూతి చూపులతో సాంత్వన పొంది, అంతటితో తృప్తి పడి ఉంటే ఈ రోజు తన కొడుకును విజేతగా చూపించగలిగేవారు కాదు నీనారావు. ఈ ప్రయత్నంలో ఆమె టాప్ 100 హెల్త్ కేర్ లీడర్స్ కేటగిరీలో చేరారు. ఈ సందర్భంగా సాక్షితో ఆమె పంచుకున్న వివరాలు. నా దిశ మారింది! ‘‘మాది మహారాష్ట్ర, మా వారిది మంచిర్యాల. అలా తెలుగింటి కోడలి నయ్యాను. నా జీవితాన్ని రెండు వేర్వేరు పార్శ్వాలుగా చూడాలి. తొలి పార్శ్వం పూర్తిగా అకడమిక్ గా సాగింది. పీహెచ్డీ పూర్తి చేసి ఎకనమిక్స్, హిస్టరీ, నేచురల్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ విధానాలు, పర్యావరణ నిర్వహణ వంటి అంశాల మీద అనేక పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద సమర్పించాను. యూఎస్‌లో నివసిస్తున్న నేటివ్ అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్ జాతులు, మనదేశంలో నాగాలాండ్, అండమాన్, ఇతర ఆదివాసీ జాతుల మీద పరిశోధనలు నిర్వహించాను. మా అబ్బాయి హర్షవర్ధన్ స్పెషల్ నీడ్స్ కిడ్ అని తెలిసిన తరవాత నా పంథా పూర్తిగా మారిపోయింది. మేము గుర్తించడం కూడా ఆలస్యంగానే జరిగింది. ఆ తర్వాత ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తనకు పన్నెండేళ్లు నిండినప్పుడు మేము యూఎస్‌కి తీసుకెళ్లిపోయాం. ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉందని చెప్పారు అక్కడి డాక్టర్లు. అంటే తన మనసులో అనుకున్న విషయాన్ని సంభాషణ ద్వారా వ్యక్తీకరించడంలో తగినంత చురుగ్గా లేకపోవడం అనవచ్చు. హర్ష చాలా తెలివైన పిల్లాడు, తన సమస్యను అధిగమించడానికి తల్లిదండ్రులుగా మా వంతు సపోర్టునివ్వాలి. అందుకోసం ఆటిజమ్‌తో సంబంధం ఉన్న అనేక సంస్థలు, నిపుణులను సంప్రదించాను. తనను ది బెస్ట్ కిడ్‌గా తయారు చేసుకోగలిగాను. యూఎస్‌లో హైస్కూల్లో ఆనర్స్ చేసి అండర్ గ్రాడ్యుయేషన్‌లో చేరాడు. హార్స్ రైడింగ్‌లో చురుగ్గా ఉన్నాడు. ఇంకో విషయం... మా అబ్బాయి యూఎస్‌లో చదివినప్పటికీ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు చదవడం రాయడం కూడా బాగా నేర్చుకున్నాడు. నేను ఇంతగా శ్రమించడానికి ఆర్థిక వెసులుబాటు ఉంది. అలాగే భర్త, ఇతర కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. ఐదువందల మందిలో ఒక బిడ్డ ఇలా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రపంచంలో నాలాంటి తల్లులు ఇంకా ఉన్నారు. అయితే వాళ్లందరికీ నాకు ఉన్న వెసులుబాటు ఉండకపోవచ్చు. అందుకే హర్ష కోసం యూఎస్, యూకే, ఇండియాలోని నిపుణుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలన్నింటినీ క్రోడీకరిస్తూ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల కోసం ఒక నియమావళిని రూపొందించాను. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేని పేదవాళ్లకు మార్గిక సేవాసంస్థ నుంచి సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా ప్రత్యేక సేవలందించాం. పేరెంట్స్తోపాటు స్పెషల్ ఎడ్యుకేటర్స్కి శిక్షణనిచ్చాం. వాళ్లు పిల్లలకు ఫోన్ ద్వారా రోజుకో టాస్క్ ఇస్తూ రోజంతా ఒక వ్యాపకంలో మునిగేలా చేశారు. అలాగే సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లకు కూడా థియరిటికల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నాం. సానుభూతి వద్దు! ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లులకు నేను చెప్పేది ఒక్కటే. పిల్లలు పుట్టిన తర్వాత నెలలు గడిచే కొద్దీ మెడ నిలపాల్సిన సమయానికి మెడ నిలపకపోవడం, కూర్చోవాల్సిన సమయానికి కూర్చోకపోవడం, మాట్లాడాల్సిన వయసుకి మాట్లాడకపోవడం వంటి తేడాని గుర్తించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎవరూ ఇలాంటి స్థితిని కోరు కోరు. కానీ ఎదురైన తర్వాత ఎదుర్కోవడం ఒక్కటే మన ముందున్న ఆప్షన్. మానసికంగా కుంగిపోవద్దు. దేనినీ దాచవద్దు. పిల్లలను సమాజానికి చూపించకుండా ఇంట్లో ఉంచే ప్రయత్నం చేయవద్దు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచాలి. పిల్లల మూడ్‌ని బట్టి ఆ సమయంలో వారిని ఎలా డీల్ చేయాలనే విషయంలో శిక్షణ తీసుకోవాలి. ఆ అవగాహనతో మెలగాలి. వారిలో తప్పనిసరిగా ప్రత్యేకమైన కళ ఏదో ఉండి తీరుతుంది. దానిని గ్రహించండి. దానిని సాధన చేయించండి. నేను ఓ చాంపియన్‌కి తల్లినయ్యాను. మీ బిడ్డ ఐన్‌స్టీన్ కావచ్చు... మీరు ఐన్‌స్టీన్ తల్లి కావచ్చు’’ అన్నారు నీనారావు. సింపతీ కోరుకోవద్దని తల్లులకు చెబుతూనే, ‘ప్రత్యేకమైన పిల్లల పట్ల, ఆ తల్లిదండ్రుల పట్ల సానుభూతి చూపించడం మానేయండి. దానికి బదులు ప్రోత్స హించండి’ అని సమాజానికి హితవు చేశారామె. ప్రత్యేక చిత్రకారులు స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్లో కొందరు చక్కగా పాటలు పాడేవాళ్లున్నారు. మరొకరు చక్కగా బొమ్మలు వేస్తారు. మరొకరు మంచి కవితలు రాస్తారు. వాళ్లలోని సృజనాత్మకతను బయటకు తీయడం మన బాధ్యత. పిల్లలు వేసిన బొమ్మలు, కవితలతో ఓ పుస్తకం ప్రచురించాం. మేఘన తల్లి ఇద్దరమ్మాయిలున్న సింగిల్ పేరెంట్. ఆ అమ్మాయి వేసిన బొమ్మ చూడండి. చెట్టుకొమ్మకు కట్టిన ఊయల, ఆ ఊయలలో తల్లి రూపం ఉంది. ఊయల లోపల పాపాయి ఉంది. పన్నెండేళ్ల అమ్మాయి మాతృత్వాన్ని ఎంత అద్భుతంగా చిత్రించిందో చూడండి. మరో అమ్మాయి సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుని చక్కటి నినాదాలతో బొమ్మలు వేసింది. తమ మేధను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మాధ్యమాన్ని ఎంచుకున్నట్లే వీరు కూడా. – డాక్టర్ నీనారావు, ఫౌండర్, మార్గిక స్వచ్ఛంద సంస్థ – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోహనాచారి -
హర్షవర్థన్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ
-
హర్షవర్థన్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ
హైదరాబాద్ : సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌రావు మృతికి సంతాపంగా సోమవారం విద్యార్థులు శాంతి ర్యాలీ చేపట్టారు. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్థన్‌పై సతీష్ కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయటంతో హర్షవర్థన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా హర్షవర్థన్ అంతిమ యాత్రలో నిన్న వందలాదిమంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం వైఖరిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల గేట్లు తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి మృతి పట్ల తమకు ఆవేదన, ఆందోళన ఉందని కళాశాల అధ్యాపకులు తెలిపారు. కాగా హర్షవర్థన్‌పై దాడి చేసి అతడి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థి సతీష్ కోడ్కర్ను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతడిని రహస్య ప్రాంతాలకు తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే సతీష్ అరెస్ట్‌ను పోలీసులు ధ్రువీకరించలేదు. నిందితుడిని ఇవాళ లేదా మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. -
అంతిమయాత్రలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌రావు అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహా విద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్ధన్‌పై సతీష్కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయడంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసింది. ఆదివారం ఉదయం ఉస్మానియాలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో మార్చురీ వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా... తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యం తమ య్యారు. కొద్ది సేపటి తర్వాత అంతమయాత్ర ప్రారంభమైంది. కళాశాలలోకి తోసుకెళ్లిన విద్యార్థులు... అంతిమయాత్రలో వందలాది మంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. యాత్ర ప్రగతి మహావిద్యాలయ కళాశాల వద్దకు చేరుకోగానే విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. హర్షవర్ధన్ అమర్హై... కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు కళాశాల ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. కనీసం హర్షవర్ధన్ మృతదేహాన్ని చూడటానికి కూడా కళాశాల యాజమాన్యం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న విద్యార్థులు కళాశాల గేట్లను తోసుకొని లోపలికి దూసుకెళ్లారు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులను పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో విద్యార్థులు కళాశాల కిటికీ అద్దాలతో పూలకుండీలు, అక్కడ పార్క్ చేసిన ఉన్న ఓ కారు అద్దాలను ధ్వంసం చేశారు. మృతదేహాన్ని కాలేజీ వద్ద ఉంచి కొద్దిసేపు నినాదాలు చేశారు. మృతుడి బంధువులు సముదాయించడంతో విద్యార్థులు ఆందోళన విరమించి అంతిమయాత్రను కొనసాగించారు. అనంతరం పురానాపూల్ శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. పలువురి సందర్శన... హర్షవర్ధన్ కుటుంబ సభ్యులను అంతకు ముందు టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, టీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి ప్రేమ్‌కుమార్‌దూత్, టీఆర్ఎస్ నాయకురాలు పడాల లలిత తదితరులు పరామర్శించారు. -
ప్రశ్నించినందుకు ప్రాణం తీశాడు
అమ్మాయిని ఎందుకు టీజ్ చేస్తున్నావన్న జూనియర్‌పై పిడిగుద్దులు కురిపించిన సీనియర్ విచక్షణరహితంగా కొట్టడంతో క్లాస్‌రూంలో అపస్మారక స్థితిలో పడిపోయిన హర్షవర్ధన్‌రావు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య నాలుగు గంటలు పోరాడి మృత్యుఒడిలోకి.. నగరంలోని ప్రగతి మహా విద్యాలయలో ఘటన సాక్షి, హైదరాబాద్: అమ్మాయిని ఎందుకు టీజ్ చేస్తున్నావని అడిగిన పాపానికి పిడిగుద్దులు కురిపించాడు.. సీనియర్‌నన్న తలబిరుసుతో జూనియర్ విద్యార్థిని ఇష్టానుసారం కొట్టాడు.. చివరికి ఆ విద్యార్థి 4 గంటలపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి ప్రాణాలు వదిలాడు! నగరం నడిబొడ్డున సుల్తాన్‌బజార్ లోని ప్రగతి మహా విద్యాలయలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రాంకోఠికి చెందిన ఆటోమొబైల్ వ్యాపారి నర్సింగ్‌రావు రెండో కుమారుడు కోట హర్షవర్ధన్ రావు(18) ప్రగతి మహా విద్యాలయంలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కాలేజీలో జియాగూడకు చెందిన సతీశ్ కోడ్కర్(19) బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామ సమయంలో విద్యార్థులు క్లాస్ రూమ్‌లోంచి బయటికి వచ్చారు. తరగతి గదిలో హర్షవర్ధన్, మరో విద్యార్థిని ఉన్నారు. ఇదే సమయంలో రూమ్ నంబర్ 211లో ఉన్న సతీశ్... 203 రూమ్‌లో ఉన్న హర్షవర్ధన్ తరగతి గదికి వచ్చాడు. వస్తూనే విద్యార్థినిని తన మాటలతో వేధించాడు. ‘‘ఆమెను ఎందుకు కామెంట్ చేస్తున్నావు’’ అని హర్షవర్ధన్ నిలదీశాడు. దీంతో సీనియర్లనే ప్రశ్నిస్తావా.. అంటూ హర్షవర్ధన్‌పై సతీశ్ విచక్షణరహితంగా పిడిగుద్దులు కురిపించాడు. మెడ, తల వెనుక భాగం, ఛాతీపై బలంగా గుద్దడంతో హర్షవర్ధన్ అక్కడే అపస్మారక స్థితిలో పడి పోయాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆయనను బయటికి తీసుకువచ్చి, ఆటోలో సమీపంలోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్ చేశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్సకు నిరాకరించారు. వెంటనే హర్షవర్ధన్‌ను నాంపల్లి కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా చికిత్సకు నిరాకరించారు. చివరికి పోలీసుల జోక్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. సుమారు 4 గంటల పాటు ఆయన్ని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హర్షవర్ధన్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జరిగిన వివాదంపై ఆరా తీశారు. తెలివైన విద్యార్థి.. హర్షవర్ధన్‌కు తెలివైన విద్యార్థిగా పేరుంది. తండ్రి సంపాదనకు చేదోడువాదోడుగా ఉండేం దుకు పగటి పూట చదువుకుంటూ.. రాత్రి పూట అపోలో ఫార్మసీలో పనిచేస్తున్నాడు. హర్షవర్ధన్ తల్లి ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు హుటాహుటిన కేర్ ఆసుపత్రికి చేరుకుని గుండెలు పగిలేలా రోదించారు. హర్షవర్ధన్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మేమేం చేస్తాం: కాలేజీ కరస్పాండెంట్ విద్యార్థుల ఘర్షణపై కాలేజీ కరస్పాండెంట్ రాజేశ్ సి షాను వివరణ కోరగా.. ‘ఇద్దరు కొట్టుకుంటే మేమేం చేస్తాం..’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. గతంలో కూడా ఈ కాలేజీలో గొడవలు జరిగాయి. ఇటీవల ఓ విద్యార్థి ఈవ్ టీజింగ్ కేసులో జైలుకు వెళ్లాడు. గతంలో ర్యాగింగ్ కేసు సంచలనం సృష్టించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళనలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. -
అమ్మాయిలపై కామెంట్లు.. అడ్డుకున్నందుకు హత్య!
అమ్మాయిలను ఏడిపించడం వల్ల విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణ.. ఓ విద్యార్థి మరణానికి కారణమైంది. హైదరాబాద్ కోఠి ప్రాంతంలోని డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థి హత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. సతీష్ అనే విద్యార్థి అదే కళాశాలకు చెందిన కొంతమంది అమ్మాయిలపై కామెంట్లు చేశాడని, బీకాం రెండో సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ రావు అనే విద్యార్థి అతడిని అడ్డుకున్నాడని సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్ తెలిపారు. ఇలా అడ్డుకున్నందుకు సతీష్‌కు కోపం వచ్చి, హర్షవర్ధన్ రావుపై దాడి చేశాడన్నారు. ఛాతీపైన, మెడమీద బలమైన గాయాలు కావడంతో హర్షవర్ధన్ మృతిచెందినట్లు ఏసీపీ వివరించారు. మృతుడు హర్షవర్ధన్ రావు రాంకోఠి నివాసి కాగా, నిందితుడు సతీష్ హైదరాబాద్‌లోని జియాగూడ ప్రాంతానికి చెందినవాడని వివరించారు. ఈ ఘటనపై పోలీసులకు హర్షవర్ధన్ రావు తండ్రి ఫిర్యాదు చేశారు. -
చిన్న గొడవ.. చావుకు దారితీసింది!
-
విద్యార్థుల మధ్య కత్తిపోట్లు: ఒకరి మృతి?
-
విద్యార్థుల మధ్య కత్తిపోట్లు: ఒకరి మృతి
డిగ్రీ విద్యార్థుల మధ్య చిన్న విషయంలో మొదలైన గొడవ కాస్తా.. చివరకు పెద్దగా మారి కత్తిపోట్లకు దారితీసింది. దాంతో ఓ విద్యార్థి మరణించాడు. ఈ దురదృష్టకరమైన ఘటన హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగింది. జూనియర్లు, సీనియర్ల మధ్య జరిగిన గొడవలో బీకాం సెకండియార్ చదువుతున్న హర్షవర్ధనరావు అనే విద్యార్థి తీవ్రంగా కత్తిపోట్లకు గురయ్యాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా, ఫలితం లేక మరణించాడు. ఈ విషయాన్ని కేర్ వైద్యులు ధ్రువీకరించారు. సెకండియర్ చదువుతున్న హర్షవర్ధన్‌ను కొంతమంది విద్యార్థులు కలిసి ఓ సీసాతో తలపైన కొట్టినట్లు తెలిసింది. వీళ్లలో సతీష్ అనే సీనియర్ విద్యార్థి పాత్ర ఉన్నట్లు కొంతమంది చెబుతున్నారు. గొడవ పొద్దున్నే జరిగినా, హర్షవర్ధన్ మరణించిన తర్వాతే విషయం బయటకు పొక్కింది. ఇంతకుముందు కూడా విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయి. ర్యాగింగ్ కారణంగా గతంలో కొంతమందిని డిబార్ చేశారు. ప్రేమ వ్యవహారమే తాజా గొడవకు కారణమని తెలిసింది. ఇంతకుముందు కూడా విద్యార్థుల మధ్య గొడవలు ఉన్నా, పొడుచుకుని చంపుకొనేంత పరిస్థితి ఎప్పుడూ లేదు. తొలుత విద్యార్థి మృతి విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. తర్వాత ఫిర్యాదు అందడంతో మొత్తం బయటకు చెప్పారు. ఈ వ్యవహారంతో కోఠి, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.